పంటలో వాటా

నజీరుద్దీన్‍ ముల్లాగా మారాక సొంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బాగుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి వద్దకు వెళ్లి, పొలం అద్దెకు ఇస్తే వ్యవసాయం చేసుకుంటానని అన్నాడు.

ఆ ఆసామి జిత్తులమారి. నజీరుద్దీన్‍ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, ‘అలాగే! నా భూమిలో నీవు పంట వేసుకో. కానీ అద్దె కట్టాలి’ అన్నాడు.
‘అలాగే! అద్దె ఎంత?’ అని అడిగాడు నజీరుద్దీన్‍.

‘పొలం పండిన తరువాత భూమిపైన ఉన్న పైరంతా నాకు ఇచ్చేయాలి. అదే అద్దె’ అన్నాడు ఆ ఆసామి.
‘అలాగే’ అని నజీరుద్దీన్‍ అంగీకరిం చాడు.
ఆ రోజు నుంచే పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు.

కొంతకాలానికి పొలం కోసే సమయం వచ్చింది. కోత కూడా అయి పోయిందని తెలిసిన ఆసామీ తన వాటా కోసం నజీరుద్దీన్‍ వద్దకు వెళ్లాడు.
‘భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లోకి ఎక్కించాను. తీసుకుని వెళ్లండి’ అన్నాడు ఆ ఆసామితో నజీరుద్దీన్‍.
ఆసామి సంచులు విప్పి చూస్తే అన్నీ ఆకులే ఉన్నాయి. తనను నజీరుద్దీన్‍ మోసం చేశాడంటూ నజీరుద్దీన్‍పై అతను న్యాయవాదికి ఫిర్యాదు చేశాడు.
న్యాయవాది నజీరుద్దీన్‍ను పిలిపించి విచారించాడు.

‘ఈ ఆసామి చెప్పేది నిజమేనా?’ అని అడిగాడు న్యాయవాది.
‘అవును. నిజమే’ అన్నాడు నజీరుద్దీన్‍.
‘మరి మోసం ఎందుకు చేశావు?’ అని న్యాయవాది ప్రశ్నించాడు.

‘ఇందులో మోసం ఏముంది? ఆయన భూమిపైన పైరు కావాలన్నాడు. నేను వేరుశనగ పంట వేశాను. ఆయన కోరినట్టే భూమిపైన ఉన్నదంతా ఆయనకు ఇచ్చి, భూమి లోపలి ఉన్న గింజలు నేను తీసుకున్నాను’ అని వివరణ ఇచ్చాడు నజీరుద్దీన్‍.

Review పంటలో వాటా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top