గణపతిం భజే

సర్వపూజలు, సకల శుభకార్యాలు ముందుగా వినాయక స్తుతితోనే శ్రీకారం చుట్టుకుంటాయి. ఇక, ఆదికవులైన వాల్మీకి, వ్యాసుడు మొదలుకుని నన్నయ ఇత్యాది కవిశ్రేష్టులు విఘ్ననాయకుడి ఇష్టదేవతా స్తుతితోనే తమ కావ్య రచనలను ప్రారంభించారు. శైవ వైష్ణవ మతాల మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాక విఘ్నేశ్వరార్చన రెండు రకాలుగా మారిపోయింది. వైష్ణవులు గణపతి పూజను ‘విష్వక్సేన పూజ’గా వ్యవహరిస్తారు. ‘శుక్లాంబరధరం’ అనే శ్లోకానికి విష్ణుపరంగా వేరే అర్థం స్థిరపడింది. వినాయకాదులు (గజానన, షడానన, హయాననాదులు) విష్వక్సేనుని కింది సేనానులనే సంప్రదాయం ఏర్పడింది. గణపతినే ప్రధాన దైవంగా పూజించే వారిని గాణాపత్యులని అంటారు. భాద్రపద శుక్ల చతుర్థి (సెప్టెంబరు 13) నాడు గణపతి విశేష పూజ లందుకుంటాడు. ఆ రోజు వినాయకుని జన్మదినం కావడమే అందుకు కారణం. ఈ పర్వదినమే ‘వినాయక చతుర్థి’, ‘వినాయక చవితి’గా ప్రసిద్ధి.వినాయక చవితి నాడు ఉదయాన్నే మంగళస్నానాలు చేసి, తమ ఇష్టార్థములను, నిరంతర సిద్ధిని అభిలషిస్తూ పూజలు ప్రారంభిస్తారు. మట్టితో చేసిన వినాయక ప్రతిమను ప్రత్యేక పూజా వేదికపై ప్రతిష్ఠిస్తారు. విగ్రహానికి పై భాగాన వివిధ ఫల, పుష్పాదులతో కూడిన పాలవెల్లిని కడతారు. కొందరు ధాన్యరాశిపై కానీ, తండుల రాశిపై కానీ ప్రతిమను ప్రతిష్ఠించే ఆచారం కూడా ఉంది. భాద్రపద మాసంలో లభించే- మాచిపత్రి, తులసి, బిల్వం, మరువం, బృహతి, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దానిమ్మ, దేవదారు, వావిలి, జాజి, గణకి, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు- ఈ 21 పత్రులు, పుష్పాలతో గణనాథుని పూజిస్తారు. ఇక, వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్లు అంటే మహా ప్రీతి. వాటిని 21 విధాలుగా నేతితో చేసి నైవేద్యమిస్తారు. ఈ మాసంలో లభించే పండ్లు, ఫలాలైన – నేరేడు, వెలగ మొదలైనవన్నీ గణపతికి నివేదిస్తారు. అనంతరం ఆయన విగ్రహం వద్ద అఖండదీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం మర్నాటి సాయంకాలం వరకు వెలుగుతుండాలి. అనంతరం వినాయకుని విగ్రహాన్ని బావి, చెరువులు, కాలువలు, నదులలో నిమజ్జనం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో విగ్రహాలను ధాన్యపు గాదెలలో, గోడలలోని గూళ్లలో పెట్టి అద్దం వేసి మెత్తివేసే ఆచారం కూడా ఉంది. దీనివల్ల ధాన్యం అక్షయంగా లభిస్తుందని, సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం.

వినాయక జనన వృత్తాంతం
వినాయకుని పుట్టుక గురించి పురాణాలలో పలు విధాలుగా ఉంది. లింగ పురాణం ప్రకారం- రాక్షసులు శివుని కోసం తపమాచరించి పెక్కు వరాలు పొందారు. వర గర్వంతో దేవతలను హింసించే వారు. అసుర గణాల వేధింపులను భరించలేక దేవతలు శివునికి మొర పెట్టు కున్నారు. శివుడు విఘ్నేశ్వరుడిని సృష్టించాడు. రాక్షసుల తపస్సులకు విఘ్నాలు (ఆటంకాలు) కల్పించి, దేవతలకు తోప్డాలని ఆదేశించాడు. ఈ కారణంగానే విఘ్నేశ్వరుడు విఘ్నాలు కల్పించడానికి, నివారించ డానికి కారకుడని ప్రసిద్ధి. అందుకే చేపట్టిన కార్యాలలో విఘ్నాలు కలగకుండా తొలిగా వినాయకుడిని పూజించే ఆచారం ఏర్పడింది.
అయితే ఇదే కథను మరో విధంగానూ చెప్పుకుంటారు.
శివుని ఆజ్ఞానుసారం గణపతి రాక్షసులను సంహరించే పక్రియలో తన ప్రమేయం లేకపోవడంపై పార్వతి ఆగ్రహిస్తుంది. పరమశివునిపై కోపాన్ని గణపతిపై చూపుతుంది. ఏనుగు తలతో, బాన కడుపుతో, వికార రూపంతో ఉంటావని శపిస్తుంది. చింతాక్రాంతుడైన గణపతిని శివుడు ఊరడించి, సకల దేవతా గణాధిపతిగా, సకల విఘ్న నివారక దైవతంగా పూజలందుకుంటావని అనుగ్రహిస్తాడు.
ఇక, బహళ ప్రాచుర్యంలో ఉన్న మరో కథనం ఇది-
గజాసురుడిని సంహరించి పరమేశ్వరుని అనుగ్రహంతో పార్వతి చేతిలో పిండిబొమ్మగా మారి, ప్రాణాలు కోల్పోయిన గణపతి.. గజాసురుని తలను తెచ్చి అతికించడంతో పునరుజ్జీవుతుడయ్యాడు.
కిందిది మరో కథ-
స్వయంగా శివుడే వినాయకుడితో చెప్పిన జన్మ వృత్తాంతమిది.
‘నేను, ఉమ (పార్వతి)తో పాటు హేమ వనంలో విహరిస్తూ ఒక ఏనుగుల జంట క్రీడించడం చూశాను. దానిని చూసిన పిదన నేను మగ ఏనుగు ఆకారాన్ని, పార్వతి ఆడ ఏనుగు ఆకారాన్ని ధరించి క్రీడించాము. అప్పుడు పార్వతి గర్భం దాల్చగా గజాననుడు జన్మించాడు’’.

కృష్ణుడు చెప్పిన వినాయక వ్రత మహిమ
వినాయక చవితి వ్రతాన్ని సిద్ధి వినాయక వ్రతంగా వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ వ్రతాన్ని ఆచరిందుడు జలనిధిలో దాక్కున్నాడు. లోకాలు అంధకారబంధురాలయ్యాయి. దీంతో భీతిల్లిన దేవతలు, రుషులు- చంద్రుడిని శాప విముక్తిడిని చేయాలని గణపతిని ప్రార్థించారు. అప్పుడు- ‘భాద్రపద శుక్ల చతుర్థి నాడు నిన్ను దర్శించిన వారికే సంవ త్సరమంతా ఈ మిథ్యాప వాద దోషం అంటుకుంటుంది’ అని శాప భారాన్ని తగ్గించాడు.

గణపతి ఆది దైవతం..
త్రిగుణాత్మక స్వరూపుడై, త్రైమూర్త్య భావనతో విరాజిల్లే విఘ్నేశ్వరుడు వైదిక కాలం నుంచీ ఆర్యావర్తమైన భారతావనిలో ఆది దైవతా స్వరూపంగా పూజలు అందుకుంటున్నాడు. ప్రకృతిలోని సత్త్వ రజస్తమో గుణాది స్వరూపుడైన ఈయనను గుణేశుడని వేదాలలో అభివర్ణిం చారు. కాల క్రమేణా అది గణేశ నామంగా విలసిల్లినది.
గాణాపత్యం సంప్రదాయానుసారం గణము అనగా సత్త్వ రజస్తమో గుణ సమ్మిశ్రం. ఈ త్రిగుణాధిపతి విఘ్నేశ్వరుడు. పురాణేతిహాసాలను బట్టి సకల దేవతా గణాలకు అధిపతి కనుక ఆ విధంగా కూడా గణపతి నామం సార్థకం.
‘సర్వదేవమయ సాక్షాత్‍ సర్వమంగళదాయకః
మాఘ కృష్ణ చతుర్థ్యాం తు ప్రాదుర్భూతో గణాధిపః’
పృథ్వీతత్వ్తం ప్రధానం గలవారు పరమేశ్వ రుడిని, జలతత్త్వం ప్రధానంగా గలవారు గణపతిని, తేజతత్త్వం ప్రధానంగా గలవారు దుర్గాదేవిని, వాయుతత్త్వం ప్రధానంగా గలవారు సూర్యుడిని, ఆకాశతత్త్వం ప్రధానం గలవారు విష్ణువును పూజిస్తారు. కేవలం ఒక దేవతా మూర్తి అయిన విఘ్నేశ్వరునికి ఏ శుభ కార్యారంభంలోనైనా తొలి పూజ గావించడం పాంచభౌతిక శరీరులైన ప్రాణులకు అవశ్య కర్తవ్యం. కనుకనే సకలతత్త్వ గుణాధీశుడైన గణపతిని కింది విధంగా అర్చిస్తారు-
ఆదిత్యం గణనాథంచ
దేవీరుద్రంచ కేశవమ్‍
పంచదైవ మిత్యుక్తమ్‍
సర్వకర్మ సు వినాయక పూజయేత్‍
గణపతి దేవుని కృప వలన సకల భక్తకోటికి ఐహికాధ్యాత్మిక సంపత్తులు అందుతాయి. ఆ భావాన్ని దిగువ ప్రస్తుతిలో దీప్తిమంతంగా చెప్పారు.
సిద్ధ్యంతి సర్వకార్యాణి
మనసాచించితాన్యపి
తేన ఖ్యాతిమ్‍ గతోలోకే నామ్నా సిద్ధివినా యకాః
భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం వహించిన విఘ్నేశ్వరుడిని యథావిధిగా ఏక వింశతి (21) పత్రాలతో అర్చించి, తరించడం భారతావనిలో జాతి మత ప్రాంత వివక్ష లేకుండా తరతరాలుగా కొనసాగుతున్న సంస్క•తీ ప్రతీక. వినాయక చవితి పర్వదినాన్ని ఒక జాతీయ సమైక్య పర్వదినంగా లోకమాన్య బాలగంగాధర తిలక్‍ వంటి మహా నాయకులు నిర్వహించారు. స్వాతంత్య్ర సముపార్జన కోసం భారత జాతి యావత్తూ ఏకతాటిపై పోరాడుతున్న వేళ వినాయక నవరాత్రోత్సవాలు కూడా జాతీయ సమైక్యతా భావాన్ని చాటడానికి ఉపకరించాయి. అందుకే గణపతి కేవలం దైవం మాత్రమే కాదు. అసలు సిసలు భారయతకు దర్పణం కూడా. దీనికి కొనసాగింపుగానే ముంబైలో, హైదరాబాద్‍లో గణపతి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చివరి రోజు జరిగే నిమజ్జన ఊరేగింపు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు.

చవితి నాడు ఏ గణపతిని పూజించాలి?
ఎన్నెన్నో రూపాలు.. మరెన్నో నామాలు గణపతి దేవుని సొంతం. అన్నిటి భావమూ, వాటిని పూజిస్తే కలిగే ఫలమూ ఒక్కటే అయినా కూడా.. చవితి నాడు ఏ గణపతి రూపాన్ని కొలవాలి? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. చవితి నాడు పూజించాల్సిన ప్రతిమ శ్వేతార్క గణపతి అని పండితులు చెబుతారు. ఆయనకు ఆకుపచ్చ రంగు పట్టు వస్త్రాలు ధరింప చేయాలి. కలశంపై ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని అలంకరించాలి. ఈ ఆకుపచ్చ రంగు ప్రకృతికి సంకేతం. ప్రకృతి హరిత పరిష్వంగంలో భాసించే అప్రాకృత దివ్యతేజో రూపం గణపతి. అందుకే భక్తులు గణపతిని హరిత పత్రాలు, పత్రి, గరిక, దళాలు, కాయలతో పూజిస్తారు.
ఇక, ప్రాథమికంగా చూస్తే- గణపతి ప్రధానంగా ఆరు (6) రూపాల్లో పూజలు అందుకుంటాడని ప్రతీతి. ఆ ఆరు రూపాలు ఇవి..
1) మహా గణపతి, 2) హరిద్రా గణపతి, 3) స్వర్ణ గణపతి, 4) ఉచ్చిష్ఠ గణపతి, 5) సంతాన గణపతి, 6) నవనీత గణపతి.
గణపతిని గురించిన కథలు, గాథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. నిజానికి ఇవి పిల్ల లను, పెద్దలను అందరినీ చదివిస్తాయి. కానీ, వాటి లోని అంతరార్థాలు మాత్రం జ్ఞానాన్వేషణకు దారి చూపిస్తాయి.

తొలి పూజ వినాయకునికే..
క్షీరసాగర మధనం చేసేటపుడు దేవతలు వినాయకుడిని పూజించడం మరిచిపోయారు. అందువల్ల దేవతల కార్యానికి పలు అవాంతరాలు ఏర్పడ్డా యని అంటారు. మొదట హాలాహలం పుట్టి అందరినీ భయ విహ్వలులను చేసింది. విష్ణువు సలహాతో దేవతలు అపుడు గణపతిని పూజించి మొదటగా పాల సముద్రంలో ఆవిర్భవించిన దానిని ఆయనకు సమర్పించుకుంటామని మొక్కుకున్నారు. ఈ క్రమంలో మొదట వెలువడిన లక్ష్మీదేవిని వినాయకునికి సమర్పించారు. ఆమెను ఆయన స్వీకరించి తన కుడి తొడపై ఆశీనురాలిని చేసుకుని లక్ష్మీ గణ••తిగా దర్శనమిచ్చాడు (చాలా చిత్రపటాల్లో, కొన్ని దేవాలయాల్లో ఈ రూప విగ్రహం కనిపిస్తుంది). అనంతరం ఆమెను తన పూజ చేయమని దేవతలకు సూచించిన విష్ణువుకు వినాయకుడు ఇచ్చివేశాడు. విష్ణువు ఆమెను స్వీకరించి తన ఎడమ తొడపై ఆశీనురాలిని చేసుకున్నాడు. కుడి తొడపై కూర్చున్న ఆమె కుమార్తెతో సమానమని శాస్త్రం చెబుతోంది.
లక్ష్మీదేవిని పూజించి ధనాన్ని, సరస్వతిని పూజించి విద్యను, పార్వతిని పూజించి శక్తిని, విష్ణువును పూజించి రక్షణను, శివుడిని పూజించి ముక్తిని- ఇలా ఒక్కొక్కరి వల్ల ఒక్కో కోర్కెను నెరవేర్చుకోగలమని మన పెద్దలు చెబుతుంటారు. కానీ, సకల కార్యసిద్ధులను కలిగించ గలవాడు విఘ్నేశ్వరుడు మాత్రమే.
ఆ రాష్ట్రంలో నరముఖ గణపతి ప్రత్యేకం
గణపతి అంటే ఏనుగు ముఖం కలిగిన దైవంగానే మనకు గుర్తుకు వస్తాడు. కానీ నరముఖం కలిగిన వినాయకుడూ ఉన్నాడు. తమిళనాడులోని రెండు ఆలయాల్లో నరముఖ వినాయక విగ్రహం మనకు దర్శనమిస్తుంది. గణపతికి గజం (ఏనుగు) ముఖం తగిలించ డానికి ముందు ఆయన నర ముఖంతోనే ఆవిర్భవించాడు. ఆ ముఖం కలిగిన విగ్రహం పూజలందుకునేది తమిళనాడులో మాత్రమే.

‘ప్రణామ్యము శిరసాదేవం
గౌరీపుత్రం వినాయకం’ అని గణపతి స్తుతి. వినాయకుడు గౌరీపుత్రుడు. గౌరీదేవి (పార్వతి) సర్వమంగళ. ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది. ఒకరోజు గౌరీదేవి తన ఒంటికి రాసుకున్న పసుపును నలిపి ఓ రూపాన్ని మలిచింది. అదే నర వినాయక రూపం. ఆ తరువాత శివుడు రావడం, వినాయకుడి తల నరికేయడం, ఏనుగు ముఖం అతికించడం.. ఆ తరువాత గజాసుర సంహారం మనకు తెలిసిన పురాణగాథే. అయితే, గజానన రూపం ధరించడానికి ముందు గల నరముఖ రూపంతో వినాయకుడు రెండు చోట్ల కనిపిస్తాడు. ఈ రెండు ఆలయాలు తమిళనాడులోనే ఉండటం విశేషం.
ఒకటి- తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలోని ఈస్ట్బోల్‍వార్డ్ రోడ్డులోని నండ్రుడయాన్‍ వినాయక ఆలయం ఉంది. పదో శతాబ్దపుతమిళ సాహిత్యంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఈ ఆలయంలో నర రూప వినాయకుడి విగ్రహాలు రెండు ఉంటాయి. గ్రానైట్‍తో చేసిన ఈ విగ్రహాల్లో ప్రధానమైనది ఐదడుగుల ఎత్తైనది. మరొకటి 4 అడుగుల ఎత్తు ఉంటాయి. ప్రధాన విగ్రహం నడుముకు నాగాభరణం, స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. నాలుగు అడుగుల ఎత్తుండే నరముఖ గణపతికి ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో తామరమొగ్గ ఉంటాయి.
రెండు- తమిళనాడు తిరుపూరు జిల్లా కూత్తనూర్‍కు 3 కిలోమీటర్ల దూరంలో ఆది వినాయకుడి ఆలయం ఉంది. నరముఖిడిగా ఉండే ఈ స్వామిని సేతలపతి అనీ పిలుస్తారు. ఇక్కడ తర్పణాలు ఇచ్చి పితృకర్మలు చేస్తే మంచిదని స్థానికులు నమ్ముతారు. అందుకే ఈ ఊరికి తిలతర్పణపురి అనే పేరూ ఉంది. ప్రతి నెలా సంకటహర చతుర్థి నాడు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.

విష్ణువుకు మేనల్లుడు..
వినాయకుడిని ‘శుక్లాంబరధరం విష్ణుం’ అని ప్రార్థిస్తాం. విష్ణువు అంటే అంతటా వ్యాపించిన వాడని అర్థం. గణపతి కూడా విష్ణువు మాదిరి గానే సర్వ వ్యాపకత్వం ఉన్న వాడు. అందుకే గణపతి గురించి చెప్పేటప్పుడు ఈ శ్లోకం చదువుతారు. అది-
శ్రీకాంతో మాతులోయస్య.. జననీ సర్వమంగళా జనకః శంకరో దేవః
తం వందే కుంజరాననం శ్రీకాంతో మాతు లోయస్య
అంటే- గణపతికి మేనమాన శ్రీకాంతుడు. శ్రీకాంతుడంటే స్వయంగా విష్ణువు. అంటే లక్ష్మీదేవి పతి. తత్వపరంగా శ్రీహరి, పార్వతి అన్నాచెల్లెళ్లు. మరి, వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున ఎప్పుడైనా పుట్టారా? అంటే, పుట్టారనే చెప్పాలి. భాగవతం ప్రకారం నందుడు, యశోదలకు యోగమాయ, శ్రీకృష్ణుడు ఒకేసారి పుట్టారు. ఈ యోగమాయయే పార్వతీదేవి. ఈమె కుమారుడు గణపతి. ఈ విధంగా నారాయ ణుడికి విఘ్నేశ్వరుడు మేనల్లుడు అవుతాడు. అందువల్ల వినాయకుడిని పూజిస్తే అటు లక్ష్మీనారాయణులను, ఇటు శివపార్వతులనూ పూజించిన ఫలం కలుగుతుంది.
చరాచర సృష్టికి ముందు ఓంకారమే గణపతి రూపంగా ప్రభవించింది. సర్వవ్యాపక ప్రణవ తేజస్విగా, విశ్వరూప దైవంగా వేదాలు గణపతిని కీర్తించాయి. మనం నివసించే భువనమంతటా ప్రకృతి స్వరూపంగా నిండి నిబిడీకృతమై అందరి చేతా పూజల.

Review గణపతిం భజే.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top