కుందేలు – తాబేలు

కుందేలు – తాబేలు
ఒకసారి కుందేలు తాబేలుతో పందెం వేసింది. చెరువు ఆవలి తీరానికి ఎవరు ముందు వె•ళితే వారిదే గెలుపు. తాబేలు సరేనంది.కుందేలు చెరువు వంతెనపై పరుగు తీసింది. తాబేలు చెరువు నీట ఈదింది. తాబేలుది సూటిదారి. అందుకే ముందు చేరింది. కుందేలుది డొంక తిరుగుడు దారి. అందుకే ఓడిపోయింది.తాబేలు పందెం గెలిచింది. పిల్లలూ ఇందులో నేర్చుకోవా ల్సిన నీతి ఎంతో ఉంది. తొందర పాటు, అతి విశ్వాసం పనికిరావని ఈ కథ చెబుతుంది.

హంస – కాకి
పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు.ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో,
చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. అటువంటి కొన్ని కథల పరిచయం.

తెలివైన కోతి
అనగనగా ఒక కోతి. అది ఒక నేరేడు మానుపై నివసించేది. ఆ మాను కోనేరును ఆనుకొని ఉంది. కోనేటిలో ఓ మొసలి ఉండేది. ఆ మొసలికి కోతికి చెలిమి కలిగింది.మొసలికి ఒక చెడు ఆలోచన కలిగింది. కోతి తీపి తీపి ఫలాలు తింటుంది కదా!. దాని గుండెకాయ ఎంత తీపిగా ఉంటుందో! ఎలాగైనా కోతిని చంపి తినాలి అనుకొంది. ఓ రోజు కోతితో ఇలా ఉంది. ‘‘కోతి బావా! కోతి బావా ! ఈ రోజు మా ఇంటికి విందుకు రావాలి. ‘‘చాలా సంతోషం, పద వెళదాం’’ అంటూ కోతి మొసలి వీపు మీద కూచుంది. కోనేరులో సగం దూరం పోయాక మొసలి తన కోరికను కోతికి తెలిపింది. కోతికి పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే, వెంటనే వివేకంతో ఒక ఉపాయం పన్నింది. ఆపై మొసలితో ఇలా అంది.. ‘‘అరె! అరె! మొసలిబావ! ఎంత పొరపాటు చేశావు. ఆ మాట ముందే తెలిపితే బాగుండేది. నా గుండెకాయను అస్తమాను మోయలేక నేరేడు మానుపైనే వదిలాను. తిరిగి నేరేడు మాను పైకి వెళితే నీ ఆశ తీరుతుంది’’ అంది.
కోతిమాట విని మొసలి వెనుదిరిగింది. కోతి మాను పైకి పోయి ‘‘నా గుండెకాయ నాలోనె ఉంటుంది కాని మానుపై ఉంటుందా ! మోసానికి మోసమే తగినది.!’’ అని కిచకిచలాడింది.

Review కుందేలు – తాబేలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top