జీవితమంటే..

జీవితం అంటే వీధి పోరాటం కాదు. దానిని చిల్లరగా తీసుకుని కల్లోల పరచుకోకూడదు. జీవితం అంటే ఒక ఆట. దానిని స్ఫూర్తిగా తీసుకుని జీవించాలి. ఎదురుదెబ్బలు, ఓటమి లేని జీవితం అంటూ ఉండదు. అంతమాత్రాన అల్లాడి పోకూడదు. జీవితం అక్కడితో ముగిసిపోయిందని బెంబేలెత్తి పోకూడదు.

రావణుడు సీతాదేవిని అపహరించుకు పోతున్నాడు. ఈ దృశ్యం జటాయువు కంట బడింది. అపరలక్ష్మీదేవి వంటి సీతమ్మ అపహర ణకు గురవుతోందని జటాయువు (పక్షి) గ్రహిం చాడు. రావణుని చర్య లోకకంటకమైనదని భావిం చాడు. వెంటనే ఆ పక్షిరాజు రెక్కలు విప్పుకుని రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు. రావణుడితో తన బలం ఏమాత్రం సరితూగదని తెలిసినా.. అతనిని అడ్డుకుని సీతాదేవికి చెర నుంచి విముక్తి కల్పించేందుకు శక్తివంచన లేకుండా తలపడ్డాడు. లంకేశ్వరుడు తన రెక్కల్ని తెగనరుకుతున్నా, రక్తం కారేలా వస్తున్న తీవ్రంగా హింసిస్తున్నా జటాయువు వెనక్కి తగ్గలేదు. చివరి వరకు సీతాదేవిని కాపాడేందుకు విఫలయత్నం చేశాడు. చివరకు రెక్కలు తెగి.. కొన ఊపిరితో నేలకూలాడు. అప్పటికీ అతనిలోని సంకల్పం చెక్కుచెదరలేదు. సీతను వెతుక్కుంటూ అటుగా వచ్చిన రాముడిని చూడగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. రావణుడి ఘాతుకం గురించి రాముడికి చెప్పి.. సీతను కాపాడుకోవాలని సూచించి, రాముడి ఒడిలో ప్రాణాలు విడిచాడు. ఈ మొత్తం సంఘటనలో ఒక విధంగా చూస్తే జటాయువు రావణుడి చేతిలో ఓడిపోయాడు. కానీ, లోకం ఈనాటికీ దానిని ఓటమిగా, పరాజయంగా చూడదు. పైగా జటాయువు ప్రయత్న బలాన్ని, పట్టుదలను, రావణాసురుడి ప్రతాపం కన్నా ఎక్కువగా ఈ లోకం కొనియాడు తుంది. అలాగే ఒక్కోసారి మన ప్రయ త్నాల్లో మనం విఫలమైనా దానిని ఓటమిగా భావించకూడదు. జీవితంలో గెలుపోటములు ప్రధానం కాదు. వాటిని ఎలా తీసు కుంటున్నాం? మనం ఎంత చిత్తశుద్ధితో ఆయా ప్రయత్నాలు చేస్తున్నా మన్నదే ముఖ్యం.

ఆదర్శ జీవన విధానాల సమా హారమే ఆధ్యాత్మిక విద్య

నైతిక పరివర్తనతో కూడిన జీవ నానికి, అర్థవంతమైన జీవితానికి ఆధ్యా త్మిక పురోగమనమే మార్గదర్శిగా ఉంటుంది. ఏదో ఒక రకంగా బతి కేయడమే జీవితం కాదు. బతుకును ఎలా పండించుకోవాలో తెలియచెబుతుంది ఆధ్యా త్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే వైరాగ్య చింతనతో కూడిన విధానం కాదు. ఆదర్శ వంత మైన విధివిధానాల సమాహారమేనని గుర్తించాలి. కృష్ణాతీరంలో ఓ ఆయుర్వేద వైద్యుడు వ్యాధిగ్రస్తు లకు ఉచిత సేవలందిస్తూ – సత్సంగ కార్యకలా పాలు, పురాణేతిహాసాల పఠనంలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆయనను ఏదో వెలితి పీడించేది. ఇంకా ఆధ్యాత్మిక జగత్తులో ఏదో సాధించాల్సింది ఉందనుకుంటూ మద•నపడేవాడు.
ఒకసారి ఆ ప్రాంతానికి విచ్చేసిన సాధువుతో స్వామీ! నాకు ఆధ్యాత్మిక సాగరంలో బతుకు పండించుకోవాలని తపనగా ఉంది. దానికి సరైన మార్గం ధ్యానమా, నిరంతర పూజా విధానాలా, గురువుల ద్వారా ఉపదేశాలు పొందడమా? నాకెటూ పాలు పోకుండా ఉంది. మార్గోపదేశం చేయండి స్వామీ! అని వేడు కున్నాడు.
సాధువు నవ్వి ‘నువ్విపుడు ఆధ్యాత్మిక జగత్తు లోనే కదా ఉన్నావు. మంచి పనులపట్ల అనురక్తి ఉంది. సదాచారాలలో ఉన్నావు. వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నావు. వృథాగా కాలం వెళ్లబుచ్చక సత్సంగాలతో బుద్ధిని వికసింపజేసుకుంటున్నావు. ఇవేగా ఆధ్యాత్మిక జగత్తులోని మూలాలు. సూక్ష్మం గ్రహించు’ అంటూ జ్ఞానబోధ చేసి వెళ్లిపోయాడు సాధువు. స్పందన, బుద్ధి వికాసము, దయార్ధ్ర హృదయం – ఈ మూడింటి సమాగమనమే ఆధ్యా త్మిక ప్రపంచం.
ఇది నిత్య జీవితంలో తోడు నీడగా ఉండే అంతఃశక్తి, యుక్తా యుక్త, విచక్షణతో ముందడుగు వేయించే శుద్ధతత్వం.

స్పందనను బట్టే బుద్ధి వికాసం..

బుద్ధుడిని వృద్ధాప్యం, వ్యాధులు, దుఃఖాలు, జనన, మరణాలు కలిచి వేశాయి. హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. వీటికి మూలం శోధిం చాలన్న జిజ్ఞాస మొదలైంది. అంతఃపుర సౌఖ్యాలు తృణ ప్రాయంగా వదిలిపెట్టాడు. గయలోని బోధి వృక్షమే జ్ఞాన పీఠమైంది. జ్ఞాన సాగరాన్ని మదించి బుద్ధునిగా, మహా జ్ఞానిగా భాసిల్లాడు. లోక జనులకు పథనిర్దేశం గావించాడు గౌతముడు.

స్పందన, బుద్ధివికాసం, దారిద్య్ర హృదయం- బౌద్ధానికి ఈ మూడే ప్రధాన భూమికలయ్యాయి. మానవుడు పరిపూర్ణుడయ్యేందుకు, ఈ సులక్షణాల మేలు కలయికే మార్గం. అభ్యాసం ద్వారా వీటిని సమన్వయపరచుకోవాలి.
స్పందన మానవీయ ఆర్తిని రూపుమాపేదిగా, ఆపదల నుంచి రక్షించే ఆపన్న హస్తంగా భాసిల్లాలి. ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అన్న చందంగా కాక – సహజీవనంలోని మాధుర్యాన్ని, మానవ బంధాల మధురిమను పెంచేదిగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం ఆరోగ్యంగా ఉంటే మనమూ ఆరోగ్యంగా ఉండగలం. స్పందన సద్భావనామిళితంగా ఉంటేనే బుద్ధి వికసిస్తుంది. భగవత్‍ తత్వాన్ని తెలుసుకోవాలన్న స్పందన – భక్తుడికి, భగవానుడికి మధ్య వారధిలా పని చేస్తుంది. ఈ బంధం దృఢమయ్యే కొద్దీ చిత్తాన్ని, అహంకారాన్ని బుద్ధి అదుపు చేస్తుంది.

మానవుడు మహానుభావుడు కావాలంటే..

భాగవతంలోని రంతిదేవుడి చరిత్ర ఇందుకు నిదర్శనం. ఆకలిదప్పులతో తాను, భార్యబిడ్డలు అలమటిస్తున్నా-దొరికిన కొద్దిపాటి ఆహారం, నీరు-అడిగిన వారి దుస్థితి చూసి దానం చేశాడు. రాజధర్మాన్ని త్రికరణశుద్ధిగా పాటించాడు.
జంట పక్షుల్లో ఒకటి నేలకూలడం చూశాడు మహర్షి. ఓ విషాద స్పందన జనించింది. శ్రీమద్రా మాయణ మహాకావ్యానికి దారితీసింది. ప్రపం చానికి ఆదర్శవంతమైన జీవితాన్ని గురించి తెలియచెప్పింది.
నైతికవర్తన దారితప్పిన మనిషి మృగప్రాయు డవుతాడు. ఈ మూడు సులక్షణాలు శోభిల్లే ఆధ్యా త్మిక విద్యను అభ్యసిస్తే మానవుడు మహానుభావు డవుతాడు. మానవ కుటుంబం శాంతి సౌఖ్యాలతో వర్థిల్లుతుంది.

ఆదమరుపు కూడదు..

మంచి పనులు చేసి సంపాదించుకున్న పుణ్య ఫలం ఒక్కోసారి మనం చేసే చెడు పనుల (దుష్క ర్మ)ల వల్ల శక్తినంతా కోల్పోయి నిర్వీర్యమై మని షిని కష్టాలపాల్జేస్తుంది. మనిషి స్వర్గ సుఖాలను, సిరి సంపదలను, భోగభాగ్యాలను అనుభవిస్తూ ఆదమరిచి పుణ్యకార్యాలను చేయడం మాను కొంటే, తాను నిలువు ఉంచుకున్న ఫుణ్య ఫలం కాస్తా హరించుకునిపోయి తిరిగి మనిషి కష్టాల పాలవుతాడు. కనుక మనిషి పాపపు పనులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించి, ఈ పని ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉంటుంది? అది మనల్ని ఎలా వెంబడిస్తుంది? అనే విజ్ఞతను ప్రదర్శిస్తే మనిషిగా సచ్ఛీలుడై వెలుగొందుతాడని మన పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

మన శక్తి మనకు తెలియనంత వరకు మనం చేతగానివాళ్ళుగా మిగిలిపోతాం. మనలో చాలా వరకు శక్తి సామర్థ్యాలు నిద్రాణంగానే ఉండి పోతాయి. సద్గురువులు, యోగులు, మహ నీయులు అవతరించేది ఈ శక్తుల్ని మనలో మేల్కొల్పడానికే. అందుకే సద్గురువు బోధనల్ని వినాలి. వాటిని చదవాలి. చదివిన వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. సద్గ్రంథ పఠనం వల్ల మంచిచెడుల పట్ల విచక్షణ కలగడంతో పాటు, ద్వందాతీతంగా ఉండగలుగుతాం.

ఏదీ తనకు తానుగా మన వద్దకు రాదు. మనం కనీసం ప్రయత్నం చేయకుండా గడ్డిపోచ కూడా మన వద్దకు ఎగురుకుంటూ రాదు. ఏదైనా శ్రమిస్తేనే లభిస్తుంది. నిజానికి గడ్డిపోచ ఎంతో అల్పమైనది. కానీ అది భూమిని చీల్చుకుని పుడుతుంది. ఆ సమయంలో అదెంత ఘర్షణ పడుతుందో ఆలోచించండి. దానితో పోలిస్తే మనమెంతో శక్తివంతులం. కాబట్టి పని చేయ డానికి ఉద్యుక్తులవుదాం.వాక్‍ శుద్ధి: వేల కోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించరాదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగ ళాలు (చెడు మాటలు) మాట్లాడే వారు తారసపడితే ఒక నమస్కారం పెట్టి పక్కకు తప్పుకోవాలి. చెడు మాటలు మాట్లాడే వారితో మాటలు కలపడం వల్ల వాళ్ల పాపం మనకూ అంటుకుంటుంది. అలాగే మన మాటల ద్వారా ఎవరికీ హాని కలిగించకూడదు. మాటలు తూటాల్లాంటివి. ఒక్కసారి నోరు జారితే మళ్లీ వెనక్కి తీసుకోలేం. మాటల ద్వారా చేసిన గాయాలు మనిషి మరణించే వరకూ కూడా వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో మన గుణం, ప్రవర్తన అన్నీ సమపాళ్లలో సమకూరితేనే ఆ జీవితం ఫలవంతమవుతుంది. లేదంటే సమతుల్యం లోపించి అభాసుపాలవుతుంది. అలా కాకూడ దంటే స్థితప్రజ్ఞతతో వ్యవహరించగలగాలి.

Review జీవితమంటే...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top