అంధరాజు భార్య గాంధారి
మహా భారతంలో ఓ ముఖ్య పాత్ర` గాంధారి. ఈమె అంధ రాజు అయిన ధృతరాష్ట్రుడికి భార్య. కౌరవులకు తల్లి. ఈమె ప్రస్తుత ఆఫ్ఘనిస్తాస్‌లోని కాందహార్ (ప్రాచీన నామం గాంధార నగరం) నగరానికి చెందినది. కాబట్టి ఈమెకు గాంధారి అనే పేరు వచ్చింది. ఈమె తండ్రి` గాంధార రాజు సుబలుడు. తల్లి` సుధర్మ. తమ్ముడు` శకుని. ధృతరాష్ట్రుడిని వివాహమాడినంతనే, తన భర్త గుడ్డి వాడు కాబట్టి, తాను జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకుంది. ఈమెకు దుర్యోధనాది వంద మంది పుత్రులు, దుస్సల అనే కుమార్తె ఉన్నారు.
గాంధారి ధర్మ స్వభావం కలిగిన మహిళ. అందమైన, ధర్మవంతురాలైన స్త్రీగా, అంకితభావం కలిగిన సతిగా మహాభారతంలో ఈమె పాత్ర చిత్రీకరించబడిరది. భీష్ముడు, గాంధారి` ధృతరాష్ట్రుల వివాహం జరిపించాడు. తన భర్త అంధుడని తెలిసినపుడు, తాను కూడా తన భర్తలా అంధురాలిలా ఉండటం కోసం కళ్లకు గంతలు కట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈమె ఈ నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి భర్తపై గల ప్రేమకు చిహ్నంగా ఇతిహాసాలలో వర్ణించారు.
వివాహానికి పూర్వం గాంధారి తపస్సు ద్వారా శివుడిని మెప్పించింది. ఆ సందర్భంగానే వంద మంది పుత్రులను కనడానికి వరం పొందిందని అంటారు. భీష్ముడు గాంధారిని కురు రాజ్యానికి పెద్ద కోడలిగా చేసుకోవడానికి ప్రధాన కారణాలలో ఈ వరం కూడా ఒకటని అంటారు. గాంధార నగరంపై హస్తినాపుర రాజ్యం ఆక్రమణకు పాల్పడుతుంది. ఈ సందర్భంలో తన సోదరులందరినీ కోల్పోతాడు శకుడు. దీంతో కురు వంశంపై కోపం పెంచుకున్న శకుడు ఆ రాజ వంశాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేస్తాడు. దాయాదుల మధ్య తన దుష్టబుద్ధితో చిచ్చు పెట్టడం, చిన్న చిన్న మనస్పర్ధలను పెద్దవి చేసి దుర్యోధనుడి మనసు మార్చడం వంటి దుష్టస్వభావాలతో శకుడు కౌరవులు, పాండవుల మధ్య యుద్ధాన్ని సృష్టిస్తాడు.
మహా భారత యుద్ధంలో తన సంతానమంతా హతమైపోవడంతో గాంధారి.. శ్రీకృష్ణుడి వంశం, ఆయన పిల్లలు, యాదవులు నశిస్తారని శపిస్తుంది. ఆమె శాపవశాత్తూ యాదవ వంశం మొత్తం నశిస్తుంది. ఆమె శాపాన్ని కృష్ణుడు చిరునవ్వుతో అంగీకరిస్తాడు. మహా భారత యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత యాదవులు తమలో తాము కలహించుకుని నాశనమైపోతారు కృష్ణుడు 126 సంవత్సరాలు జీవించిన తరువాత తాను సైతం తన లోకానికి వెళ్లిపోతాడు. ఆయన కనిపించకుండా పోయిన ఏడు రోజుల తరువాత ద్వారకా నగరం మునిగిపోతుంది.
కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు, బావమరిది విదురుడు, మరదలు కుంతితో కలిసి హిమాలయాలకు తపస్సుకు వెళ్తుంది. అక్కడ అడవిలో జరిగిన అగ్నిప్రమాదంలో అందరూ ఆహుతైపోతారు.
పురాణ పాత్రలు

Review పురాణ పాత్రలు.