ఇంట్లో ఉంటూనే… ఇలవేల్పుల సేవా భాగ్యం

వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్‍లో ఉంటారు. ఆయనకు ఆంధప్రదేశ్‍లోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతంలో కుటుంబంతో కలిసి పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక. కానీ తీరిక లేని ఉద్యోగ జీవితంలో తలమునకలై ఉండే ఆయన ఎప్పటికప్పుడు వెళ్లాలనుకున్నా వివిధ కారణాలతో వెళ్లలేకపోయారు. చివరకు మిత్రుల ద్వారా తెలుసుకున్న ఆయన.. హైదరాబాద్‍లో ఉండే కుటుంబంతో సహా సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్నారు.
• • • • •
అమెరికాలోని టెక్సాస్‍లో ఉండే రవి.ఎన్‍.. తెలంగాణలోని భద్రాచలంలో ఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణాన్ని వీక్షించాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నారు. కానీ, ఆయనకు వారాంతపు సెలవు దొరకడమే గగనం.. ఇక, పది రోజులు సెలవు పెట్టుకుని అమెరికా నుంచి భారత్‍ రావడం.. ఈ వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి.. కానీ, భద్రాచలంలో జరిగిన మొన్నటి నవమి వేడుకల్లో సీతారాముల కల్యాణాన్ని వీక్షించారు. ఏకంగా ముత్యాల తలంబ్రాలు కూడా నేరుగా ఆయనుండే అమెరికాకే వచ్చేశాయి.
• • • • •
అరవిందరావు సీనియర్‍ సిటిజన్‍. పదవీ విరమణ అనంతరం భార్యతో కలిసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలన్నీ సందర్శించాలని, అక్కడ జరిగే విశేష పూజల్లో పాల్గొనాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పిల్లలు ఉద్యోగ రీత్యా దగ్గర లేకపోవడం.. వయసు మీదపడటంతో తోడు, సహాయకులు లేకుండా తామిద్దరు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో తన నిస్సహాయతకు చింతించే వారు. చివరకు సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న ఆయన తిరుపతిలోని తనింట్లో ఉంటూనే ఒకరోజు సింహాచలంలో జరిగే నిత్యకల్యాణ తంతులో పాల్గొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మకూ పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది..
• • • • •

వెంకటేశ్వరరావు హైదరాబాద్‍లో ఉంటూనే అన్నవరం సత్యదేవుని వ్రతాన్ని వీక్షించగలిగారు.
రవి ఎక్కడో అమెరికాలో టెక్సాస్‍లో ఉంటూ.. భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికి
తెప్పించుకున్నారు.
అరవిందరావు దంపతులు తిరుపతిలోని ఇంట్లో ఉంటూనే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానాలయాల్లో జరిగే విశేష పూజల్లో పాల్గొన్నారు..
ఇదంతా ఎలా సాధ్యమైంది?

ఇదంతా అంతర్జాల మాయాజాలం. పరోక్షంగానైనా భగవానుడి సేవలో తరించే అవకాశం కలిగిస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు. వివిధ కారణాలతో ఆలయానికి వెళ్లలేని వారు, దూర ప్రాంతాల్లో, పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉంటున్న వారు ఆయా ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు, కల్యాణాల వంటివి చేయించుకునేందుకు ఆయా దేవాలయాలు అందిస్తున్న పరోక్ష సేవలు వీలు కల్పిస్తున్నాయి. మరి, అలాంటి సేవలు ఏయే ఆలయాల్లో లభిస్తున్నాయి? వాటిని ఎలా పొందాలో తెలుసుకుందాం.

తెలంగాణలో ఇలా..
తెలంగాణలో మీ-సేవతోపాటు, దేవాదాయ శాఖ ఆయా ఆలయాల వెబ్‍సైట్ల ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నాయి. తపాల శాఖ ద్వారా కూడా ఈ రకమైన సేవలు పొందే అవకాశం ఉంది.

ష్ట్ర••జూ•://••••స్త్రఱతీఱస్త్ర•••••వఎజూశ్రీవ.•వశ్రీ•అస్త్ర•అ•.స్త్రశీఙ.ఱఅ/.. ఈ వెబ్‍సైట్‍ ద్వారా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యం జరిగే శాశ్వత సహస్ర నామార్చన, అభిషేకం, కల్యాణాల్లో పరోక్షంగా పాల్గొనే అవకాశం ఉంది.

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విరాళాలకు ఈ-హుండీ, అన్నదానానికి ఈ-డొనేషన్లతో పాటు అభిషేకం, అర్చన వంటి సేవల్లో పరోక్షంగా పాల్గొనవచ్చు.

ష్ట్ర••జూ•://•ష్ట్ర••తీ••తీఱ•వఎజూశ్రీవ.•వశ్రీ•అస్త్ర•అ•.స్త్రశీఙ.ఱఅ/.. ఈ వెబ్‍సైట్‍లో అన్ని వివరాలూ ఉంటాయి. భద్రాచలం ఆలయ కల్యాణ తలంబ్రాలను ఇంటికే తెప్పించుకునే అవకాశాన్ని అటు ఆర్టీసీతో పాటు ఇటు తపాల శాఖ కల్పిస్తున్నాయి. ఆర్టీసీ సిబ్బంది, ఏజెంట్ల వద్ద లేదా పోస్టాఫీసులో బుక్‍ చేసుకుంటే సరిపోతుంది.

బాసర సరస్వతి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, వరంగల్‍ భద్రకాళీ, హైదరాబాద్‍ పెద్దమ్మ గుడి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లోనూ ఆన్‍లైన్‍ ద్వారా పరోక్షంగా ఆలయ సేవల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ఆంధప్రదేశ్‍లో ఇలా..
ఏపీలోని ప్రధాన ఆలయాలైన శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి, శ్రీకాళహస్తీశ్వరాలయం, ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి, అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతో పాటు.. అంతర్వేది, చినకాకాని, మోపిదేవి, వాడపల్లి, అయినవిల్లి, విశాఖపట్నం కనక మహాలక్ష్మి, కసాపురం ఆంజనేయస్వామి వంటి మరో 20 ముఖ్య ఆలయాల్లో కూడా ఆన్‍లైన్‍ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఆంధప్రదేశ్‍ దేవాదాయ శాఖకు చెందిన అధికారిక వెబ్‍సైట్‍ ష్ట్ర••జూ•://•జూ•వఎజూశ్రీవ•.•జూ.స్త్రశీఙ.ఱఅ/ ద్వారా ఈ సేవలు పొందవచ్చు.

ఈ వెబ్‍సైట్‍లోకి వెళ్లాక ‘సేవ అండ్‍ దర్శనం’ అనే ఆప్షన్‍ ఉంటుంది. దానిపై క్లిక్‍ చేస్తే ప్రత్యక్ష, పరోక్ష సేవల బుకింగ్‍కు ఆప్షన్‍ వస్తుంది. అందులో పరోక్ష సేవ ఆప్షన్‍ ఎంపిక చేసుకోవాలి.

ఆ తరువాత పరోక్ష సేవలు అందుబాటులో ఉన్న ఆలయాల వివరాలు కనిపిస్తాయి.

ఆలయాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ పరోక్ష సేవ కింద లభించే పూజలు, సేవలు, కల్యాణాలు, అర్చనల వివరాలు కనిపిస్తాయి. వాటికి ఎంత చెల్లించాలనేది కూడా చూపిస్తుంది.

సంబంధిత సేవను ఎంపిక చేశాక, తేదీ, పూజలు చేయించుకునే వారి పేర్లు, గోత్రాలు, చిరునామా, ఫోన్‍ నంబర్‍ తదితర వివరాలను నింపాలి. చివరిలో ఆ పూజకు నిర్దేశిత ఫీజును ఆన్‍లైన్‍లో చెల్లించాలి.

ఇలా బుకింగ్‍ జరిగిన పరోక్ష సేవలను.. ఆయా ఆలయాల్లో సంబంధిత తేదీల్లో వారి పేరిట చేస్తారు. ఆయా అర్చనలు, పూజలు తదితరాలు చేస్తున్నపుడు పరోక్ష సేవ బుక్‍ చేసుకున్న వారి గోత్ర, నామాలు చదువుతారు.

కొన్ని ఆలయాల్లోనైతే ఆయా పూజలను, వ్రతాలను, కల్యాణోత్సవాలను యూట్యూబ్‍ చానల్‍ ద్వారా లైవ్‍లో చూసేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు.

Review ఇంట్లో ఉంటూనే… ఇలవేల్పుల సేవా భాగ్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top