తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళా కారుడు, వెంట్రిలాక్విస్ట్, కళారత్న మల్లం రమేష్ ‘ఉగాది ఉత్సవాలు’ సందర్భంగా అమెరికా రానున్నారు. 2019 ఏప్రిల్ 4న పోర్ట్లాండ్ నగరానికి చేరుకుని తదుపరి నార్త్ టెక్సాస్, న్యూజెర్సీ తదితర ప్రాంతాలలో సాంస్క•తికపరంగా పర్యటిస్తారు. ఏప్రిల్ 13న నార్త్ టెక్సాస్‍లో జరిగే ఉగాది ఉత్సవాలలో పాల్గొంటారు. మరికొన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ‘విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ శిష్యుడైన కళారత్న మల్లం రమేష్ భారతదేశం లోనూ, పలు ఇతర దేశాలలోనూ 5000లకు పైగా మిమిక్రి మరియు వెంట్రిలాక్విజమ్ ప్రదర్శనలు ఇచ్చారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రమేష్ వ్యాఖ్యాతగా, హాస్యవల్లరి కళాకారునిగా కూడా మంచి పేరు సంపా దించారు.
మార్గదర్శకుడు మల్లం రమేష్
సుప్రసిద్ధ మిమిక్రి ఆర్టిస్ట్ మరియు వెంట్రిలాక్విస్ట్ కళారత్న మల్లం రమేష్ సాంస్క •తిక రంగంలో మార్గదర్శకునిగా పేరు సంపాదించారు. వందలాది మంది కళాకారులను ప్రోత్సహించే క్రమంలో హైదరాబాద్ రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ తదితర వేదికలపై ఎన్నో సాంస్క •తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కష్టాలలో ఉన్నవారికి, అనారోగ్యంతో బాధపడేవారికి సాంస్క•తిక ప్రదర్శనల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తుంటారు. కొద్దినెలల క్రితం వంగూరి నాగేశ్వరరావు అనే కిడ్నీ పేషంట్ కోసం కళాప్రదర్శనలు ఏర్పాటు చేసి రూ. 1.60 లక్షలు వసూలు చేసి ఇచ్చినారు.
కళా ప్రదర్శనల్లో దిట్ట
కళారత్న రమేష్ కళాప్రదర్శనలు ఏర్పాటు చేయటంలో మరియు ప్రదర్శించటంలో దిట్ట. ఇతని ప్రదర్శనలు మిగతావారికి కొంత భిన్నంగా ఉంటాయి. మిమిక్రిలో హాస్యం, శబ్దాల అనుకరణతోపాటు, పలు సంగీతాలు కొన్ని కంఠాలు భిన్నంగా అనుకరిస్తారు. వెంట్రిలాక్విజమ్ ప్రదర్శనకు పిల్లలు, పెద్దలు అందరూ ముగ్ధులవుతారు. దాదాపు 30 సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన ఈ కళాప్రముఖుడు ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే మనస్తత్వం గలవాడు కావటంతో ఇండియాలో అభిమానుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. తింటే గారెలు తినాలి, వింటే కళారత్న రమేష్ మిమిక్రి వినాలి అని అనేకసార్లు పలువురు కొనియాడటం విశేషం.
హైదరాబాద్ దుర్గాబాయి దేశ్‍ముఖ్ కాలనీకి చెందిన రమేష్‍కు అనేకమంది శిష్యులు ఉన్నారు. ఈయన శిష్యులలో నటులు, మిమిక్రి కళాకారులు, మెజీషియన్లు, రచయితలు, ఈవెంట్ మేనేజర్లు ఎందరో ఉన్నారు.
ప్రముఖుల ఆశీస్సులు
కళారత్న రమేష్ తన ప్రతిభతో ఎందరినో ఆకట్టుకోవడంతోపాటు అనేకమంది ప్రముఖుల ప్రశంసలు పొందారు. శ్రీ కొణిజేటి రోశయ్య, డాక్టర్ రేణుకా చౌదరి, డాక్టర్ సి. నారాయణరెడ్డి, శ్రీ అక్కినేని నాగేశ్వర రావు, డా।। వై.ఎస్. రాజశేఖర్‍రెడ్డి, ప్రముఖ నటుడు మురళీమోహన్, అల్లు అరవింద్, కోడిరామకృష్ణ, రేలంగి నరసింహారావు, ముప్పలనేని శివ, ఎస్.జానకి, తుమ్మల నాగేశ్వరరావు, జమున, కె.వి.రమణాచారి, కేంద్ర మాజీమంత్రి డా. ఎస్. వేణుగోపాలచారి, రవికొండబోలు తదితర ఎందరో ప్రముఖులు ఈయనకు ఆశీర్వాదాలు అందజేశారు. జంటనగరాల కళాసంస్థలు ‘కళారత్న’ అవార్డుతో సత్కరించాయి. సిద్ధసమాధి యోగా బంగారు పతకంతో సత్కరించింది. అవార్డులు, సత్కారాలు లెక్కలేనన్ని వచ్చాయి. ప్రభుత్వం తరపున కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. కళారత్న మల్లం రమేష్ అమెరికాలో సాంస్క •తిక పర్యటనల నేపధ్యం పట్ల పలువురు హర్షిస్తున్నారు.
Review కళారత్న మల్లం రమేష్‍కు ఘనస్వాగతం పలుకుతున్న అమెరికా.