అంజన్న పూజ తరువాతే వెంకన్నకు

తిరుమల తిరుపతి వేంకటేశ్వరాలయానికి చుట్టూ ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలు ఉన్నాయి. నిజానికి తిరుమల తిరుపతి దేవునితో సమానంగా ఇవీ ప్రసిద్ధమైనవి. అయితే చాలామంది వీటిని దర్శించుకోరు. ఎందుకంటే వీటి గురించి అంతగా ప్రాచుర్యం లేకపోవడమే కారణం. అటువంటి ఏడు వేంకటేశ్వరాలయాల్లో ప్రసిద్ధమైనది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే..

ఆంధప్రదేశ్‍ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలలో అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి.

తిరుమలకు వెళ్తూ కొలువుదీరిన స్వామి

శ్రీ వేంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడని ప్రతీతి. తరు వాత ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తరువాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు ఉండి అక్కడి నుంచి శ్రీశారు మెట్టు ద్వారా (వంద మెట్ల దారి) తిరు మల చేరాడని స్థల పురాణం ఆధారంగా తెలుస్తోంది. అప్పలయ్య

కుంట తవ్విం చిన కారణంగా..
ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక కుంట తవ్వించాడట. అప్పటి నుంచి ఈ ప్రాంతం అప్పలయ్య కుంటగా వ్యావహారికంలోకి వచ్చిందని, కాల క్రమంలో అది అప్పలగుంటగా మారిందని అంటారు. అప్పలయ్య ఈ కుంట తవ్వే సమయంలో పని చేసే వారికి కూలి డబ్బులు బకాయి (అప్పు) పడకుండా ఏ రోజుకు ఆ రోజు చెల్లించే వాడట. అందువలన కూడా ఈ ప్రదే శానికి అప్పలాయకుంట అనే పేరు వచ్చిందనే ప్రచారం కూడా స్థానికంగా ఉంది.

ఆకుపచ్చని వాతావరణం మధ్యలో..

అప్పలాయగుంటలో గల ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తయిన కొండ, చుట్టూ పచ్చని పంట పొలాలు ఉండటంతో అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ రూపం కనులవిందు చేస్తుంది. శ్రీవారి ఆలయం ముందు ఉన్న చిన్న కోనేరు, దానికి ముందు, అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది.

మొదట ఆంజనేయునికే పూజ

రోజూ ప్రసన్న వేంకటేశ్వర ఆల యానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించిన తరువాతే శ్రీవారికి అభిషేకాలు, ఇతర పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగచేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువ. కాకపోతే, ఈ దేవాలయానికి వెళ్లే నిజమైన ప్రశాంతత లభిస్తుందనే నానుడి ఈ దేవా లయం విషయంలో నూటికి నూరుపాళ్లు వాస్తవం. ఎందుకంటే, భక్తులు ఇక్కడకు స్వామి దర్శనార్థం తక్కువ మంది వస్తుండటం వల్ల ఆలయంలో, చుట్టుపక్కల వాతావరణమంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. కాబట్టి భక్తులు సావ ధానంగా చిత్తశుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు. అంతగా ఇక్కడి పచ్చని వాతావరణం కళ్లను కట్టి పడేస్తుంది.

క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే..

అప్పలాయగుంట చిత్తూరు జిల్లాలో ఉంది. తిరుపతికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. తిరుపతి నుంచి దాదాపు ప్రతి గంటకు బస్సులు ఈ ప్రాంతానికి ఉంటాయి. తిరుపతి నుంచి పరిసర ప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడా ఇక్కడికి వస్తుం టాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవల సిన, దర్శించుకోవాల్సిన పుణ్య క్షేత్రమిది.

Review అంజన్న పూజ తరువాతే వెంకన్నకు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top