నవ వసంత కోకిల

అమ్మకు ఉగాది శుభాకాంక్షలతో,
మనస్సులతో …
వృద్ధ సంవత్సరం వెళ్ళిపోయింది
పసి వత్సరం నేడు పల్లవించింది.
జీవకాంతుల్లేని శిశిరశిథిలాంగాల
హిమసమాధులపై సుమసమూహం చల్లి
నవ వసంతోదయం నాట్యమాడింది.
గతకాల బూజుదశ గడచి సీతాకోక
చిలుక పలురంగుల చీర గట్టింది
కుసుమ వీధులచేరి కులుకులాడింది
-గుంటూరు శేషేంద్ర శర్మ
రాము ఇక్కడి నుండి వెళ్ళేపుడు – ‘‘అమ్మకు ఉత్తరం రాయండి’’, ‘‘ఉగాదికి తప్పక అనంత పూర్‍కు రండి’’ – అని చెప్పి వెళ్లాడు. మొదట్లో ఈ రెండింటిలో ఏదీ చేయలేకపోతానేమోనని భయపడి బాధపడ్డాను. కనీసం ఒక పనైనా చేయ గలుగుతున్నందుకు కొంతైనా సంతోషంగా ఉంది.
ఉగాది వస్తుందనగానే – కృష్ణ శాస్త్రి గారి ‘‘నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు…’’ అన్న వాక్యాలు గుర్తుకు వస్తాయి. బుచ్చిబాబు ఇలా అంటారు. – ‘‘కృష్ణశాస్త్రి కవిత్వం అంటే నాకు ఇష్టం. అప్పుడప్పుడు రహస్యంగా చదువుకుంటూ ఉంటాను. బాగా ఇష్టమైన వాటిని మన స్వంతం చేసుకుంటాం; ఇతరులతో పంచుకోవటానికి సిద్ధపడం, లోభి బంగారుముద్దని రహస్యంగా చూసుకుని మురిసిపోయి మళ్లా దాచేసు కున్నట్లు’’… ఇంకా ఇలా అంటారు. ‘‘కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం, నా కోసం రాసిన ఖండ కావ్యాలు.’’-
నా కనిపిస్తుంది. బుచ్చిబాబుగారితో దెబ్బ లాడి- ‘‘అవి మీ కొరకు కాదు, కేవలం నా కొరకే, నా ఒక్కడి కొరకే రాసినవి’’ అని వాదించా లనిపిస్తుంది.
నా గురించి చెప్పటానికి ఈ మాత్రం చాలను కుంటాను. ‘రాము’ ఇక్కడ పరీక్షలకై ప్రిపేర్‍ అవుతున్నపుడు రోజూ కబుర్లతో సరదాగా కాలం గడిచేది. ‘రామూ’తో మాట్లాడుతున్నపుడు – నాతో నేను మాట్లాడుతున్నట్లుండేది. ‘నేనే’ మరో ‘తానై’నట్లు. ‘రాము’ వెళ్లిన తర్వాత నన్ను నేను పోగొట్టుకొన్నట్లనిపించేది. కొందరు మాంసా హారం తిని బతుకుతారు. కొందరు శాకాహారం తిని బతుకుతారు. మరి కొందరు రుషులులాంటి వాళ్లయితే కందమూలాదులు తిని బతుకుతారు. నాకు అవన్నీ ఉన్నా సరిపోవు. నా ఆహారం వేరు. కేవలం – ఆప్యాయత, ఆత్మీయత, మమత, అను రాగం – లాంటివి తిని బతికే జీవిని. ఇవి ఇక్కడ అంతగా దొరకవు. అందుకే రోజూ ఉపవాసం.
కర్ణధారుడు లేని కలముపై గూర్చుండి
కాల స్రవంతిలో కదలి పోతున్నాము
ఏ దీవి కల్పింతువో! ప్రభూ!
ఏ రేవు చేర్పింతువో !
జగన్నాటక రంగశాల వేషధారిగ
విషాదాంత జీవితవృత్తాలు వినిపించు
వింత వింత పాత్రల వేసినటించినాను
ఏ ఆట ఆడింతువో! ప్రభూ!
ఏ పాట పాడింతువో! ప్రభష్ట్ర!
– నండూరి రామకృష్ణమాచార్య
చాలా భాగం – ఒంటరిగా, సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గరగా – గడుపుతూ ఉంటాను. ఏదో చేస్తూ ఎక్కడికో వెళ్లిపోతుంటాను. స్నేహితులతో హఠాత్తుగా, మాటలు మధ్యలో ఆపి, వాళ్లను వదలి – ఎక్కడికో వెళుతుంటాను. ఈ విచిత్ర ప్రవర్తనను ఎవరి ఆలోచనలకు తగినట్లు వాళ్లు అర్థం చేసుకుంటూంటారు. అయినా నా •దీశ్రీఱ•• శీ• •శీశ్రీఱ•••వ్ణ యొక్క •••తీ•••ఱశీఅ అను అధిగమించ లేకపోతాను. ఈ మధ్య చాలా రాత్రులు, వెన్నెలరాత్రుల్లో చంద్రుణ్ణి, నక్షత్రాలను చూస్తూ గడుపుతుంటాను. ఒక్కొక్కసారి – ‘‘అభినవ తారా హార సముదంచిత శారద చంద్ర చంద్రికా విభవం’’ ఎంత మనోహరంగా ఉంటుంది !
‘శుభ’మని గజ్జెకట్టి సురసుందరి, దోసిట మల్లెపువ్వులన్‍
‘సభ’ మను నాట్యమండపమున విరజిమ్మినది.
-కరుణశ్రీ
అన్నట్లు వెన్నెల రాత్రి తన్మయత్వాన్ని కలిగిస్తుంది. ఇన్ని ఆనందాలను, అందాలను ప్రకృతి మన శిరస్సులపై రసార్ధ్రదరహాస చంద్రి కలను వెదజల్లుతూ, – చిలకరిస్తుంటే ఇంకా దేని కొరకో వెదుకుతూ చాలా మంది నిరాశగా ఎందుకు ఉంటారో నాకు అర్థం కాదు. నేనెందుకు ఇలా అన్నీ వదలి తిరుగుతున్నానో వాళ్లకూ అర్థం కాదు. వాళ్లకేమిటి, నాకే అర్థం కాదు!
‘రాము’ ఇక్కడున్నపుడు రోజులు సాఫీగా గడిచేవి. ఎప్పుడూ ‘మీ’ గురించిన జ్ఞాపకాలు, ముచ్చట్లు మా కాలాన్ని దోచేవి. ‘మీ’ గురించి ఎన్నో విషయాలు చెప్పేవాడు. మీ గురించిన ప్రస్తావన రాగానే – సూర్యరశ్మి తాకి కరిగి ప్రవహించే హిమనదిలా, మనసులో పేరుకుని ఘనీభవించిన లాలిత్యమైన ప్రవాహాలన్నీ కదిలి ఒళ్లంతా ప్రవహించి మేను జలదరిస్తున్నట్లు ‘రాము’ ఫీల్‍ అయ్యేవాడు. కళ్లలో కోటి నక్షత్రాలు వెలిగేవి. ‘అమ్మ’ చీరకుచ్చిళ్ల మడతల్లో ముఖం దాచుకుని, మౌనంగా, ఆర్తిగా రోదించాలన్న బలీయమైన వాంఛ ఉన్నట్లు – అనిపించేది. ‘భగవంతుడా, ఈ తృప్తి చాలు! ఈ ఆనందం చాలు ! హృదయవీణాతంత్రులను మరీ ఇంత తీయగా శ్రుతి చేయకయ్యా!’ అని హృదయం ఫె•షిస్తున్నట్లు భావాలు ‘రాము’ ముఖంపై దోబూచులాడేవి.
ఆ విధంగా రామూ రాకతో ఇక్కడ రోజులు ప్రశాంతంగా గడిచేవి. క్రితం సారి వచ్చినపుడు తీరిగ్గా మనసు విప్పి మాట్లాడటానికి సమయం, అవకాశం చిక్కలేదు. అంతా హడావిడిగా జరిగిపోయింది. రిజల్టస్ ఏ క్షణాన్నైనా రావచ్చు. రిజల్టస్ వచ్చిన వెంటనే ఇక్కడకు రమ్మనండి. నేను ప్రస్తుతం పగలూ, రాత్రిళ్లు కూడా దాదాపు =•స్త్రష్ట్ర•అ••ష్ట్ర తీ

Review నవ వసంత కోకిల.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top