శివ శివ శంకర

ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు.
శివుడు భోళాశంకరుడు.
శివుడు భక్త వశంకరుడు.
శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు.
శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు.
సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు.
‘జన్మకో శివరాత్రి’ అని నానుడు.
కానీ, మన అదృష్టం కొద్దీ ఏడాదికోసారి మహా శివరాత్రి వస్తూనే ఉంటుంది.

లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమించి కంఠంలో దాచుకున్న రోజును మహా శివరాత్రిగా పాటించడం ఆచారం. పురాణాలే కాదు వాటి కంటే పురాతనమైన వేదాల కంటే ముందు నుంచే మన భారత ఉపఖండంలో ప్రజలు శివారాధన చేసేవారు. వేద వాంగ్మయం శివుడిని ప్రధానం రుద్రుడిగా ప్రస్తుతించింది.
రుగ్వేదంలో మొదటిసారిగా ‘శివ’నామం కనిపిస్తుంది. రుద్రాంశ ప్రళయ బీభత్సాలకు దారితీసే ప్రకృతి వైపరీత్యాలకు కారణమైతే, శివాంశ కాలానుకూలమైన మంచి వర్షాలకు కారణమవుతుందని వేద స్తోత్రాలు చెబుతున్నాయి.
భగవద్గీత కంటే ముందునాటి నుంచే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవ మత మూలాలు కనిపిస్తాయి. భారత ఉపఖండమే కాకుండా శ్రీలంక, కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లోనూ శైవం ఆనాడు ప్రబలంగా ఉండేది. సనాతన మతాలలో శైవమతం శాక్తేయానికి దగ్గరిగా ఉండడంతో పలుచోట్ల శివుడితో పాటు శక్తి ఆరాధన జమిలీగా జరిగేది. అందుకే ఈనాటికీ చాలాచోట్ల శైవక్షేత్రాలు, శక్తిపీఠాలు సన్నిహితంగా కనిపిస్తాయి.
శివుడు అందరివాడు. బ్రహ్మ, విష్ణు దేవేంద్రాది దేవతలకే కాక రావణాసురుడు, బాణాసురుడు, భస్మాసురుడు వంటి దానవులు, వాలి వంటి వానరులు, సమస్త రుషులు, ఆది శంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక గురువులు, కన్నప్ప వంటి గిరిజనులు శివుడిని విశేషంగా ఆరాధించిన వారే. కాళహస్తి మహాత్మ్యం కథనం ప్రకారం.. సాలె పురుగు, సర్పం, ఏనుగు కూడా శివుడిని పూజించినట్టు తెలుస్తోంది. దేవ, దానవ, మానవులకే కాదు.. చరాచర సృష్టిలోని సమస్త జీవులకు శివుడే దైవమని పురాణాలు చెబుతున్నాయి. శైవం ప్రకారం.. సృష్టి, స్థితి, లయలకు శివుడే కారకుడు. శివుడే పరబ్రహ్మ స్వరూపుడు. శివుడే ఆదిదేవుడు. సమస్త విశ్వానికీ శివుడే అధినాథుడు.

శివుడిని వివిధ భంగిమల్లోని విగ్రహమూర్తిగానే కాకుండా, లింగరూపంలోనూ పూజిస్తారు. పలుచోట్ల శివాలయాల్లో శివుడి పూర్తి విగ్రహాలకు బదులు శివలింగానే ఎక్కువగా కనిపిస్తాయి. శివ పురాణం, లింగ పురాణంలో శివ మహిమల గురించి విపులంగా వివరించారు.
ఆదియోగి శివుడు
మన పురాణాలు శివుడిగా ఆదియోగి అభివర్ణించాయి. పరమ యోగులందరికీ శివుడే గురువు. సనాతన మతాలలో యోగసాధనకు విస్త•త ప్రాధాన్యం ఉంది. జీవుడి అంతిమ లక్ష్యం కైవల్యమేనని, కైవల్య పథానికి చేరుకోవడానికే యోగమే మార్గమని, యోగ సాధనతోనే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. యోగవిద్యలో వివిధ పద్ధతులున్నా, శైవ సంప్రదాయానికి చెందిన గ్రంథాలు ఎక్కువగా హఠ యోగానికే ప్రాధాన్యమిచ్చాయి. క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన ‘ఈశ్వర గీత’, పదో శతాబ్దికి చెందిన ‘శివసూత్ర’, ‘శివసంహిత’ వంటి గ్రంథాలు శైవ సంప్రదాయంలో యోగ సాధనకు గల ప్రాశస్త్యాన్ని వివరిస్తాయి. భవబంధాలలో చిక్కుకున్న మనుషులకు యోగమే తగిన మార్గమని పదో శతాబ్దికి చెందిన కశ్మీర శైవ పండితుడు అభినవగుప్తుడు తన రచనల్లో పేర్కొన్నాడు.

మహా శివరాత్రి నాడు..
మహా శివరాత్రి నేపథ్యానికి సంబంధించి క్షీరసాగర మథన ఘట్టం అందరికీ తెలిసిందే. అయితే, ఇదే రోజు ఆదియోగి అయిన శివుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడని యోగ, తంత్ర గ్రంథాలలో ఉంది. శివరాత్రి నాడు జాగరం ఉంటూ యోగ సాధన చేయడం ద్వారా కుండలినీ శక్తి జాగృతమవుతుందని కొందరు

మన అంతరంగ శుద్ధికే అభిషేకం
పరమశివుడు అభిషేక ప్రియుడు. ఓ పండు సమర్పించినా, ఓ చెంబుడు నీళ్లతో అభిషేకించినా దండిగా అనుగ్రహించే బోళా శంకరుడాయన. మహా శివరాత్రి నాడు చేసే అభిషేకం మహాదేవుడికి మరింత ప్రీతికరమని చెబుతారు.
మనం ఒంటిపై ఉన్న దుమ్ము, ధూళి తొలగించుకోవడానికి స్నానం చేస్తాం.
మరి మన అంతరంగంలోని మాలిన్యాలను ప్రక్షాళన చేసుకోవాలంటే ఆ పరమశివుడికి అభిషేకం చేయాలి.
రజస్సు అంటే రజో గుణం అని, ధూళి అనే అర్థాలున్నాయి. మనలోని రజో గుణాన్ని సంస్కరించడానికి, మానవత్వం ఉన్న వారిగా మారడానికి పరమశివుడిని అభిషేకించాలి.
ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామనే అహంకారం వదిలి, అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తేనే అనుభవించగలుగుతున్నామని గుర్తించాలి. అలా గుర్తించి, ‘నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామ’ని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్న అంతరార్థం.
అభిషేక సమయంలో అర్చకుడు వల్లించే వేద మంత్రాలు ‘రుద్రాధ్యాయం’లోనివి.
ఈ మంత్ర భాగాన్ని ‘శతరుద్రీయం’ అని కూడా అంటారు.
ఈ మంత్రాలలో కొన్నింటి చివర ‘నమో నమో’ అనీ, మరికొన్నింటి చివర ‘చ మే – చ మే’ అనీ అంటారు కనుక వీటిని ‘నమకం – చమకం’ అని వ్యవహరిస్తారు.
ఈ మంత్రాలను పఠిస్తూ పరమశివుడిని అభిషేకించాలి.
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఫలరసాలు, కొబ్బరినీళ్లు అభిషేకంలో ఉపయోగిస్తారు.
మనలో ఉన్న వినయాన్ని మహాదేవుడికి విన్నవించుకోవడమే అభిషేకం.
సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిననీ, తనంతటి వారు మరెవరూ లేరని అనుకోవడం అహంకారం.
కానీ, అభిషేక సమయంలో వినిపించే ‘రుద్రాధ్యాయం’లోని మంత్ర భాగం మనకు కనువిప్పు కలిగిస్తుంది.
సృష్టిలోని సకల ప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేననీ, సకల ప్రాణులకూ శుభం కలగాలని మనం ఈ మంత్రాల ద్వారా కోరుకుంటాం.
ఈ మంత్రాల అర్థాలు మన అంతరంగాన్ని తట్టి మేల్కొలుపుతాయి.
అప్పుడు జ్ఞాన జ్యోతి స్వరూపుడైన పరమశివుడు మనలో ఆవిర్భవిస్తాడు.
అదే మహాశివరాత్రి నాడు మనం పొందవలసిన ‘మహాలింగోద్భవ’ సందర్శనం నమ్ముతారు. శివరాత్రి రోజు యోగసాధనలో గడిపే వారు తక్కువే కానీ, ప్రసిదద్ధ శైవ క్షేత్రాలు మొదలుకుని గ్రామ గ్రామాల్లో ఉండే శివాలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు చేరి పూజాదులు నిర్వహిస్తారు.

శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయో తెలుసా?
విష్ణు సహస్ర నామాల గురించి, వాటి విశేషాల గురించి మహా భారత కథ చెబుతుంది. మళ్లీ అంతటి శక్తి కలిగిన శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి? దాంతో పాటుగా శ్రీ మహావిష్ణువు చేతిలోకి సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చి చేరింది? అనే విషయాలను గురించి వివరించి చెప్పే ఈ కథా సందర్భం శివ పురాణం కోటి రుద్ర సంహిత 35, 36 అధ్యాయాలలో కనిపిస్తుంది.
సర్వ ఆపదల నుంచి ముక్తిని పొందడం కోసం శివ రూప ధ్యానం, శివ సహస్ర నామ పఠనం ఉపకరిస్తాయని మహా విష్ణువుకు సాక్షాత్తూ శివుడే చెప్పాడు. నిత్యం శివ సహస్ర నామాలను పఠించినా, పఠింప చేసినా దు:ఖమనేది ఉండదు. ఆపదను పొందిన వారు శివ సహస్ర నామాలను యథావిధిగా వందసార్లు పఠిస్తే శుభవం కలుగుతుంది. ఈ స్తోత్ర రోగాలను నాశనం చేసి విద్యను, ధనాన్ని, సర్వ కామనలను నిత్య శివభక్తిని అందిస్తుంది. ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఎన్నెన్నో శివ సహస్ర నామ పఠితకు దక్కుతాయని శివ సహస్ర నామ పఠన ఫలంలో శివుడే చెప్పాడు.

అన్నిటికీ ఆద్యుడు ఆద్యంతరహితుడు
ఈ లోకంలో చిన్న చిన్న పనులు చేసే వారినే మనం ఆవిష్కర్తలుగా, ఆద్యులుగా పిలుస్తూ ఉంటాం. మరి, ఆ కోవలో చూస్తే శివుడు ఎన్నో విషయాలను ఈ ప్రపంచానికి అందించిన ఆద్యంతరహితుడు.
‘ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‍’.. అని ఈశావాస్యోపనిషత్‍ చెబుతోంది.
ఈ జగత్తులో సర్వం ఈశ్వరునిచే ఆవృతమై ఉందని పై ఉపనిషత్‍ వాక్యానికి అర్థం.
సమస్త చరాచర ప్రపంచమూ ఈశ్వరమయం. మనుషుల్లోని సృజనశక్తికి, భావవ్యక్తీకరణకు ఆధారం భాష. అలాంటి భారతీయ భాషలకు మూలమైప పద్నాలుగు (14) మహేశ్వర సూత్రాలు పరమశివుడు తన డమరు నాదం నుంచి సృష్టించాడు.
శివపార్వతుల కల్యాణ సమయంలో హిమవంతుడు.. శివుడి ప్రవర అడిగినపుడు ‘నాదం శివమయం’ అని సాక్షాత్తూ నారదుడు హిమవంతుడికి చెప్పాడు.
వర్ణ సమామ్నాయం అందించిన శివుడికి మనమంతా రుణపడి ఉన్నాం. అందుకు కృతజ్ఞతగానే అక్షరాభ్యాసం నాడు మనం మన పిల్లలతో ‘ఓం నమ:శివాయ సిద్ధం నమ:’ అని మొదటగా రాయిస్తూ ఉంటాం.
అలాగే, యోగవిద్యను మొదట పార్వతీదేవికి బోధించి.. స్త్రీలకు బ్రహ్మవిద్యోపదేశానికి శివుడు మార్గదర్శి అయ్యాడు.
తంత్రాలను సంస్కరించి అందులోని రహస్యాలను జగత్తుకు అందించిన వాడు పరమశివుడే.
ప్రపంచంలోని సంగీత విద్యకంతా మూలం సప్త స్వరాలు. అందులోని షడ్జమం (నెమలి), రిషభం (ఎద్దు), గాంధారం (మేక), మధ్యమం (గుర్రం), పంచమం (కోకిల), దైవతం (కంచరగాడిద), నిషాదం (ఏనుగు).. ఈ ఏడింటి ధ్వనుల స్వభావంతో సంగీతవిద్యను శివుడు ఆవిష్కరించాడు.
‘శివతాండవం’తో జగత్తుకు నృత్యవిద్యను అందించాడు.
దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి తెలిపేందుకు తాను అలాగే జీవించి చూపాడు.
పార్వతికి సగ భాగం ఇచ్చి, గంగను తలపై మోసి స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో నిరూపించాడు.
సమాజంలో భేదాలను రూపుమాపేందుకు శివతత్వం ప్రతిపాదించాడు.
‘ఆత్మగోత్రం పరిత్యజ్య శివగోత్రం పవిశుతు’.. స్వాభిమానం కలిగించే గోత్రాలను వదిలిపెట్టి శివగోత్రం స్వీకరించాలని లోకానికి ప్రబోధించాడు.
శవాలను ముట్టుకుని శరీరధర్మ విజ్ఞానం తెలిపేందుకే తంత్ర విద్యను శివుడు ఆవిష్కరించాడు.
గుణహీనుడని, నిర్గుణుడని నిందించిన దక్ష ప్రజాపతి మాటలు తిట్లుగా భావించకుండా ‘లింగ’ రూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు. ఈ లింగంపై పంచామృతాలతో పాటు ఏది పోసినా ఏదీ నిలవకుండా చేసి తన దగ్గర ఏదీ ఉంచుకోననే సందేశం అందించాడు.
సద్గుణ, నిర్గుణత్వానికి ‘శివలింగం’ ప్రతీక అయితే, సంపూర్ణ గురు స్వరూపానికి దక్షిణామూర్తి నిదర్శనం. ఆ స్వామి ముఖం చుంచే సనాతనమైన అచలం వ్యక్తమైంది. అత్యద్భుతమైన మోక్ష విద్యను అందించిన దక్షిణామూర్తి ఆది గురువయ్యాడు.

శివ సహస్ర నామాలను పఠించినా, పఠింప చేసినా దు:ఖమనేది ఉండదు. ఆపదను పొందిన వారు శివ సహస్ర నామాలను యథావిధిగా వందసార్లు పఠిస్తే శుభవం కలుగుతుంది. ఈ స్తోత్ర రోగాలను నాశనం చేసి విద్యను, ధనాన్ని, సర్వ కామనలను నిత్య శివభక్తిని అందిస్తుంది. ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఎన్నెన్నో శివ సహస్ర నామ పఠితకు దక్కుతాయని శివ సహస్ర నామ పఠన ఫలంలో శివుడే చెప్పాడు.
పూర్వం ఒకసారి దేవతలకు, రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు. చివరకు వారంతా కలిసి విష్ణువు వద్దకు వెళ్లి తమ కష్టాలను తీర్చాలని వేడుకున్నారు. విష్ణువు వారందరికీ ధైర్యాన్ని చెప్పి క్షణ కాలం పాటు మనసులో శివుడిని ధ్యానించాడు. ఆ తరువాత తాను కైలాసపతిని ఆరాధించి, దేవతలకు శత్రువుల బాధలు లేకుండా చేస్తానని విష్ణువు చెప్పి అందరినీ వారి వారి నెలవులకు పంపించేశాడు. అనంతరం శ్రీ మహా విష్ణువు దేవతల జయం కోసం కైలాసానికి వెళ్లి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి, ఆ పక్కన ఒక పార్థివ లింగాన్ని కూడా ప్రతిష్ఠించి తపస్సుకు ఉపక్రమించాడు. ఎంత కాలానికీ శివుడు ప్రత్యక్షం కాలేదు.

మృత్యుంజయ మంత్రం
అపమృత్యు భయాన్ని పోగొట్టేది, ఆధ్యాత్మిక చింతనా ధోరణిని పెంచేది మృత్యుంజయ మంత్రం. దీనినే మహా మృత్యుంజయ మంత్రం, త్య్రంబక మంత్రం, రుద్ర మంత్రం, మృత్యు సంజీవని మంత్రం అని కూడా అంటారు. జీవితంపైనే కాదు మృత్యువుపైనా అవగాహన కల్పిస్తుందీ మంత్రార్థం. త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాత్‍ మృత్యోర్‍ ముక్షీయ మామృతాత్‍ ఇది రుగ్వేదం ఏడో మండలం యాభై తొమ్మిదో సూత్రంలో పన్నెండో మంత్రం. యజుర్వేదంలో, తైత్తరీయోపనిషత్తులోనూ ఈ మంత్ర ప్రస్తావన ఉంది.స
మార్కండేయుడు ఈ మంత్రాన్ని జపించే శివుడి అనుగ్రహాన్ని, చిరంజీవత్వాన్ని పొందాడని, అందుకే ఈ మంత్రం అపమృత్యు దోషాన్ని నివారిస్తుందని నమ్ముతారు. ఈ మంత్రంలోని ప్రకంపనలకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని కొందరు భావిస్తారు.
సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే మూడు కన్నులున్న ఓ ‘‘పరమేశ్వరుడా! నేను నిన్ను పూజిస్తున్నాను. ఈ పూజకు ప్రతిఫలంగా తొడిమ నుంచి దోసపండు విడిపోయినంత సులభంగా సంసార బంధనాల నుంచి విడిపోయేలా అనుగ్రహించు’’ అనేది ఈ మంత్ర భావం.
ఈ మంత్రంలో మోక్షం అనే దాన్ని అమృతంతో సమానమైనదిగా చెబుతారు. సంసార బంధనాల్లో పడి కొట్టుకుంటూ, కనీసం దైవనామ స్మరణ చేయలేని వారు చాలా మంది ఉంటారు. వారంతా ఎలాంటి వారంటే తీగకు అంటిపెట్టుకుని ఉన్న దోసకాయల్లాంటి వారు.
పచ్చి దోసకాయ తీగకు వేలాడుతున్నప్పుడు దాన్ని తెంపడం అంత సులభం కాదు. పైగా దాన్ని తెంచే ప్రయత్నం చేస్తే కాయతో పాటు తీగంతా కదిలి అల్లకల్లోలం అవుతుంది.
కానీ, దోసకాయ బాగా పండినపుడు తీగ నుంచి తొడిమ చాలా సులభవంగా విడివడుతుంది.
నిజానికి నా కుటుంబం, నా వాళ్లు, నా సంపద అనే భావన నుంచి బయటపడటం అంత సులభం కాదు. దీనికి ఏకైక మార్గం భగవంతుడిని ఆశ్రయించడమే.
ప్రతి ఒక్కరూ ముక్తి సాధన కోసం భగవంతుడిని స్మరించాలి. ఆ ముక్తి అమృతంలాంటిదని, దానిని అనుగ్రహించాలని పరమేశ్వరుడిని స్తుతిస్తున్నట్టు కనిపిస్తుందీ మంత్రం.
శివుడు త్య్రంబకుడు. త్రిగుణాతీతుడు. త్రిజన్మ పాప సంహారుడు. అలాగే, ఆ శివుడి కరుణ సుగంధం వ్యాపించినట్టు భక్త జనావళి అందరిపై వ్యాపిస్తుంది. ఆ స్వామి పుష్టిని పెంపొందిస్తుంటాడు.
అలాంటి స్వామి దయతో అమృతత్త్వంలాంటి ముక్తి లభించాలని కోరుకోవడమే మహా మృత్యుంజయ మంత్రంలోని విశేషం.

దాంతో తన తపస్సును, శివరాధానను విష్ణువు మరింత వృద్ధి చేశాడు.
హిమాలయాల చెంతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన వెయ్యి కమలాలను తెచ్చి ప్రతి రోజూ భక్తితో శివుడిని విష్ణువు పూజిస్తూ ఉండేవాడు. దీక్షతో విష్ణువు సాగిస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకున్నాడు శివుడు. ఒక రోజును విష్ణువు మానస సరోవరం నుంచి వెయ్యి పువ్వులను తెచ్చి ప్రతి రోజూ తాను శివ సహస్ర నామాలతో పూజ చేస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పూజకు ఉపక్రమించాడు. శివ సహస్ర నామాలలోని తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను పఠిస్తూ అన్ని పూవులతోనూ పూజ చేశాడు. చిట్టచివరి నామం పఠిస్తూ పువ్వు కోసం చూడగా, అది కనిపించలేదు. ఎలాగైనా సహస్ర నామాలను పువ్వులతో కలిపి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన మహా విష్ణువు కమలాన్ని పోలిన తన కన్నునే శివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవతల కోసం అంతటి త్యాగానికి సిద్ధపడిన మహా విష్ణువును చూసి శివుడు ఎంతో సంతోషించి అక్కడ వెంటనే ప్రత్యక్షమయ్యాడు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు
శైవ క్షేత్రాల్లో ప్రధానమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలనూ శైవులు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు. వాటి వివరాలు..
గుజరాత్‍ సోమనాథ క్షేత్రం
జామ్‍నగర్‍ నాగేశ్వర క్షేత్రం
శ్రీశైలం మల్లికార్జున క్షేత్రం
ఉజ్జయిని మహాకాలేశ్వర క్షేత్రం
ఇండోర్‍ ఓంకారేశ్వర క్షేత్రం
ఉత్తరాఖండ్‍ కేదార్‍నాథ్‍ క్షేత్రం
పుణె భీమశంకర క్షేత్రం
నాసిక్‍ త్రయంబకేశ్వర క్షేత్రం
ఎల్లోరా ఘృష్ణేశ్వర క్షేత్రం
వారణాసి విశ్వేశ్వర క్షేత్రం
దేవ్‍గఢ్‍ వైద్యనాథ క్షేత్రం
రామేశ్వరం రామనాథ క్షేత

పంచారామ క్షేత్రాలు
ఆంధప్రదేశ్‍లో ఐదు శైవ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి.. అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, భీమారామ క్షేత్రాలుగా ప్రతీతి.

అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం
భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం
సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం

పంచభూత క్షేత్రాలు
ఐదు శైవ క్షేత్రాలు పంచభూత క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో నాలుగు తమిళనాడులో ఉంటే, ఒకటి ఆంధప్రదేశ్‍లోని చిత్తూరు జిల్లాలో ఉంది. వాటి వివరాలు..

తమిళనాడు జంబుకేశ్వరం జల క్షేత్రం
తమిళనాడు అరుణాచలం అగ్ని క్షేత్రం
తమిళనాడు (కంచి) ఏకాంబరేశ్వరాలయం పృథ్వీ క్షేత్రం
తమిళనాడు (చిదంబరం) నటరాజస్వామి ఆకాశ క్షేత్రం
ఆంధప్రదేశ్‍ (చిత్తూరు) శ్రీకాళహస్తీశ్వరస్వామి వాయు క్షేత్రం

తిలింగ క్షేత్రాలు
మన తెలుగు నేలకు త్రిలింగ క్షేత్రమనే పేరుంది. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం అనే మూడు శైవ పుణ్య స్థలాలతో ఆవృతమైన ప్రాంతం కాబట్టి త్రిలింగ దేశమనే పేరు వచ్చిందని ప్రాచీన కాలం నుంచి వ్యావహారికంలో ఉంది.

ద్రాక్షారామం: ఇక్కడ స్వయంభువుగా వెలిసిన శివలింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడు. శివుడు భీమేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.
శ్రీశైలం: మల్లికార్జున స్వామిగా ఇక్కడ శివుడు వెలిశాడు.
కాళేశ్వరం: ఒకే పానవట్టంపై శివుడు, యముడు కాళేశ్వర, ముక్తేశ్వర స్వామిలుగా వెలిశారు.

ఓం నమ:శివాయ

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయశుద్ధాయ దిగంబరాయ
తస్మై న కారాయ నమ:శివాయ
శివ పంచాక్షరీ మంత్రం ‘ఓం నమ:శివాయ’లోని ఐదు బీజాక్షరాల్లో ‘న’ కారం బ్రహ్మను, ‘మ’ కారం విష్ణువును, ‘శి’ కారం రుద్రుడుని, ‘వ’ కారం మహేశ్వరుడిని, ‘య’ కారం సదాశివుడిని సూచిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘శివ’ అనే మాటకు మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉన్నాయి.
ప్రతి వ్యక్తీ కోరుకునేవి ఈ ప్రయోజనాలే.
ఈ భావాన్ని ఆశించడం, ఆశ్రయించడం, మనలో ఈ గుణాలను వృద్ధి చేసుకోవడమే శివోపాసన అవుతుంది.
మనిషి తనలో దాగి ఉన్న పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడిని గుర్తించడానికి తానే స్వయంగా రుద్రుడిగా మారి రుద్రుడిని అర్చించాలి.
ఈ భావనను బలపరుస్తూ ‘నా రుద్రో రుద్రమర్చయేత్‍’ అంటారు. అంటే- రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించలేడని చెబుతోంది మహన్యాసం.

ప్రాదుర్భావానికి సంబంధించి ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది.. బ్రహ్మ, విష్ణువు ఒకసారి తమలో ఎవరు గొప్ప అనే అహానికి పోవడం.. దీంతో ఈ లోకంలో ఏది అత్యంత శక్తివంతమైనదనే వాదులాటకు పోయారు. ఈ క్రమంలో వారికి ఒక స్తంభం కనిపించింది. అయితే దానికి మొదలు, అంతం కనిపించడం లేదు. దీంతో ఆ స్తంభం ఆది, అంతం కనుగొనాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ స్తంభం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకునేందుకు విష్ణువు దాని మొదలు కనిపెట్టేందుకు కిందికి పయనం ప్రారంభించాడు. బ్రహ్మ దాని అంతం కనిపెట్టేందుకు స్తంభం పైకి పయనించాడు. కానీ ఇద్దరూ ఎంత ప్రయత్నించినా దాని మొదలు, చివర కనుగొనలేకపోయారు. చివరకు ఇద్దరు తమ తమ నెలవులకు చేరగా అక్కడ శివుడు కనిపించాడు. తమ కంటే బ్రహ్మాండమైన శక్తి ఆ లోకంలో ఉందని, ఆ శక్తికి ప్రతిరూపమే శివుడని, తాము స్తంభంగా భావించినది మహా లింగమని బ్రహ్మ, విష్ణువులకు అర్థమైంది. ఇదీ లింగావిర్భావ కథనం.

శివుడి పెంపుడు తల్లి ఎవరో తెలుసా?
మహిళ మూలకంగా శివుడు జన్మించలేదు. మరి బాల్యంలో ఆయన ఆలనపాలన ఎవరు చూశారు? కృష్ణుడికి యశోద మాదిరిగా శివుడికీ ఓ పెంపుడు తల్లి ఉంది. ఈ అమ్మ సాక్షాత్తూ భగవంతుడికే తల్లిగా మారి తన ప్రేమానురాగాలను పెంచింది. ఆమె- బొజ్జ మహాదేవి. ఆమెనే ముత్తవ్వ అనీ అంటారు. బొజ్జ మహాదేవి అభవుడైన శివుడిని చేరదీసి, తల్లి లేని శివుడికి తానే తల్లిలా మారి సపర్యలు చేసింది. శిశువుగా ఉన్న శివుడికి నీళ్లు పోయడం దగ్గరి నుంచి అన్నీ తానై చూసుకుంది. శివుడికి స్నానం చేయించేటపుడు ముక్కు, కళ్లు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా ఒత్తి తీర్చిదిద్దింది. శివుడి మీద పక్షుల నీడ పడకుండా ఎంతో జాగ్రత్త వహించేది. బాల శివుడిని తన పొట్ట మీద పడుకోబెట్టుకుని జోల పాడి నిద్రపుచ్చేది. ఇంత ప్రేమగా చూసుకునే ఆ అమ్మకు ముగ్ధుడైపోతాడు శివుడు. అయితే, ఆ అమ్మకు శివుడు ఒక పరీక్ష పెట్టాలని అనుకుంటాడు. కావాలనే అంగలికి (నోటికి) ముల్లు రోగం తెచ్చుకుని విలవిల్లాడిపోతాడు ఒకసారి. తల్లి పాలు తాగడానికి కూడా నోరు తెరవడం లేదు. దీంతో బొజ్జ మహాదేవి విలవిల్లాడిపోతుంది. పాలు తాగకుంటే బిడ్డ బతకడు. బిడ్డ లేని బతుకెందుకుని ఆమె ప్రాణ త్యాగానికి సిద్ధపడుతుంది. ఆమె ప్రేమకు లొంగిపోయిన శివుడు తన నిజ రూపాన్ని ప్రదర్శించి, నీ అమ్మ ప్రేమ ముందు నేను ఓడిపోయాను.. ఏ వరం కావాలో కోరుకో అంటాడు. నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉంటే చాలని ఆ తల్లి అంటుంది. దీంతో, నీలాంటి తల్లి ఏ బిడ్డ పక్కనుంటే ఆ బిడ్డకు ఎలాంటి రోగాలు దరిచేరవని, మూడు లోకాలకు తండ్రినైన తనకే నువ్వు తల్లివయ్యావు కాబట్టి నువ్వు ‘ముత్తవ్వ’గా ప్రసిద్ధి చెందుతావని శివుడు బొజ్జ మహాదేవికి వరమిచ్చాడు.

Review శివ శివ శంకర.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top