వడ్డీకాసుల వాడికి ఎందరో భక్తులు.
మదిలోని కోరికలు నెరవేరితే
ఎందరెందరో కడతారు ముడుపులు.
ఎన్నో రూపాల్లో చెల్లించుకుంటారు కానుకలు.
స్థోమతకొద్దీ ఇస్తుంటారు కొందరు విరాళాలు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి భక్తుల రుణం ఉంచుకోవడం లేదు..
వారిచ్చిన విరాళాలు, కానుకలకు తగినట్టుగా ఇతోధికంగా సౌకర్యాలనూ కల్పిస్తోంది.
దర్శన భాగ్యం నుంచి బహుమతుల వరకూ అందించి భక్తులకు ఆనందానుభూతులను పంచుతోంది.
పది వేల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా విరాళాలు, కానుకల రూపంలో అందచేసిన వారికి పలు రకాల సేవలు, దర్శనాలు, రుసుముతో కూడిన వసతి, ఆశీర్వచనాలు అందచేస్తోంది.
ఆ వివరాలే ఈ మాసం ప్రత్యేకం..
రూ.10 వేల నుంచి రూ.లక్ష వరక్తు శ్రీవారి పేరుతో అందించే ప్రతి పది వేల రూపాయల విరాళం లేదా కానుకకు.. దానిని అందించిన వారికి ఒక బిగినింగ్ బ్రేక్ దర్శనం కల్పిస్తార్తు ఇలా తొమ్మిదిసార్ల వరకు అవకాశం ఇస్తారు (శ్రీవాణి ట్రస్ట్)
రూ.లక్ష నుంచి
రూ.5 లక్షల వరక్తుఏడాదిలో ఒకసారి సుపథం ద్వారా ఐదుగురికి దర్శనం. ్తఒకరోజు వసతి్త చిన్న లడ్డూలు ఆరు అందచేస్తారు.్త బహుమానంగా ఒక దుపట్టా, జాకెట్ ముక్క అందిస్తారు.
రూ.5 లక్షల నుంచి
రూ. 10 లక్షల వరకు..్త పై మొత్తంలో విరాళం అందించిన భక్తులకు ఏడాదిలో మూడుసార్లు సుపథం ద్వారా ఐదుగురికి దర్శనం కల్పిస్తార్తు మూడు రోజుల వసత్తి చిన్న లడ్డూలు పది అందిస్తార్తు ఒక దుపట్టా, జాకెట్ ముక్క బహుమానంగా అందచేస్తారు
రూ.10 లక్షల నుంచి
రూ.25 లక్షల వరక్తు పై మొత్తంలో విరాళం అందించిన భక్తులకు ఏడాదిలో మూడుసార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శన్త మూడు రోజుల వసత్తి 20 చిన్న లడ్డూలు అందిస్తార్తు మహా ప్రసాదాలు పది్త ఒక దుపట్టా, జాకెట్ ముక్క, 50 గ్రాముల పరిమాణం గల ఒక వెండినాణెం బహుమానంగా అందచేస్తారు.
రూ.25 లక్షల నుంచి
రూ.50 లక్షల వరక్తు ఏడాదిలో మూడుసార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శన్త ఏడాదిలో ఒకసారి సుపథం ద్వారా దర్శన అవకాశ్త 4 పెద్ద లడ్డూల్తు 5 చిన్న లడ్డూల్తు మహా ప్రసాదాలు్త ఒక దుపట్టా, జాకెట్ ముక్క, 5 గ్రాముల పరిమాణం గల ఒక బంగారు నాణెం, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా అందచేస్తారు
రూ.50 లక్షల నుంచి
రూ.75 లక్షల వరక్తుఏడాదిలో ఐదుగురికి ఒకరోజు సుప్రభాత సేవ ్తఏడాదిలో మూడుసార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం ్త ఏడాదిలో రెండుసార్లు సుపథం ద్వారా దర్శన అవకాశ్తపెద్ద లడ్డూలు 6్త చిన్న లడ్డూలు్త మహా ప్రసాదాలు 10్త ఒక దుపట్టా, జాకెట్ ముక్క, 5 గ్రాముల బంగారు నాణెం, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా అందచేస్తారు
రూ.75 లక్షల నుంచి
కోటి రూపాయల వరక్తుఏడాదిలో రెండు సార్లు ఐదుగురికి సుప్రభాత సేవ ్తఏడాదిలో మూడుసార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం ్తఏడాదిలో మూడుసార్లు సుపథం ద్వారా దర్శన అవకాశం ్తమూడు రోజుల వసతి్త పెద్ద లడ్డూలు్త చిన్న లడ్డూలు్త మహా ప్రసాదాలు్త ఒక దుపట్టా, జాకెట్ ముక్క, 5 గ్రాముల బంగారు నాణెం, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా అందచేస్తారు
కోటి రూపాయలకుపైగా అందచేస్త్తేఏడాదిలో మూడుసార్లు ఐదుగురికి సుప్రభాత సేవ ్తఏడాదిలో మూడుసార్లు బిగినింగ్ బ్రేక్ దర్శన్తఏడాదిలో నాలుగుసార్లు సుపథం ద్వారా దర్శన అవకాశ్త పెద్ద లడ్డూలు 10్త చిన్న లడ్డూలు 20్త మహా ప్రసాదాలు 10
• ఒక దుపట్టా, జాకెట్ ముక్క, ఏడాదిలో ఒకసారి వేద ఆశీర్వచనం, 5 గ్రాముల బంగారు నాణెం, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా అందచేస్తారు.
ట్రస్టులకు విరాళాలు అందచేస్తే..
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు విరాళాలు అందచేస్తే సెక్షన్ 80(జీ) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఆ ట్రస్టుల వివరాల్తు శ్రీవేంకటేశ్వర (ఎస్వీ) అన్నప్రసాదం ట్రస్ట్
త్ శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని స్క్తీ శ్రీ బాలాజీ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రిసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ (బర్డ్) ట్రస్ట్త్స్విమ్స్త్ శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) భక్తి ఛానల్‍త్సర్వశ్రేయాస్ ట్రస్ట్
త్ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్త్శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) ఆపన్న హృదయ స్క్తీ శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) గోసంరక్షణ ట్రస్ట్
• శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) విద్యాదాన ట్రస్ట్
• శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) వేద పరిరక్షణ ట్రస్ట్
పై ట్రస్ట్లకు ఇచ్చే విరాళాలన్నీ చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలోనే ఆలయ ఈవో పేరిట అందచేయాలి. ట్రస్టులకు ఇచ్చే విరాళాలను నగదు రూపంలో స్వీకరించరు. తిరుమల తిరుపతి దేవస్థాం (టీటీడీ) ఇచ్చిన ఐడీ, పాస్‍వర్డ్ ద్వారా ఈ విరాళాలను అందచేయడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలను
https://www.tirumala.org ద్వారా తెలుసుకోవచ్చు.




































































































































































































































































































































































Review శ్రీవారికి కానుక.. ఆశీర్వాదాల వేడుక.