రామాయణాన్ని నూట ఎనిమిది (108) పాదాలతో వివరించిన ‘నామ రామాయణం’ అనేది తెలుగింట సంప్రదాయంగా వస్తోన్న స్తోత్రం. ఈ దివ్య స్తోత్రాన్ని పాడితే రామాయణాన్ని పారాయణం చేసినంత పుణ్యం, ఫలితం లభిస్తాయి. ఈ 108 నామాలలోనే మొత్తం రామాయణం అంతా ఇమిడి ఉంది. మార్చి 27, 2026 శ్రీరామ నవమి సందర్భంగా ‘తెలుగు పత్రిక’ పాఠకుల కోసం అందిస్తోన్న విశేష స్తోత్ర కదంబమిది..
బాలకాండ
1. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
2. కాలాత్మక పరమేశ్వర రామ
3. శేషతల్ప సుఖనిద్రిత రామ
4. బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ
5. చండకిరణకుల మండన రామ
6. శ్రీమద్దశరథ నందన రామ
7. కౌసల్యా సుఖవర్థన రామ
8. విశ్వామిత్ర ప్రియధన రామ
9. ఘోరతాటకా ఘాతక రామ
10. మారీచాది నిపాతక రామ
11. కౌశిక మఖ సంరక్షక రామ
12. శ్రీమదహల్యోద్ధారక రామ
13. గౌతమ ముని సంపూజిత రామ
14. సుర మునివర గణ సంస్తుత రామ
15. నావిక ధావిత మృదుపద రామ
16. మిథిలా పురజన మోహక రామ
17. విదేహ మానస రంజక రామ
18. త్రయంబక కార్ముక భంజక రామ
19. సీతార్పిత వరమాలిక రామ
20. కృత వైవాహిక కౌతుక రామ
21. భార్గవదర్ప వినాశక రామ
22. శ్రీదమయోధ్యా పాలక రామ
రామ రామ జయ రాజా రామ!
రామ రామ జయ సీతా రామ!!
అయోధ్యకాండ
23. అగణిత గుణగణ భూషిత రామ
24. అవనీతనయా కామిత రామ
25. రాకా చంద్ర సమానన రామ
26. పితృవాక్యాశ్రిత కానన రామ
27. ప్రియగుహ వినివేదిత పద రామ
28. తత్‍క్షాలిత నిజ మృదుపద రామ
29. భరద్వాజ ముఖానందక రామ
30. చిత్ర కూటాద్రి నికేతన రామ
31. దశరథ సంతత చింతిత రామ
32. కైకేయీ తనయార్థిత రామ
33. విరచిత నిజ పితృకర్మక రామ
34. భరతార్పిత నిజపాదుక రామ
రామ రామ జయ రాజా రామ!
రామ రామ జయ సీతా రామ!!
అరణ్యకాండ
35. దండకావనజన పావన రామ
36. దుష్ట విరాధ వినాశన రామ
37. శరభంగ సుతీక్ష్ణార్చిత రామ
38. అగస్త్యానుగ్రహ వర్థిత రామ
39. గృధ్రాధిప• సంసేవిత రామ
40. పంచవటీ తట సుస్థిత రామ
41. శూర్పణఖార్తి విధాయక రామ
42. ఖరదూషణ ముఖసూదక రామ
43. సీతాప్రియ హరిణానుగ రామ
44. మారీచార్తి కృతాశుగ రామ
45. వినష్ట సీతాన్వేషక రామ
46. గృధ్రాధిప గతిదాయక రామ
47. శబరీదత్త ఫలాశన రామ
48. కబంధ బాహుచ్ఛేదన రామ
రామ రామ జయ రాజా రామ!
రామ రామ జయ సీతా రామ!!
కిష్కింధకాండ
49. హనుమత్సేవిత నిజపద రామ
50. నత సుగ్రీవాభీష్టద రామ
51. గర్విత వాలి సంహారక రామ
52. వానర దూత ప్రేషక రామ
53. హితకర లక్ష్మణ సంయుత రామ
రామ రామ జయ రాజా రామ!
రామ రామ జయ సీతా రామ!!
సుందరకాండ
54. కపివర సంతత సంస్మ•త రామ
55. తద్గతి విఘ్నధ్వంసక రామ
56. సీతా ప్రాణాధారక రామ
57. దుష్ట దశానన దూషిత రామ
58. శిష్ట హనూమద్భూషిత రామ
59. సీతావేదిత కాకావన రామ
60. కృత చూడామణి దర్శన రామ
61. కపివర వచనాశ్వాసిత రామ
రామ రామ జయ రాజా రామ!
రామ రామ జయ సీతా రామ!!
యుద్ధకాండ
62. రావణ నిధన ప్రస్థిత రామ
63. వానరసైన్య సమావృత రామ
64. శోషిత సరిదీశార్థిత రామ
65. విభీషనాభయ దాయక రామ
66. పర్వతసేతు నిబంధక రామ
67. కుంభకర్ణ శిరచ్ఛేదక రామ
68. రాక్షస సంఘ విమర్దక రామ
69. అహిమహిరావణ చారణ రామ
70. సంహృత దశముఖ రావణ రామ
71. విధిభవ ముఖసుర సంస్తుత రామ
72. ఖస్థిత దశరథ వీక్షిత రామ
73. సీతాదర్శన మోదిత రామ
74. అభిషిక్త విభీషణ నత రామ
75. పుష్పక యానారోహణ రామ
76. భరద్వాజాభి నిషేవణ రామ
77. భరతప్రాణ ప్రియకర రామ
78. సాకేతపురీ భూషణ రామ
79. సకల స్వీయ సమానత రామ
80. రత్నలసత్పీఠాస్థిత రామ
81. పట్టాభిషేకాలంకృత రామ
82. పార్థివకుల సమ్మానిత రామ
83. విభీషణార్పిత రంగక రామ
84. కీశకులానుగ్రహకర రామ
85. సకల జీవ సంరక్షక రామ
86. సమస్త లోకాధారక రామ
రామ రామ జయ రాజా రామ!
రామ రామ జయ సీతా రామ!!
ఉత్తరకాండ
87. ఆగత మునిగణ సంస్తుత రామ
88. విశ్రుత దశకంఠోద్భవ రామ
89. సీతాలింగన నిర్వ•త రామ
90. నీతి సురక్షిత జనపద రామ
91. విపిన త్యాజిత జనకజ రామ
92. కారిత లవణాసురవధ రామ
93. స్వర్గత శంభుక సంస్తుత రామ
94. స్వతనయ కుశలవ నందిత రామ
95. అశ్వమేధ క్రతుదీక్షిత రామ
96. కాలావేదిత సురపద రామ
97. ఆయాజగజ్జన ముక్తిద రామ
98. విధిముఖ విభుధానందక రామ
99. తేజోమయ నిజరూపక రామ
100. సంస్క•తి బంధ విమోచక రామ
101. ధర్మస్థాపన తత్పర రామ
102. భక్తిపరాయణ ముక్తిద రామ
103. సర్వచరాచర పాలక రామ
104. సర్వభవామయ వారక రామ
105. వైకుంఠాలయ సంస్థిత రామ
106. నిత్యానంద పదస్థిత రామ
107. రామ రామ జయ రాజా రామ
108. రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ!
రామ రామ జయ సీతా రామ!!































































































































































































































































































































































































Review రమణీయం.. నామ రామాయణం.