సంకల్ప బలం

•ట్టిభము అనేది ఒక చిన్న ఆకారం కలిగిన పక్షి. దానినే లకుముకి పిట్ట అని కూడా అంటారు. ఆ టిట్టిభ జాతికి చెందిన ఒక ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం వెళ్లింది. అది తిరిగి వచ్చి చూసే సరికి గుడ్లు అక్కడ కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను లోనికి ఈడ్చుకుని పోయాయి.

గుడ్లు కనిపించకపోవడంతో ఆ టిట్టిభపక్షి మహా క్షోభ అనుభవించింది. పక్షులకు కూడా మనుసుల వలే హృదయం ఉంటుంది కదా!.

‘అయ్యో! నా బిడ్డలను ఈ పాడు సముద్రం అపహరించుకునిపోయిందే’ అని తలుస్తూ ఆ చిన్న పక్షి రోదించసాగింది. కానీ ఆ రోదన వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది?.

కొంతసేపు ఏడ్చిన తరువాత ఆ పక్షి మనసులో తళుక్కున ఒక ఆలోచన తట్టింది. తత్ఫలితంగా ఏడుపు మానేసింది. కార్యాచరణకు దిగింది. సముద్రపు ఒడ్డుకు పోయి తన ముక్కుతో ఒక సముద్రపు నీటి బొట్టును పీల్చి దూరంగా ఎగిరిపోయి ఒకచోట ఊసేసి.. మళ్లీ సముద్రం వద్దకు వచ్చి ఇంకొక బొట్టును పీల్చి దూరంగా పోయి ఊసివేయసాగింది.

ఈ ప్రకారంగా అది నిర్విరామంగా ఆ నీటిని ఊసివేసే పనిలో నిమగ్నమైంది. దాని అభి ప్రాయం- ఆ సముద్ర జలాన్నంతా పీల్చి ఊసివేస్తే తన గుడ్లు బయటపడతాయని.

ఏదైనా పట్టుదల గురించి వర్ణించేటపుడు పెద్దలు ఈ కథనే చెబుతుంటారు.
ఆధ్యాత్మిక సాధకులు కూడా మనసును భగవంతునిపై లగ్నం చేసేటపుడు, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నం అయ్యేటపుడు పై దృష్టాంతం లోని టిట్టిభపక్షికి ఉన్నంతటి పట్టుదలతో ఉండా లని అంటారు.

ఇక్కడ ఆ పక్షి సముద్రాన్ని మొత్తం పీల్చివేయ గలిగిందా? లేదా? అనేది కాదు.. ఒక సంకల్పానికి దిగినపుడు ఎంతటి పట్టుదల వహించాలనేది నేర్చుకోవాల్సినే నీతి.

మన మనసులో అనేక జన్మార్జితములైన పాప వాసనలు ఉంటాయి. వాటిని తొలగించి వేసి ఉత్తమ సంస్కారాలకు స్థానం కల్పించాలంటే అందుకు ఎంతో ధైర్యం, స్థైర్యం, పట్టుదల అవసరం. ఆ పాప వాసనలు, దుష్ట సంస్కారాలు ఒక పట్టాన బయటకు వెళ్లవు.

చాలా కాలం నుంచి అవి మనిషి చిత్తంలో హక్కుభుక్తాలు ఏర్పర్చుకుని ఉంటాయి. కాబట్టి వాటిని సాగనంసేందుకు గొప్ప స్థైర్యం, అచంచలమైన పట్టుదల ఆవశ్యకం.
మనిషి గొప్ప పట్టుదల గలవాడై ఇంద్రియా లను, మనసును జయించాలి. సంయమశీలుడై మెలగాలి.

ఇంద్రియాలు కానీ, మనసు కానీ నోటిమాట లతో లొంగేవి కావు. వాటిని జయించాలంటే వాటిని సంయమనం చేయాలంటే సాధకుడు దృఢచిత్తం కలవాడై, ధీరబుద్ధి కలిగి, అకుంఠిత మైన దైవ విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి.

అందుకు గాను సంకల్పాన్ని వహించాలి. పిరికితనాన్ని పారద్రోలాలి. గంభీర స్వభావం కలిగి ఉండాలి. ధైర్యంతో అంత: శత్రువులను ఎదుర్కోవాలి. అప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేర గలుగుతారు. శాంతిని, ఆనందాన్ని పొంద గలుగుతారు.

ఇక, పై కథ ముగింపునకు వస్తే.. టిట్టిభపక్షి చేస్తున్న పనిని కొన్ని తోటి పక్షులు హేళన చేశాయి. సముద్రాన్ని తోడివేయడం నీ వల్ల అవుతుందా? అని ఎగతాళి చేశాయి. మరికొన్ని దాని కష్టం చూడలేక దాని పనిలో సాయ పడ్డాయి. మొత్తానికి టిట్టిభపక్షులన్నీ కలిసి సముద్రంలోని నీటిని పీల్చడం.. ఆవల వదలి వేయడం.. ఆ పక్షులన్నీ కలిసి రోజుల తరబడి చేస్తున్న ఈ పనిని చూసి చలించిపోయిన సము ద్రుడు విషయం ఏమిటని వాటిని అడిగాడట.
తన గుడ్లు సముద్రంలోకి ఈడ్చుకునిపోయిన విషయాన్ని తల్లి పక్షి సముద్రుడికి మొర పెట్టు కుంది.

ఆ పక్షుల పట్టుదల, సంకల్పాన్ని చూసి కదిలిపోయిన ఆయన తన జలగర్భంలోకి జారి పోయిన గుడ్లను వెతికి తెచ్చి టిట్టిభపక్షికి అప్పగించాడట.
పని చిన్నదా? పెద్దదా? అవుతుందా? కాదా? అనేది కాదు.. ముందు ఆ పనిపై మనం చూపే చిత్తశుద్ధి, పట్టుదల ఎంతటి ఉన్నత స్థాయిలో ఉండాలనే నీతిని ఈ చిన్ని కథ మనకు అందిస్తోంది.

Review సంకల్ప బలం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top