।। రుద్ర నామం భజే ।।

శివరాత్రి మహాత్మ్యాన్ని వర్ణించే కథలు- లింగ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. లింగ పురాణంలో వర్ణించిన ప్రకారం- ఒకనాడు కైలాస శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాశీనులై ఉన్నారు. పార్వతి- ‘దేవ దేవేశా! అన్ని వ్రతాలలోనూ ఉత్తమమైన వ్రతం, భుక్తి, ముక్తి ప్రదాయకమైన దానిని గురించి తెలిపి నన్ను కృతార్థురాలిని చేయండి’ అని కోరింది. దీంతో శివుడు- దేవీ! శివరాత్రి వ్రతం ఒకటుంది. అది పరమ రహస్యం. సర్వయజ్ఞ సమానం. ఉత్తమోత్తమమైనదీ, ముక్తిప్రదమైనదీ. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలి. తెలిసి కానీ, తెలియక కానీ ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని నుంచి తప్పించుకుని ముక్తిని పొందుతారు’ అని స్వయంగా బోధించాడట. శివరాత్రి అనేక విధాలుగా విశేషమైనది. అద్భుతమైన శివతత్త్వాన్ని గ్రహించడానికి ఇదో అమూల్యమైన అవకాశం. మార్చి 4 మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.

మాఘ కృష్ణ చతుర్దశి (మార్చి 4) శివరాత్రి పర్వదిన తిథి. ఇది యోగరాత్రి. భోగికి ఏది రాత్రో, యోగికి అది పగటితో సమానం. ఇది గీతా వాక్యం. శివజ్ఞానానికి, శివధ్యానానికి, శివకర్మికి రాత్రే పగలు కన్నా శ్రేష్ఠం. కాబట్టి యోగస్తులు శివారాధనలో గడిపే ప్రతి ఘడియా ఒక శివరాత్రితో సమానం.
మహా శివరాత్రి పర్వంలో ఒక నిగూఢమైన సందేశం దాగి ఉంది. పైకి ఇదో విచిత్ర విరోధాభాసంగా కని పిస్తుంది. శుభకరుడైన శివుడికి, అజ్ఞానానికి గుర్తు అయిన రాత్రికి లంకె ఏమిటి

మాఘాసితే పంచదశీ కదాచిత్‍
ఉపైతి యోగం యది వారుణేన
రుక్షేణ కాల: స పర: పితృణాం
న హ్యల్వనుణ్యైర్న•ప లభ్యతే సౌ
ఇది విష్ణు పురాణంలోని శ్లోకం.

మాఘ అమావాస్య శతభిష నక్షత్రయుక్తమైతే పితృ దేవతలకు శ్రేష్ఠమైనది, పుణ్యప్రదమైనదని పై శ్లోకానికి భావం.
శివరాత్రి అయిన వెంటనే వచ్చే అమావాస్య ఉగాది. శివరాత్రికి ముందు వెనుకలుగా వసంతపంచమి, మాఘ పూర్ణిమ, ఫాల్గుణ పౌర్ణమి తదితర పర్వదినాలు వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి శివరాత్రి వసంత రుతువు ఆరంభోత్సవమని అనుకోవచ్చు. శివరాత్రి విగ్రహారాధకులైన భారతీయులకు గొప్ప పర్వదినం అనడంలో సందేహం లేదు. ఆర్య సమాజీయులు శివరాత్రిని ప్రబోధ దినమని, జ్ఞానోదయ దినమని వ్యవహరిస్తారు.

సనాతన, పురాతనాల శివరాధన

శివరాధన ఈనాటిది కాదు. ఇది వేల ఏళ్ల క్రితం నాటి నుంచే దేశ విదేశాల్లో ఆచారంలో ఉంది. శివ, స్కంద, వాసుదేవుల విగ్రహ పూజ మన దేశంలో 2,800 ఏళ్లకు ముందు నుంచే ఉందని పాణిని సూత్రములు అనే గ్రంథాన్ని బట్టి తెలుస్తోంది. శివ వర్ణనలు హాలుని గాథా సప్తశతిలోనూ కొన్ని ఉన్నాయి.

నే ప్రశ్న కలుగుతుంది. జ్ఞానోదయానికి సంకేతం అయిన శివోదయం అర్ధరాత్రి మూడో జాములో జరగడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టింది. ఆ విషజ్వాలలు లోకాలను, లోకులను భయపెట్టాయి. లోక కల్యాణం కోసం శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. ఫలితంగా లోకేశ్వరుడు గరళకంఠంతో బాధపడసాగాడు. లోకనీతిగా స్వామికి సానుభూతి చూపడానికి సామాన్య రీతిలో శివరాత్రి ఉపవాస జాగరణలు ఆచారాలయ్యాయి. ఇది బాహ్యార్థపు పౌరాణిక సారాంశం. పారమార్థికంగా శివరాత్రికి విశేషమైన అర్థం ఉంది. పగలు వ్యవహారానికి, రాత్రి విశ్రాంతికి అనువైన సమయాలు. కర్మజీవులు పగలంతా కష్టపడి రాత్రి నిద్రాసక్తులవుతారు. కానీ, యోగ జీవులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. వారికి సామాన్య జీవన వ్యాపార శూన్యమైన రాత్రి ధ్యానోపాసనకు అనుకూలం.

వైరాగ్యానికి ప్రతీక శివతత్త్వం

అమూర్తమైన పరతత్వం త్రిమూర్తమై సృష్టి, స్థితి, లయలను నడిపిస్తున్నది. బ్రహ్మ సృజనాత్మకతకు, విష్ణువు పరిపాలనకు, శివుడు లయకు ప్రతినిధులై కల్పాంతం వరకు జగత్‍ చక్రాన్ని నడిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆరు భగవత్‍ తత్త్వాల్లో శివతత్త్వమైన వైరాగ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. వైరాగ్యం అంటే ఉన్నది వదిలి వేయడం కాదు. అన్నీ ఉన్నా కాదనగలిగే పరిత్యాగం. బాహ్య చైతన్య ఉపసంహారమే సన్యాసానికి సరైన నిర్వచనం.
శివుడు ఆదిభిక్షువు. భక్తిని పుచ్చుకుని ముక్తిని ప్రసాదించే అల్ప సంతోషి. భోలే బాబా. భక్తుల హృదయాలే సదాశివుడి నెలవులు. అజ్ఞానపు చీకట్లో శివ జ్ఞానదీపం వెలిగించే మహా రాత్రే శివరాత్రి. ఆదిలో ఉన్నదల్లా చీకటేనని, చీకటి అందులోనే దాగి ఉన్నదని, ఆ చీకటి నుంచే వెలుగు పుట్టిందని, వేదంలోని నాసదీయ సూక్తంలో స్పష్టంగా ఉంది. ఆ వెలుగే వెల్లువెత్తి చీకటిని ముంచి వేస్తుందని మహా భారతమూ చెబుతోంది. కురుసభలో కృష్ణుడు విశ్వరూపం చూపగానే వెలుగు కళ్లు మిరుమిట్లు గొలిపి వెంటనే కారు చీకట్లు కమ్మాయట. కాబట్టి శివరాత్రి శివోదయాన్ని ఒక మహోదయంగానే స్వీకరించాలి.

జ్ఞాన, కార్మిక శివరాత్రులు..

తెలివికి, ఎరుకకు నడుమ చాలా తేడా ఉంది. మెలకువలో వస్తువుల స్థూల రూపాన్ని చూస్తున్నాం. సుషుప్తిలో ఆద మరిచి హాయిగా నిద్రపోతున్నాం. మేలుకోగానే, ఆ హాయిని వర్ణించలేక పోయినా, ఆ అనుభూతిని నెమరువేసు కుంటున్నా మెలకువ కూడా ఒక కలేనని, కలలో కనిపించే వస్తువులన్నీ మనసు చేసినవేనని, మనసే ఎన్నో రూపాలుగా విరిసి మనల్ని మాయ చేస్తున్నదని తెలుసు కోవడం ఎరుక. పై మూడు అవస్థలకు అతీతమైన తురీయ స్థితిలోనే ఈ ఎరుక కలుగుతుంది. తెలివి లేదా ఎరుక కలిగిన ఈ నాలుగో స్థితి జ్ఞాన శివరాత్రి. ఫలాసక్తి లేని నిరాసక్తమైన కర్మ యోగం ‘కార్మిక శివరాత్రి’. ఎవరికి ఏది హితమో ఆ దారిలో శివరాత్రిని అనుష్ఠించు కోవచ్చు. దశను బట్టి దిశానిర్దేశం జరగాలి. పగలు అశివకర్మలు చేసి రాత్రి శివారాధన అంటే కుదరదు. మనసు అలజడి రేగితే ఆత్మచింతన సాగదు. జ్ఞానం, కర్మ రెండూ రెండు మార్గాలుగా చెప్పుకున్నా అవి వేరు కాదు. కర్మ ఉపాయం. జ్ఞానం ఉపేయం. జ్ఞానానికి కర్మ మార్గమే ఉపాయం. అందుకే- ‘అర్జునా! నువ్వు కర్మయోగివి కావాలి’ అని కృష్ణుడు ఉపదేశించాడు. కర్మ చేయగా సాధన వల్ల అది నిష్కామకర్మగా రూపాంతరం చెందుతుంది. అందుకే సామాన్యులకు కార్మిక శివరాత్రిని, భాగవతులకు ధ్యాన శివరాత్రిని, జిజ్ఞాసువులకు జ్ఞాన శివరాత్రిని ఆచరణలో పెడితే స్వభావానికి తగిన స్వధర్మమే అవుతుంది. సాధనే సాధ్యం అవుతుంది. శివ రాత్రి అంటే ఒకనాటి ముచ్చట కాదు. ఫలాపేక్ష• రహితంగా నియతకర్మ చేస్తూ కనీసం మాసానికి ఒకసారైనా శివుడి గురించి ధ్యానం చేయాలి. ఆ వెసులుబాటుకు నోచుకోని వారూ లేకపోలేదు. ఏడాదికి ఒకసారైనా అటువంటి వారు మహా శివరాత్రి నాడు ఉపవాస జాగరణలు చేయగలిగితే జన్మ ధన్యం అవు తుందంటారు. గుణనిధి వంటి పాపాత్ముడు ఆర్తితో ఉపవాసం, జాగరణ చేసి ప్రసాదం ఆరగించాడు. మరణించాక అతని కోసం శివభటులు వచ్చి కైలాసం తీసుకెళ్లారని చెబుతారు. అందుకే జన సామాన్యంలో ‘జన్మకో శివరాత్రి’ అనే నానుడి పాతుకుపోయింది.
ఉపవాసం.. ఆరోగ్యం

శివరాత్రి మన తెలుగింట ఒక గొప్ప మహా పర్వం. ఈనాడు ఇంటిల్లిపాదీ ఉపవాసం, జాగరణలు చేయడం ఆనవాయితీ. వివిధ రకాల వ్రతాలు కూడా ఈనాడు చాలామంది చేస్తుంటారు.
శివరాత్రి వ్రతం కాస్త కఠినమైనదనే చెప్పాలి. ఎందు కంటే పూర్తిగా ఇరవై నాలుగు గంటలు నిష్టగా ఘన పదార్థాలేవీ తీసుకోకుండా ఉండటమే కాకుండా, రాత్రి అంతా మేలుకొని ఉండాల్సి ఉంటుంది. అందుకనే ఇది కఠిన ఉపవాస దీక్షతో కూడిన పర్వం. అంత సమయం నిరాహారంగా ఉండటం ఒకవిధంగా ఇబ్బంది కలి గించేదే. ఈ ఇబ్బందిని అధిగమించడానికి కూడా కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అవేమిటో అవలోకించండి.
– శివరాత్రికి ముందు రోజు పుష్టిగా కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచడానికి దోహద పడుతుంది.
– శివరాత్రికి ముందు రోజు భోజనంలో మసాలాతో కూడిన ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. దీంతో మీరు ఉపవాసం చేసే రోజు అసిడిటీ, అల్సర్లు, మరియు అజీర్తి వంటి సమస్యలతో బాధపడే అవ కాశాలు తక్కువగా ఉంటాయి.
– ధారాళంగా నీటిని తాగాలి. ఇది మిమ్మల్ని హైడ్రేట్‍గా ఉంచటమే కాకుండా పూర్తిగా కూల్‍గా ఉంచుతుంది. అలాగే ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఉపకరిస్తుంది. తద్వారా మీరు మీ ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా ఉపవాస దీక్షను కొనసాగించడం వీలవుతుంది.
– వీలైనన్ని సార్లు తాజా పండ్లను తీసుకోవాలి. ఈ పండ్లు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లను అందిస్తూ మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచడంలో దోహదపడతాయి. అరటిపండ్లు వంటివి పాలతో కలిపి తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది మర్నాడు శివరాత్రి దీక్షకు ఉపవాసం ఉండటానికి ఉపకరిస్తుంది.
– ఎక్కువ క్యాలరీస్‍ ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రైడ్‍ ఫుడ్స్ అసలు ముట్టుకోకూడదు. దీనివల్ల శరీరంలో చక్కెర నిల్వలు సమతుల్యంగా ఉంటాయి.
– తాజా పండ్ల రసాలు, షేక్స్ విరివిగా తాగాలి. ఇవి రోజుకు సరిపడా శక్తిని ఇస్తాయి. కాబట్టి మర్నాడు ఉపవాసం ఉన్నా కూడా ఈ రసాలు మీ శరీరానికి శక్తిని సమకూర్చి పెడతాయి.

లింగపూజకు ఆద్యమిదీ.

శివుడు లింగాకారుడు ఎలా అయ్యాడు? ఆయన లింగాన్ని ధరించి తన పరమేశ్వర తత్త్వాన్ని నిరూపించుకున్నది దారుకా వనంలో. దక్ష యజ్ఞం ధ్వంసానంతరం శివుడు అత్తవారింట మనుగుడుపులున్నాడు. ఆ సమయంలో ఆయన గణాలు మునుల ఆశ్రమాలలో అత్యాచారాలకు పాల్పడ్డారు. వారిని నివారించాలని పార్వతి శివుని కోరింది. శివుడు అది వినక తాను కూడా దిగంబరుడై మునిపత్నుల వెంటబడి వారికి ప్రాతివత్యం భంగం కలి గించాడు. దాంతో మునులు కోపించి అతని లింగం తెగిపడిపోవాలని శపించారు. శివుడు తన లింగాన్ని భూమ్యాకాశాల వరకు పెంచి తన ఈశ్వరతత్త్వాన్ని దార్శనం చేశాడు. ఈ కథ శ్రీనాథుని ‘హరి విలాసం’లో ఉంది. ఇలా లింగపూజకు నాంది పడిందని అంటారు. ఇంకా శివరాత్రికి సంబంధించి అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి.

శివతత్త్వం.. మహోన్నత తత్వం

మనలో, మన చుట్టూ శివాన్ని దర్శించడం, శివాన్నే ఆరాధించడం- అదే శివారాధన. ‘శివ’మంటే మంగళం, క్షేమం, శుభం, శుద్ధం, శాంతం… ఇన్ని అర్ధాలున్నాయి. వీటిని మనలో, ప్రపంచంలో దర్శించి, ఆవిష్కరించే సాధనను సనాతన ధర్మం ‘శివయోగం’గా చెబుతోంది.
శుభానికి సాకారమైన శివుడు తన శుభ శుద్ధతత్త్వాన్ని అనుగ్రహిస్తాడు కనుక ‘శంకరు’డయ్యాడు. మంగళాలకు మూలం కనుక ‘శంభు’ అన్నారు.
కాలబద్ధులైన జీవులూ, పశువులనీ, కాలాన్నీ, జీవుల్నీ శాసించే పరమేశ్వరుడు ‘పశుపతి’ అని వేద వాజ్మయం కీర్తించింది.
దు:ఖ నాశకుడు కనుక రుద్రుడయ్యాడు. రుద్ర నామానికి – దు:ఖ (రుత్‍) నాశకుడనే భావాన్ని శివపురాణం వ్యాఖ్యా నించింది.
శాశ్వతమైన శివతత్త్వమే ‘

సర్వోతృష్టమైన పర్వదినం

శైవ మతంలో అతి విశేషమైన, సర్వోత్క•ష్టమైన పండుగ శివరాత్రి. ఈనాడు భక్తులు తెల్లవారుజామునే లేచి, స్నానాదులు చేసి, శివపూజ చేసి, ఉపవసించి, రాత్రంతా మేల్కొని ఉండి మర్నాటి ఉదయం పారాయణ చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథన పఠనాలతో గడుపుతారు. శైవ క్షేత్రాలలో ఈ ఉత్సవం మహా వైభవంగా జరుగుతుంది. పూర్వం శ్రీశైల క్షేత్రంలో ఈ ఉత్సవం ఎంత వైభవంగా జరిగేదో పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో గ్రంథస్తం చేశారు. శివరాత్రి నాడు పూజలు, జాగరణాదులు చేసే వారు సర్వపాప విముక్తులై అంతమున శివ సాయుజ్యాన్ని పొందుతారని, శివరాత్రి వ్రతాన్ని ఆచరించని వారు జన్మ సహస్రములలో కొట్టుమిట్టాడుతారని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి.

Review ।। రుద్ర నామం భజే ।।.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top