కామంతో అధపాతాళానికి

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి.

పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.
మృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం, ఆ తరువాత ఉచ్ఛైశ్రవం, పారిజాతం, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, లక్ష్మీదేవితో సహా అనేకానేక దివ్యమైన వస్తువులు, దివ్య శరీరధారులు ఉద్భవం అవుతున్నారు. అంతి మంగా వైద్యశాస్త్రానికి అధి దేవత, శంఖుచక్ర గదాపద్మాలను ధరించి, సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువును పోలి ఉన్న దివ్య పురుషుడు ధన్వం తలి అమృత భాండంలో ఆవిర్భవించాడు. అంతవరకు ఎంతో క్రమశిక్షణతో అమృతాన్ని చిలుకుతున్న దేవదానవులకు కళ్ల ముందు అమృత భాండం కనిపించడంతో అవతలి వారికి వాటా ఇవ్వాలనే విషయాన్ని విస్మరించి ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కున్నారు. తమ మటుకు తామే అమృతాన్ని తాగేద్దామని సముద్రపు ఒడ్డున పరుగులు తీయసాగారు. ముందుగా రాక్షసులు అమృ పాత్రను పట్టుకుని పారిపోతుంటే దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మోహినీ అవతారం దాల్చాడు. మెహిని జగన్మోహనంగా నవ్వుతూ వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అక్కడ నిలుచుంది. కామానికి లొంగిపోయిన రాక్షసులు మోహినిని చూసి లొట్టలు వేసుకుంటూ, ‘అమృతాన్ని నువ్వే మాకు న్యాయంగా పంచు’ అని ఆమెను కోరారు.
‘నేనెవరినో మీకు తెలియదు. నన్ను పెద్ద చేసి మీరు చేతిలో అమృత పాత్రను పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా నన్ను అడగలేదు. ఇప్పుడు నేను ఈ అమృత పాత్రను పట్టుకుని పోతే మీరు ఏమయిపోతారు?’ అని మోహిని ఆ రాక్షసులను అడిగింది.
మోహిని మాటలు విన్న తరువాత కూడా రాక్షసులు దారికి రాలేదు. ఆమె మోహంలో పడిన వారు- ‘అమృతాన్ని నువ్వే మాకు పంచాలి’ అని పట్టుబట్టారు.
మోహిని రాక్షసుల నుంచి అమృతపాత్రను అందుకుని, ‘మీరు చక్కగా స్నానం చేసి రండి. రాక్షసులంతా ఒకవైపు, దేవతలంతా మరోవైపు కూర్చోండి. అమృతాన్ని పోస్తాను’ అని అంది మోహిని.
దేవతలు, రాక్షసులు అలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు మొదట అమృతం పోస్తుంటే, ఆమె శరీర వృష్ట భాగం రాక్షసులకు కనబడు తుంది. దాంతో వారి అమృతం మీద దృష్టి పెట్టకుండా మోహిని అంగాంగాలను చూడటంపై శ్రద్ధ పెట్టారు. అదే వారి పతనానికి కారణమైంది.
దేవతలకు మాత్రం మోహిని పవిత్రంగా కనబడుతుంది. రాక్షసులకు మాత్రం మోహజనకంగా కనబడుతోంది. ఈ పరిస్థితిని రాహువు అనే రాక్షసుడు గమ నించాడు. వెళ్లి దేవతల పంక్తిలో సూర్య చంద్రుల మధ్యన కూర్చున్నాడు. అది తెలుసుకున్న సూర్యచంద్రులు మోహినికి సైగ చేశారు. కానీ పంక్తి ధర్మాన్ని పాటించిన విష్ణువు (మోహిని) రాహువుకు కూడా అమృతాన్ని పోశాడు. కానీ, అది గొంతు దిగేలోగానే తన చక్రం చేత ఖండించాడు. అయితే, అమృతంతో కూడినందు వల్ల తల మాత్రం పడిపోలేదు. మొండేనికి కూడా ప్రాణం వచ్చింది. అదే కేతువు. తన ఉనికిని గురించి విష్ణుమూర్తికి తెలియ చెప్పారనే కోపంతోనే రాహు కేతువులు సూర్యచంద్రులను మింగుతూ ఉంటారు. అవే సూర్య చంద్ర గ్రహణాలు.

Review కామంతో అధపాతాళానికి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top