జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విరచిత గణేశ పంచరత్నం ఇది. వినినా, చదివినా చాలా పవిత్రమైన భావనలను కలిగించి, ఆధ్యాత్మిక జగతిలో విహరింప చేసే ఈ రత్నాకరం అర్థతాత్పర్యం..
ముదా కరాత్తమోదకం సదావిముక్తి సాధకం ।
కలాధరా వతంసకం విలాసి లోకరక్షకం —
అనాయకైక నాయకం విశాశితే భదైత్యకం –
నతా శుభా శునాశకం నమామి తం వినాయకమ్ ।।
ఆనందంతో భక్తులు సమర్పించిన మోదకాలను స్వీకరించి, భక్తులకు మోక్షమును ప్రసాదించి, చంద్రుడిని శిరోభూషణంగా ధరించి, లోకాలను సదా రక్షిస్తూ, నాయకుడు లేని వారికి నాయకుడై, రాక్షసులను సంహరించి, భక్తుల అశుభములను నాశనమొనరించే వినాయకుడికి సదా నమస్కరిస్తున్నాను.
నతేతరా తిభీకరం నవోదితార్క భాస్కరం ।
నమత్సురారి నిర్జరం నతాధికా పదుద్ధరం ।।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం ।
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ।।
ఆ పరమేశ్వరునికి నమస్కరించని వారికి అతి భయంకరమైన వాడు, అప్పుడే ఉదయించిన బాలసూర్యుని వలే ప్రకాశించే వాడు, వినయ విధేయతలతో, భక్తితో తనను ఆశ్రయించిన వారెవరైనా సరే.. వారిని ఆపదల నుంచి కాపాడు వాడైన ఆ దేవదేవుడైన సర్వేశ్వరునికి, సకల సంపదలకు, నిధులకు అధిపతి అయిన నిధీశ్వరునికి, ఈశ్వరునిచే గజముఖం కలిగిన గజేశ్వరుడికి, సకల భూతగణాలకు అధిపతి అయిన గణేశ్వరునికి, ఈశ్వరునికే ఈశ్వరుడైన ఆ మహేశ్వరునికి, సకల వేదాంత శాస్త్రానుభవంతో బ్రహ్మజ్ఞానులందరూ గణపతిని బ్రహ్మ అని, చరాచర ప్రపంచ స్వరూపమని, పురుషతత్త్వమని, సృష్టికర్త అని, పరమేశ్వరుడని, పరాత్పరుడని కొనియాడుతున్నారో ఆ మహా గణపతిని హృదయ పూర్వకంగా పూజించుచున్నాను.
సమస్త లో శంకరం నిరస్త దైత్యకుంజరం ।
దరేతరోదరం వరం వరే భవక్త్ర మక్షరం ।।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ।
మనస్కరం నమస్క•తాం నమస్కరోమి భాస్వరమ్ ।।
సమస్త లోకాలకు సుఖాలను కలిగించే వాడు, ఏనుగుల వంటి రాక్షసులను హతమార్చిన వాడు, సకల ప్రాణులు, అండపిండ బ్రహ్మాండాలన్నీ లయం చెందిన పెద్ద పొట్ట కలవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు, దయ కలిగిన వాడు, క్షమాగుణం కలిగిన వాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, కీర్తిని కలిగించే వాడు, నమస్కరించే వారికి మంచి మనసును ప్రసాదించే వాడు, సమస్త లోకాలకు, జీవులకు ప్రకాశవంతుడైన ఆ మహా గణపతి దేవునికి ఎల్లవేళలా నమస్కరించెందను.
అకించి నార్తిమార్జనం చిరంత నోక్తి భాజనం ।
పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ।।
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం ।
కపోల ఆన వారణం భజే పురాణ వారణమ్ ।।
నిరుపేదల దారిద్య్ర బాధలను తొలగించేది (జ్ఞానశూన్యుని అజ్ఞానాన్ని పోగొట్టేది), బహుకాలంగా ఉన్న వేదవేదాంగాలకు పాత్రమైనదీ, ముక్కంటీశ్వరుని జ్యేష్ఠ కుమారుడు, దేవతలకు విరోధులైన రాక్షసుల గర్వాన్ని నులిమివేయునదీ, ప్రపంచం యొక్క ప్రళయ కాల నాశనమునందు భయంకరమైనట్టిది, అగ్ని, ఇంద్రుడు ఇత్యాది దేవతలకు శిరోభూషణం వంటిది, బుగ్గలలో మదోదకం ఉవ్విళ్లూరుచున్నట్టి గజమును అనగా, విఘ్నేశ్వరుని సేవించుకొనుచున్నాను.
నితాంతకాంత దంత కాంతి మంతకాంతాకా త్మజం ।
అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనం ।।
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం ।
తమేకదంత మేవతం విచింతయామి సంతతమ్ ।।
అధికమైన, కాంతివంతమైన దంతములు కలవాడు, ఆ పరమేశ్వరుని కుమారుడైన సకల విఘ్నాలను నిర్విఘ్నంగా తుంచివేసే వాడు, చింతించ డానికి వీలుకాని దివ్య మనోహర రూపంతో, తనను పూజించే భక్తుల హృదయంలో నివసించే సమస్త లోకపాలకుడైన ఆ ఏకదంతుడిని, సర్వ కాల సర్వవ్యవస్థలయందు సదా నా హృదయ పద్మంలో నిలిపి ధ్యానించెదను.
Review శ్రీ మహాగనేష్ పంచరత్నం.