దగ్గరి నుంచి చూస్తేనే రంగు తెలుస్తుంది

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని
‘‘సామెత కథ’’ల పరిచయం.
హైదరాబాద్ దక్కనీ ఉర్దూ భాషా సాహి త్యాల్లో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. భాషా సాహిత్యంలోనూ, వాడుకలోనూ సమయాను కూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబగులు అద్దాయి. దక్కనీ జన జీవితంలో ఉన్న ఉర్దూ సామెతల సమాహారమే.. ఉర్దూ భాషా సౌందర్యానికి ప్రతీక. జీవన విలువలను, వ్యక్తిత్వ పాఠాలను నేర్పే ఆ సామెతలివిగో..
సౌదాతో సౌదాహీ హై
ఈ ఉర్దూ సామెతకు సరిపోయే తెలుగు సామెతలు చాలా ఉన్నాయి. ‘పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడే’, ‘ఎక్కడైనా బావ కానీ వంగతోట కాడ మాత్రం కాదు’.. ఇటువంటివి పై సామెతకు సమానమైనవి. ‘వ్యాపారం వ్యాపారమే..’ అనేది పై ఉర్దూ సామెత భావం. వ్యాపారంలో లాభాపేక్ష అనేది ఉంటుంది. అది లేకుండా వ్యాపారం చేయలేం. తన, పర భేదాలతో వ్యాపారం చేస్తే అది చివరకు నష్టాలనే మిగిలిస్తుంది. ఉదాహరణకు మీరో వ్యాపారం చేస్తున్నారనుకుందాం. మీ దగ్గర ఏదైనా వస్తువు చౌకగా లభిస్తుందనే ఆశతో మీ బంధువులు, స్నేహితులు మీ వ్యాపారం వద్దకు వస్తే.. వాళ్లు బంధుమిత్రులనే ఆపేక్షతో మీరు సదరు వస్తువులను వారికి చౌకగా ఇచ్చేస్తే చివరకు మీకు ఏం మిగులుతుంది? అటువంటి సందర్భాల్లోనే ఈ సామెతను వాడుతుంటారు. అలాగే, పేకాటలో తమ్ముడే కదా అని మీరు ఎత్తులు సరిగా వేయకుంటే ఆ జూదంలో మీరు ద్రవ్యాన్ని కోల్పోతారు. అలాగే, వంగతోట వద్ద ఆ తోటకు సంబంధించిన పనులు చేయాలి తప్ప.. బావ కదా అని చనువిస్తే.. శీలం కోల్పోయే ప్రమాదం ఉంది.
దూర్ కా ధూల్ సుహానా
సాధారణంగా మన తెలుగులో ఒక సామెత ఉంది. ‘దూరపు కొండలు నునుపు’ అని. నిజమే. దూరంగా కనబడేవన్నీ అందంగానే కనబడతాయి. అలాగే, దూరంగా ఎగిరే దుమ్ము కూడా అందం గానే కనబడుతుంది. ఎందుకంటే ఆ దుమ్ము మన ముక్కులలో దూరదు కదా!. అదే దుమ్ము మనం ఉన్నచోటనే లేస్తే శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతాం. ఇది కొండలు, బండలతో పోల్చి చెప్పిన సామెత అయినా, ఇది వంద శాతం మనుషులకు వర్తించే సామెత. ఎందుకంటే, మనలో కొందరిని దగ్గరి నుంచి చూస్తేనే అసలు రంగు బయట పడుతుంది. అవతలి వ్యక్తి గురించి అసలేం తెలియని వరకు, అతని రంగు, రూపు అందంగానే కనిపిస్తాయి. అసలు రంగు బయటపడితేనే ఎవరు ఎటువంటి వారో తెలిసి వస్తుంది. అటువంటి మనుషులను గురించి పోల్చే సందర్భాలలోనే పై సామెతను ఉపయోగిస్తుంటారు.
ఖూన్ కా బద్లా ఖూన్
‘కంటికి కన్ను.. పంటికి పన్ను..’, ‘రక్తానికి రక్తం’ అనే తెలుగు సామెతలకు సరిపోలే ఉర్దూ సామెత ఇది. నిజానికి ఇది సమాజంలో మనిషి ప్రవర్తనకు సంబంధించిన సామెత ఇది. అన్నిసార్లు హింస పనికిరాదు. కంటికి కన్ను.. రక్తానికి రక్తం అంటూ బదులు తీర్చుకుంటూ పోతే.. ఇక మిగిలేది ఎవరు? కాబట్టి ఈ న్యాయం లేదా ధర్మం అన్నివేళలా ఆచరించ డానికి వీలు కాదు.
మనిషి ఒదిగి ఉండాలనే పాఠాన్ని నేర్పు తుందీ సామెత. వధింపబడటం కంటే ఒదిగి ఉండటం మేలు కదా!. తుఫాను గాలికి తాటి చెట్ల తలలు తెగిపడతాయి. కానీ, ఒదిగి ఉండే గడ్డిపోచలు బతికిపోతాయి. కాలం కలిసి రాకపోతే రాజీ పడటం మంచిది కదా అనే అర్థంలో ఈ సామెతను వాడుతుంటారు. ప్రతిసారీ పౌరుషం కలిసి రాదు. ప్రతికూల పరి స్థితులను తట్టుకోవాలంటే కొన్నిసార్లు ఆ పరి స్థితులకు అనుగుణంగా మనం మారి పోవాల్సి ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

Review దగ్గరి నుంచి చూస్తేనే రంగు తెలుస్తుంది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top