యుఎస్ లో ని దక్షిణాసియా వాసులకు నేస్తం ఫ్రంట్ యాడ్ మీడియా

సిలికాన్‍ వ్యాలీ పై ఆధారపడిన డిజిటల్‍ ఎంటర్‍ప్రైజ్‍ మరో కొత్త డిజిటల్‍ అడ్వర్టైజింగ్‍ సొల్యూషన్స్ని ప్రవేశపెట్టింది. అదే ఫ్రంట్‍ యాడ్‍ మీడియా ఇన్క్. ఇది యుఎస్‍ఎలో వుండే దక్షిణాసియా ప్రజలకు మరింత దగ్గర కావడానికి ఉపయోగపడుతుంది.
యుఎస్‍ఎ లోని దక్షిణాఫ్రికా ప్రజల సంఖ్య చాలా పెరిగింది. మరీ ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత ఈ వృద్ధి రేటు 72 శాతం వుంది. వారిలో ఎంటర్‍ప్రెన్యూర్లు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, రకరకాల కంపెనీ సీఈవోలు… ఇలా అనేక ఉన్నత పదవుల్లో వుండి లక్షల డాలర్ల ఆదాయం వున్నవారూ వున్నారు. వారందరికీ అవసరమైన బ్రాండెడ్ల అవసరాలు తీర్చడం ఈ ఫ్రంట్‍యాడ్‍ మీడియా ఉద్దేశం.

దక్షిణాసియా మీడియా చాలా ప్రదేశాల్లో విస్తరించింది. దక్షిణాసియా ప్రవాసులకు కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే ఉపయోగించే అలవాటు వుంది. అటువంటి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడాన్ని ఈ డిజిటల్‍ సొల్యూషన్స్ చాలెంజ్‍గా తీసుకుంది. ఆన్‍లైన్‍ వస్తువులను అవసరమైనవారికి చేర్చడం టార్గెట్‍గా పెట్టుకోవడమే కాదు, దానికి తగిన ప్రచారం కూడా చేస్తోంది ఈ ఫ్రంట్‍ ఆడ్‍ మీడియా.

ఇప్పటికే ఫ్రంట్‍ యాడ్‍ మీడియా కంపేర్‍ రెమిట్‍.కామ్‍, పాథ్‍ 2 యుఎస్‍ఎ.కామ్‍, ట్రాకిట్‍.కామ్‍ వంటి వెబ్‍సైట్ల ద్వారా బ్యానర్లని, ఉన్నతమైన మీడియాని, ప్రతిభావంతమైన సమా చారాన్ని అమెరికాలోని దక్షిణాసియా ప్రజలకు అందిస్తోంది.

ఫ్రంట్‍యాడ్‍ మీడియా సీఈవో రాజీవ్‍ శ్రీవాత్సవ మాట్లాడుతూ… ‘‘ఫ్రంట్‍ మీడియాని ప్రారంభిస్తున్నందుకు చాలా ఉత్కంఠగా వుంది. దశాబ్ద కాలం పైగా దక్షిణాసియా ప్రజలతో మమేకమై వుంటున్నాం. చాలా బ్రాండ్‍ కంపెనీలు దక్షిణాసియా ప్రజలకు దగ్గరవ్వడానికి తంటాలు పడుతున్నాయి. ఫ్రంట్‍యాడ్‍ మీడియా అటువంటి బ్రాండ్‍ కంపెనీలకు, అవి చేరుకోవాలనుకుంటున్న వినియోగదారులకు మధ్య వున్న దూరాన్ని తగ్గించి, దగ్గర చేసే వారధిగా మా డిజిటల్‍ ఎడ్వర్‍టైజింగ్‍ సొల్యూషన్స్ సేవలందిస్తుంది’’ అన్నారు.

ఫ్రంట్‍ యాడ్‍ మీడియానే కాకుండా శ్రీవాత్సవ, విజిటర్స్ కవరేజ్‍ ఇన్క్ వంటి ప్రసిద్ధ డిజిటల్‍ వినియోగదారీ బ్రాండ్లను కూడా స్థాపించారు. వాటి గురించి ఆయన మాట్లాడుతూ… ఉదయం నుండి రాత్రి వరకు తన బ్రాండ్లలో ఒక్క దాన్నైనా అమెరికాలోని దక్షిణా సియా వాసులు తప్పనిసరిగా వినియోగిస్తారంటారు.
సంప్రదాయ డిజిటల్‍ మీడియా సంస్థలకు భిన్నంగా ఫ్రంట్‍ యాడ్‍ మీడియా ఇన్క్. అమెరికా లోని దక్షిణాసియా వాసులకు తన సృజనాత్మకత డిజిటల్‍ మీడియా ద్వారా సేవలందిస్తోంది.

Review యుఎస్ లో ని దక్షిణాసియా వాసులకు నేస్తం ఫ్రంట్ యాడ్ మీడియా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top