కాశీమజిలీ కథలు బలభద్రుడు

మగధ దేశాన్ని మంత్రపాల మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆ దేశానికి రాజధాని అమరావతి. రాజు భార్య పేరు చంద్రమతి. వారికి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు హైమావతి అని పేరు పెట్టారు.
హైమావతి యుక్తవయస్సు రావడంతో ఆమెకు పెండ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. దాంతో వివిధ దేశాల రాకుమారుల చిత్రపటాలను తెప్పించారు. వాటిలో కళింగదేశపు రాజు వీరపాలుని పుత్రుడు గుణవర్మ లాటదేశపు ప్రభువు శూరపాలుని పుత్రుడు ధనవర్మ చిత్రపటాలు కూడా ఉన్నాయి

గుణవర్మ మంచి అందగాడు. సకల విద్యలలో ఆరితేరాడు. వారికి మగధరాజ్యంతో తులతూగేంత సంపదలు లేవు. వారిది సాధారణ రాజ్యం. ధనవర్మ మామూలు అందగాడు. చదువు కూడా సరిగ్గా ఒంటపట్టలేదు. కాని కుబేరునితో సమానమైన ధనం ఉంది. రాజ్యం కూడా సుభిక్షంగా ఉంది.
హైమావతిని ధనం లేకపోయినా సకల విద్యలు వచ్చిన, మంచి అందగాడైన గుణవర్మకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె తండ్రి, అందగాడు కాకపోయినా, చదువు రాకపోయినా చాలా డబ్బు ఉంది కనుక హైమావతిని ధనవర్మకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె తల్లి అనుకున్నారు. రాజు మాత్రం హైమావతిని గుణవర్మకే ఇచ్చి పెళ్లి చేస్తానని తేల్చి చెప్పాడు.

హైమావతి మంచి అందగత్తె కావటంతో గుణవర్మ, ధనవర్మ ఇద్దరూ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. రాజుకు తెలియకుండా రాణి ధనవర్మకు తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని తలచింది. రాజు గుణవర్మను పెళ్లికి ఆహ్వానించాడు. అదే రోజు రాణి కూడా ధనవర్మను పెళ్లికి ఆహ్వానించింది.
ధనవర్మ, గుణవర్మ ఇద్దరూ చెరొక విడిది గృహంలో బస చేశారు. అర్ధరాత్రి సమయంలో రహస్యంగా రాణి కుమార్తె దగ్గరకు వచ్చి ‘మీ నాన్న పేదవాడైన రాకుమారునితో వివాహం చేయాలనుకుంటున్నాడు. నీవు పేదరికాన్ని అనుభవించలేవు.

కనుక ధనికుడైన ధనవర్మను వివాహం చేసుకో, నీ కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. నీవు బుట్టలో కూర్చో. నిన్ను ధనవర్మ బస దగ్గరకు మన దాసితో పంపుతాను’ అన్నది. వెంటనే హైమావతి ఆ బుట్టలో కూర్చుంది. పైన తమలపాకులు కప్పారు. ఆ బుట్టను ఒక దాసి నెత్తిమీద పెట్టుకొని ధనవర్మ విడిది చేసి ఉన్న గృహానికి బయలుదేరింది.

దాసి హైమావతిని తీసుకువెళుతున్న దారిలో ఇళ్లకు నిప్పు అంటుకుంది. దాంతో ప్రజలు తమ సామానును రక్షించుకునేందుకు బయట పడవేయసాగారు. వీటిని కొందరు దొంగలు తీసుకుపోసాగారు.

దాసిని కూడా దొంగే అని భావించి నీ నెత్తి పైనున్న బుట్టలో ఏముంది ? అని దొంగలు ప్రశ్నించగా ఆ దాసి ఆ బుట్టను కిందికి దించి తాను పారిపోయింది. చీకటిగా ఉండడంతో బుట్టలో ఏమున్నదీ సరిగా కన్పించడం లేదు. బుట్ట బరువుగా ఉండటంతో ఆ బుట్టలో విలువైన వస్తువులు ఉంటాయనుకొని దొంగలు తమతో తీసుకుపోయారు.

దొంగలు అలా చాలా దూరం ప్రయాణించి తాము దోచుకు వచ్చిన వస్తువులను పంచుకున్నారు. హైమావతి ఉన్న బుట్టను చూస్తే పైన వన్నీ తమలపాకులు ఉన్నాయి. దానిని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అది ఒక దట్టమైన అడవి. వేటకు వచ్చిన మణిప్రస్థాన రాజ్య యువరాజు జయభద్రుడు దారి తప్పాడు. దురదృష్టవశాత్తూ అతని గుర్రం కూడా అతనిని విడిచి ఎటో వెళ్లిపోయింది.

ఏమి చేయాలో తోచక అటూ ఇటూ తిరుగుతున్న జయభద్రునికి ఆ తమలపాకు బుట్ట కనిపించింది. ఇక్కడ తమలపాకుల బుట్ట ఏమిటబ్బా అనుకుంటుండగా ఆ బుట్టలో నుండి హైమావతి బయటకు వచ్చింది. ఆమెను చూసి జయభద్రుడు ఆశ్చర్యపోయాడు.

ఇద్దరూ ఒకరి వృత్తాంతం ఒకరు తెలుసు కున్నారు. ఎలాగైనా ఆ అడవిలో నుండి బయటపడాలని ఆలోచిస్తూ నడుస్తున్నారు.
అలా కొంత దూరం నడవగానే దొంగల ముఠాలోని ఒక సభ్యుడు మరణించి పడి ఉన్నాడు. దొంగలు తమలో తమకు వాటాలు కుదరక చంపుకొని ఉంటారని వారు భావించారు.

ఏదైనా ఆధారం దొరకకపోతుందా ! అని ఒక రోజంతా నడచి నడచి అలసిపోయారు. ఆ రాత్రి వారు ఆ అడవిలోనే నిద్రించారు.
ఉదయం లేవగానే జయభద్రునికి తన గుర్రం దగ్గరలోనే పచ్చిక మేస్తూ కనిపించింది. ఇద్దరూ అడవిలో దొరికిన ఫలాలు భుజించి దగ్గరలోని ఏరువద్దకు వెళ్ళి నీరు తాగి గుర్రం ఎక్కి ఒక పల్లె చేరుకున్నారు.

ఆ రాత్రి ఒక సత్రంలో బస చేశారు. ఆ ఊరు హైమావతీ రాజ్యంలోనిది. రాజు హైమా వతిని తమకు ఇచ్చి పెండ్లి చేయకుండా మోసం చేశాడని భావించి గుణవర్మ, ధనవర్మ ఇద్దరూ కలసి హైమావతి తల్లిదండ్రులను బంధించి చెరసాలలో వేశారని తెలుసుకున్నారు.

వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారు తమ రాజధాని నగరం చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకున్నారు. హైమావతికి మారువేషం వేయించాడు బలభద్రుడు.

అనంతరం బలభద్రుడు తన ప్రజ్ఞాపాట వాలతో గుణవర్మ, ధనవర్మలను ఆకట్టుకున్నాడు. అనతికాలంలోనే వారికి మంచి మిత్రుడయ్యాడు.
ఇద్దరికీ తనమీద నమ్మకం కుదిరిన తర్వాత తను ఒక పథకం రచించాడు. గుణవర్మకు తెలియకుండా గుణవర్మ మీద ధనవర్మకు అబద్ధాలు చెప్పాడు.
దీంతో ధనవర్మ, గుణవర్మలకు ఒకరంటే ఒకరికి ద్వేషం బాగా పెరిగిపోయింది. ధనవర్మ బ్రతికుంటే తన ప్రాణాలకు ముప్పు ఉందని గుణవర్మ, గుణవర్మ బ్రతికి ఉంటే తన ప్రాణాలకు ముప్పు ఉందని ధనవర్మ భావించారు. అందువల్ల ఎదురుపడితే చంపడానికి సిద్ధంగా ఉన్నారు.

వీరి మధ్య వైరం బాగా పెరిగిపోయిందని గ్రహించిన జయభద్రుడు ఇద్దరినీ ఒకచోట భోజనాలకు ఆహ్వానించాడు. అచట ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడగానే కసితో కత్తులు దూసి తలపడ్డారు.

చివరికి ఇద్దరూ మరణించారు. అప్పుడు హైమావతి పురుషవేషం మార్చి అంత:పురానికి వెళ్లి చెరసాలలో ఉన్న తల్లిందండ్రులను విడిపించింది. రాజు, రాణి బలభద్రుని యుక్తికి మెచ్చుకున్నారు. వారు బలభద్రుణ్ణి తన గురించి తెలపమన్నారు. దాంతో తాను మణిప్రస్థరాజ కుమారుణ్ణి అని తెలిపాడు.

దానికి వారు సంతోషించి హైమావతిని బలభద్రునికిచ్చి ఘనంగా వివాహం జరి పించారు. వారికి కుమారులు లేకపోవటంతో జయభద్రునికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని జయభద్రునికి అప్పగించారు. జయభద్రుడు ప్రజలను బహుచక్కగా పాలించాడు.

Review కాశీమజిలీ కథలు బలభద్రుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top