పిల్లలు – పక్షులు

ఒకప్పుడు పిల్లులపై పక్షులదే పై చేయిగా ఉండేది. పిల్లులు చాలా కష్టపడి, రాత్రి అయ్యే సరికి పక్షులకి కావలసిన వాటిని సేకరించి యిచ్చేవి. పక్షుల రాజు ఆ ఆహారాన్నంతటినీ తీసుకుని తనకి కొంత ఉంచుకుని, పక్షులకి యిచ్చేవాడు.

పక్షులకి చీమల్ని తినడం యిష్టం. అందువల్ల ప్రతి పిల్లి మెడలోను ఒక సంచి వేలాడుతూ ఉండేది. దానిలో ఆ పిల్లి చీమల్ని సేకరించి పక్షిరాజుకి యిచ్చేది.
పిల్లులకి తమకి జరుగుతున్న అన్యాయం చాలా బాధ కలిగించింది. పక్షి రాజు నుండి ఎలాగైనా తప్పించుకుంటే సేకరించిన ఆహారం అంతా తమదే అవుతుందనుకున్నాయి. కాని పక్షులంటే వాటికి భయం. పక్షుల గూళ్లు అగ్నితో నిర్మించబడ్డాయనీ, పిల్లులు తమ యెడల విధేయులుగా లేకపోతే ఆ అగ్ని వాటిని దహించి వేస్తుందనీ అవి పిల్లుల్ని భయపెట్టాయి. పిల్లులు వాటి మాటల్ని నమ్మాయి. అందువల్ల ఉదయం నుండి సాయంకాలం వరకు పక్షుల కోసం పనిచేస్తున్నాయి.

ఒకనాటి రాత్రి ఒక ఆడపిల్లి యింట్లో మంట ఆరిపోయింది. అది తన పిల్ల ఫ్లఫీతో పక్షుల యింటికి వెళ్లి మంటని తీసుకుని రమ్మని చెప్పింది ఫ్లఫీ పక్షి యింటికి వెళ్లే సరికి అది గాఢ నిద్రలో ఉంది. దాని పొట్ట ఎక్కువ చీమల్ని తినడం వల్ల ఉబ్బి ఉంది. ఆ పక్షిని లేపడానికి ప్లఫీ భయపడింది. తిరిగి తన యింటికి వెళ్లిపోయింది. అక్కడ జరిగినదంతా తల్లికి చెప్పింది.

అప్పుడు తల్లి పిల్లి, ‘‘పక్షి నిద్రపోతూంది. కాబట్టి కొన్ని కట్టె పుల్లల్ని తీసుకుని వెళ్లి దాని గూడు వద్ద ఉంచు. అవి నిప్పుతో అంటుకోగానే, వాటిని యింటికి తీసుకుని రా’’ అంది. తల్లి చెప్పినట్లుగా ప్లఫీ ఎండుకట్టె పుల్లల్నిపోగు చేసి, పక్షి యింటికి తీసుకుని వెళ్లింది. పక్షి యింకా నిద్రపోతూనే ఉంది. భయపడుతూనే ప్లఫీ ఎండుకట్టెల్ని ఆ పక్షి యొక్క గూడు వద్ద పెట్టింది. కాని అవి మండలేదు. కట్టెల్ని ఒక దానితో ఒకటి రుద్ది మళ్లీ పక్షి గూడు వద్ద పెట్టింది. అయినా అవి అంటుకోలేదు. ప్లఫీ నిప్పుతేకుండానే యింటికి తిరిగి వచ్చింది. గూడు వద్ద ఉంచినా, అవి మండలేదని తల్లితో చెప్పింది.

‘‘సరే, నాతోరా. మనం యిద్దరం పక్షి గూడుకి వెళ్లి నిప్పు ఎలా చేయాలో చూపిస్తాను’’ అంది. పక్షి యింటికి వెళ్లాయి. ఇంకా పక్షి నిద్రపోతూనే ఉంది. తల్లి పిల్లి ఎండు కట్టెల్ని గూడుకి దగ్గరగా ఉంచింది. కాని కట్టె పుల్లలు మండలేదు. భయపడుతూ తన పంజాని గూడుకి దగ్గరగా పెట్టింది. గూడు వేడిగా లేదు. చల్లగానే ఉంది. కాని ఎర్ర రంగులో ఉంది.

పక్షులు అబద్ధం చెప్పాయని పిల్లి గ్రహించింది. సంతోషంతో యింటికి తిరిగి వచ్చింది. మిగిలిన పిల్లులకి ఆ విషయాన్ని చెప్పింది. ఆ రోజు నుండి పిల్లులు పక్షులకి భయపడలేదు. వాటి కోసం పని చేయడం మానివేశాయి.

మొదట పక్షి రాజుకి కోపం వచ్చింది. అది పిల్లులతో, ‘‘మీ యిళ్లన్నీ తగల పెడతాను నా కోసం మీరు పనిచేయకపోతే’’ అంది. కాని పిల్లులు, ‘‘నీ గూడు అగ్నితో చేయబడలేదు. అది మంట రంగులో ఎర్రగా మాత్రమే ఉంది. నువ్వు నిద్రపోతూ ఉండగా మేము నీ గూడుని ముట్టుకున్నాం. నువ్వు మాతో అబద్ధం చెప్పావు’’ అన్నాయి. ఎప్పుడైతే పిల్లులు తాను అబద్ధమాడినట్లు గ్రహించాయో, వెంటనే పక్షి పారిపోయింది.

ఈ రోజుకి కూడా పక్షులు పిల్లిని చూస్తే పారిపోతాయి. పిల్లి అంటే వాటికి భయం.

Review పిల్లలు – పక్షులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top