విశేషాల బైబిల్‍

బైబిల్‍.. క్రీస్తు నడిచిన దారిని కళ్లకు కడుతుంది. జీవిత పాఠాలను బోధిస్తుంది. అందుకే క్రైస్తవులకు క్రీస్తు అంటే బైబిల్‍.. బైబిల్‍ అంటే క్రీస్తు. ‘డిసెంబరు 25: క్రిస్ట్మస్‍’ సందర్భంగా జీసస్‍ బోధనలను ప్రపంచం నలుమూలలకూ వ్యాపింపచేసిన ఆ పరిశుద్ధ గ్రంథం వెనుక ఆసక్తికరమైన అంశాలేమిటో తెలుసుకుందాం..
చరిత్రలో అత్యధికంలో 500 కోట్ల ప్రతులు అమ్ముడుపోయిన పుస్తకం బైబిల్‍ ఒక్కటే. ఇప్పటికీ ప్రతి సంవత్సరం పది కోట్ల బైబిల్‍ ప్రతులను క్రైస్తవులు కొంటున్నారట.
ప్రపంచంలో అత్యధికంగా దొంగతనానికి గురయ్యే పుస్తకం ఏదో తెలుసా?.. అది- బైబిల్‍.
ప్రపంచంలోనే అత్యధికంగా బైబిల్‍ను ముద్రించే దేశం ఏదో తెలుసా?. అమెరికానో మరే యురోపియన్‍ దేశమో అని అనుకోవడం సహజం. కానీ, బైబిల్‍ను ప్రపంచంలో అత్యధికంగా ముద్రించే దేశం చైనా అంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఏసుక్రీస్తు రూపురేఖలకు సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి వర్ణనా లేదు. బహుశా ఆయన రూపాన్ని మధ్య తూర్పు దేశీయుల రూపురేఖలను ఊహించి సృష్టించి ఉండొచ్చని పరిశీలకులు చెబుతారు.
‘మూవబుల్‍ టైప్‍’తో ముద్రించిన మొట్టమొదటి పుస్తకం బైబిల్‍ గ్రంథమే. ‘గుటెన్‍బర్గ్ బైబిల్‍’గా పిలిచే దీన్ని 1455లో ముద్రించారు. వీటిలోని ఒక ప్రతి ముప్పై సంవత్సరాల కిందట రూ.35 కోట్లకు క్రిస్టీ సంస్థ వేలంలో అమ్ముడుపోయింది.
‘డనమ్‍ బైబిల్‍ మ్యూజియం’ పేరుతో బైబిల్‍ గ్రంథాల కోసమే టెక్సాస్‍లోని హూస్టన్‍లో ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ అరుదైన బైబిళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు భాషల్లో ముద్రించిన పరిశుద్ధ గ్రంథాల ప్రతులూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం వాషింగ్టన్‍లో ‘ద మ్యూజియం ఆఫ్‍ ది బైబిల్‍’ అని మరో సందర్శన శాలనూ స్థాపించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద బైబిల్‍ బరువు 496 కిలోలు. లూయీవయ్‍నయ్‍ అనే వ్యక్తి ముద్రించిన ఈ పుస్తకం ఎత్తు 43.5 అంగుళాలు, వెడల్పు 98 అంగుళాలు.
పూర్తి బైబిల్‍ను ఇప్పటి వరకూ 670 భాషల్లోకి అనువదించారు. కొంత భాగం వరకే అయితే 1,121 భాషల్లోకి తర్జుమా చేశారు.
‘ఆమెన్‍’.. ఇది బైబిల్‍లోని చివరి పదం.
దేవుడి బొమ్మల్ని లాకెట్ల రూపంలో వేసుకోవడం తెలిసిందే. కానీ, పుస్తకాలను పెండెంట్లలా వేసుకోవడం బైబిల్‍కే ప్రత్యేకం. ఎక్కడైనా చదువుకునేందుకు వీలుగా కీచెయిన్లలో పట్టే చిన్న బైబిల్‍ పుస్తకాలు కూడా వస్తున్నాయి.
క్రైస్తవం, జూడాయిజం, ఇస్లాం.. ఈ మూడు మతాల గురించీ బైబిల్‍లో ప్రస్తావన ఉంది.
అంధులు చదివేందుకు బ్రెయిలీ లిపిలో కూడా పరిశుద్ధ గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి.
నాలుగో శతాబ్దం కాలం నాటి బైబిల్‍ ప్రచురణ ఇప్పటికీ వాటికల్‍ లైబ్రరీలో భద్రంగా ఉంది.
ప్రపంచ చరిత్ర, రచనలు, సంస్క•తి మీద బైబిల్‍ చూపినంత ప్రభావం మరే గ్రంథమూ చూపలేదట.
బే సామ్‍ బుక్‍.. ఈ బైబిల్‍ ప్రపంచంలోనే ఖరీదైన పుస్తకాల్లో ఒకటి. 2013లో 13.4 మిలియన్‍ యూరోల (సుమారు రూ.109 కోట్లు)కు అమ్ముడుపోయింది. ఇది వందల సంవత్సరాల కిందట 1640ల్లో ముద్రించిన గ్రంథం. • బైబిల్‍లోని రకరకాల పాత్రల రూపాలతో పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలు కూడా మార్కెట్లోకి వచ్చాయి.

Review విశేషాల బైబిల్‍.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top