పెంపుడు పిల్లి

మర్యాద రామన్న.. ఈ పేరు విన్నారా? ఎటువంటి చిక్కు సమస్య అయినా చిటికెలో ఇట్టే విప్పి చూపే తెలివితేటలు గలవాడు మర్యాద రామన్న. మరి పంచతంత్రం కథల గురించి తెలుసా? పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి
ఉండాలని చాటే కథలివి. ఇంకా కాశీమజిలీ కథలు, నసీరుద్దీన్‍ కథలు.. పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పడానికి ‘తెలుగు పత్రిక’ సిద్ధంగా ఉంది. ప్రతి మాసం ఒక్కో నీతి కథ.. పిల్లలూ సిద్ధమేనా.

బృందావనపురంలో సత్తెయ్య అనే వర్తకుడు ఉండేవాడు. ఆ వర్తకుడు ఆ ప్రాంతంలో పండిన దూదిని కొని నిలువ చేసేవాడు. మంచి ధ•ర రాగానే అమ్మేవాడు.
సత్తెయ్య మంచి ఆలోచనాపరుడు, లౌకికుడు. పత్తి వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు. అతనికి నలుగురు కుమారులు, వానికి పెంపుడు పిల్లి కూడా ఉండేది. ఆ పిల్లి ఎలుకలను వేటా డుతూ దూదికి నష్టం రాకుండా చేసేది.
సత్తెయ్య పెద్దవాడయ్యాడు. మంచాన పడ్డాడు. తాను చనిపోయే కాలం వచ్చిందని తెలుసు కున్నాడు. కొడుకులు నలుగురిని పిలిచాడు. ‘‘అబ్బాయిలూ! మన ఆస్తిని, దూది కొట్టును జాగ్రత్తగా చూసుకోండి! తెలివిగా వ్యాపారం చేసుకోండి. కలిసి మెలసి హాయిగా జీవిం చండి’’ అన్నాడు.
ఇంతలో పెంపుడు పిల్లి మంచం దగ్గ రకు వచ్చింది. ఈ పిల్లి ఎంతో కాలంగా మన దూదికి ఎలుకల వలన నష్టం కాకుండా చూస్తోంది. ఈ పిల్లిని నలుగురూ పంచుకోండి. ‘‘దీని ముందు రెండు కాళ్ళు పెద్దవాళ్ళిద్దరూ, వెనుక రెండు కాళ్ళు చిన్నవాళ్ళి ద్దరూ పంచుకోండి’’ అని సత్తెయ్య చెప్పాడు. కొద్ది రోజులకు సత్తెయ్య చనిపోయాడు.
తండ్రి చెప్పినట్లుగా పిల్లి నాలుగు కాళ్లూ నలుగురు పంచుకున్నారు. పెద్దవాడు బంగారు గొలుసు, రెండవవాడు వెండిగొలుసు, మూడవవాడు వెండి మువ్వలు, నాల్గవవాడు వెండి కడియం చేయించారు. తమ వాటాకు వచ్చిన పిల్లి కాళ్లకు అలంకరించారు. ప్రేమతో పిల్ల్లిని పెంచసాగారు.
ఇలా ఉండగా నాల్గవవాడి వాటాకు వచ్చిన పిల్లి కాలికి ఏదో కురుపులేచింది. వైద్యుడి సలహాపై నాల్గవవాడు నూనె తడిపిన గుడ్డను కురుపు వున్న కాలికి కట్టాడు. ఆ పిల్లి కుంటుకుంటూ నడుస్తోంది.
ఒకరోజు అర్ధరాత్రి వేళ పిల్లి నడుస్తూ దీపం పై పడింది. కాలికి ఉన్న నూనె గుడ్డ దీపానికి అంటుకుంది. మంటలు వచ్చాయి. ఆ పిల్లి భయంతో అరుస్తూ పత్తి నిల్వ చేసిన గదిలోకి వెళ్ళింది.
పిల్లికాలి మంటలు దూదికి అంటుకున్నాయి. కొద్దిసేపటిలో గిడ్డంగిలోని పత్తి కాలి మసి అయ్యింది. పెద్దవాళ్ళు ముగ్గురికీ నాల్గవ వానిపై కోపం వచ్చింది. మండిపడ్డారు.
‘‘నీ వాటా పిల్లికాలికి కట్టిన నూనె గుడ్డ కారణంగానే దూది తగలబడింది. మాకు నష్టం వచ్చింది. ఆ నష్టానికి నీవే కారణం. నష్ట పరిహారం చెల్లించు’’ అంటూ నాల్గవవానితో తగాదా పడ్డారు. ఈ తగాదా తీర్చమని నలుగురూ మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు.
రామన్న వారు చెప్పిన తగాదాను సావ ధానంగా విన్నాడు. రామన్నకు పెద్దవాళ్ళ వాదన తప్పనిపించింది. వాళ్ళ తప్పు తెలియ చెప్పాలను కున్నాడు. రామన్న వారితో ఇలా అన్నాడు.
‘‘పిల్లి దూది గదిలోకి కుంటికాలితో కాక, మిగిలిన మూడు కాళ్ళతోనే నడిచివెళ్ళింది. మీ వాటా కాళ్ళే అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి. కనుక మీరు ముగ్గురు నాల్గవ వానికి నష్టపరిహారం కట్టండి’’ అని తీర్పు చెప్పాడు. పెద్ద వాళ్ళు ముగ్గురు నిర్ఘాంతపోయారు.
నాల్గవవాడు రామన్నకు నమస్కరించాడు.
మరునాడు రామన్న నలుగురు అన్నదమ్ములను పిలిపించాడు. ‘‘మీలో మీరు తగవులాడుకోకూడదని మీ నాన్న కోరిక. అందుకనే పిల్లిని నలుగురు అన్నదమ్ములు పంచుకోవాలని మీ తండ్రి మీకు మరణ సమయంలో చెప్పాడు’’ అని వారికి హితవు పలికాడు. ఇకనైనా మీలో మీరు తగవులాడు కోకుండా కలిసికట్టుగా వ్యాపారం చేసుకుని లాభాలు పొందాలని సూచించాడు. పెద్దవాళ్ళు ముగ్గురు తమ తప్పు తెలుసుకున్నారు.
అనంతరం కాలంలో కలసిమెలసి వ్యాపారం చేసుకొని నలుగురూ వృద్ధిలోకి వచ్చారు.

Review పెంపుడు పిల్లి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top