గోపీ ఇచ్చిన ‘‘గోపాలుడి’’ అధరాల్లోంచి విచ్చుకునే దరహాస చంద్రికలు నా మనోమైదాన మంతా ఆక్రమిస్తున్నాయి. ఈ సమయంలో సి. నారాయణరెడ్డిగారి కవితా చరణాలు జ్ఞాపకం వస్తున్నాయి.
పొదలోని వెదురుబొంగు
మొదలంటూ విరిగిందనా నీ బాధ!
రఘురాముని చేతిలో విల్ల్కె
రాక్షసుల్ని పరిమార్చలేదా!
పురివిప్పి ఆడే నెమలి
ధర మీది కొరిగిందనా గోడు!
బాలకష్ణుని మౌళిపింఛమై
ప్రపంచాన్ని మురిపిస్తుంది చూడు!
కొండమీది నుంచి
చెంగున దూకిన సెలయేరు
ఇసుకపర్రలోకి ఇంకి పోయిందనా దిగులు?
పాతాళ గంగ ఝర్కియె మరలా
పైకిలేస్తుంది చూడు.
ప్రపంచాన్ని మరిచి, ప్రశాంతంగా సముద్ర తీరంలో ధ్యానముద్రలో కూర్చుని తీరాన్ని చుంబించడానికి పరుగెత్తుకొచ్చే అందమైన అలల్ని – కలలాంటి మన జీవితంలోనుంచి అవలోకిం చటం ఎంత హాయిగా ఉంటుంది.
పారిజాత సుమదళాల్లాంటి పాపల బోసి నవ్వుల అమల సంగీతం వినటం ఎంతో పార వశ్యాన్ని కలిగిస్తుంది. ఆ సంగీతంలో భగవంతుడు తన సున్నితమైన చేతి వేళ్లలోంచి సరిగమలను జారవిడుస్తున్నట్లు అన్పిస్తుంది. వీలున్నప్పుడల్లా ఇంటిపై భాగానికి వెళ్లి ఈజీ ఛైర్లో కూర్చుని ఆకా శంలో ఎగిరే పక్షులను తిలకించడం, నీలాకాశంపై అందమైన దూదిపింజలాంటి మేఘాలపై మాన సికంగా స్వారీ చేయటం… ఇలాంటి పనులు అవ కాశమున్నప్పుడల్లా చేస్తుంటాను. నాకు చిన్నప్పటి నుంచీ ప్రకృతి అందాల్లో అతీంద్రియానుభూతుల అస్పష్టకాంతులను అనుభవిస్తూ ఉండటం అల వాటు. ప్రకతిలో పరవశిస్తున్నపుడు – ఓ తపస్సు చేస్తున్నట్లు ధ్యానముద్రలో పరమాత్మ ఒడిలోకి చేరుతున్నట్లు అనుభూతి కలుగుతుంది. దీన్ని ‘రసదృష్టి’ అంటారు. ఓ కవి అన్నట్లు ‘రసదృష్టి’ ముదిరితే ‘యోగదృష్టి’ అవుతుంది. ఓ రచయిత మాటల్లో చెప్పాలంటే – ‘‘సూర్యోదయ అరుణ కాంతులు సముద్ర కెరటాలపై నాట్యం చేయటం, పశ్చిమ దిగంతంలో సూర్యాస్తమయ సింధూర కాంతులు, శరత్కాల వినిర్మల నీలాకాశంలో ఎగిరే తెల్లని కొంగలు, గడ్డిమొలకల ఇంధ్రధనుస్సు వర్ణాలతో ధగధగలాడే మంచు బిందువులతో ప్రత్యక్షమయ్యే ప్రభాతం, నీళ్ల ఒడ్డున వూగిసలాడే తెల్లని రెల్లుపూలు, ముగ్ధవధువు మాదిరిగా మృదువుగా, సిగ్గుగా సంధ్యాకాశం మీదుగా ప్రత్యక్షమయ్యే నెలవంక – ఈ రసమయ ప్రకృతి అంతా మనలో ఆనంద ప్రకంపనలను రేకెత్తి స్తాయి. పరమాత్మకు దగ్గరగా తీసుకెళతాయి. అందుకే కరుణశ్రీ ప్రకృతి అందాల్లో పరమాత్మను దర్శిస్తూ, పంచేంద్రియాలతో పరవశిస్తూ ఇలా అంటారు.
వెన్నెలలో, ప్రభాతమున విచ్చిన పువ్వుల చిత్రచిత్రమౌ
వెన్నెలలో, ఒయారముగ వంగిన చక్కదనాల చుక్కలౌ
కన్నెలలో, ప్రతీచి అలికస్థలికన్నుల విందొ నర్చు ఆ
కొనెలలోన నీదు తళుకుల్ తిలకింతునో ప్రభూ! అని…
వీటన్నింటికన్నా నాకు అతిదగ్గరి మిత్రుడు -ఒంటరితనం. ఎపుడూ ఒంటరిగా ఉండటం అంటే ఎంతో ఆనందం. అందుకే నా జీవితంలో చాలా భాగం ఒంటరిగా గడిపాను. పాట విన్నా ఒంటరిగా అలవాటు. పిక్చర్కు వెళ్లినా ఒంటరిగా వెళ్లటం ఆనందాన్నిస్తుంది. ప్రకృతిలో పరవ శించాలన్నా, భగవంతుని ధ్యానించాలన్నా, ఆఖ రున నవ్వాలన్నా, మనసారా ఏడవాలన్నా ఒంటరి తనాన్ని ఆశ్రయిస్తాను. చివరకు ఎవరితోనైనా
Review మాయ మూగబోయేది ఒంటరితనంలోనే.