మంగళగౌరీ వ్రత నియమాలు

ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి- ‘అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు’ అని అడిగిందట.
అందుకు కృష్ణుడు- ‘మంగళగౌరీ మహా దేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధి చెంది. త్రిపురా సుర సంహారం సమయంలో పరమ శివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీని పూజించే గ్రహరాజై, మంగళవారానికి అధి పతిగా వెలు గొందుతున్నాడు. మంగళ గె•రీ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో ఆచరించి, పూజిస్తే మహిళలకు వైధవ్యం కలగదు. సకల సౌభాగ్యాలు కలుగుతాయి’ అని బదులిచ్చాడట.
పురాణ కాలం నుంచీ ఈ వ్రతాచరణ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్రతం గురించి ఒకసారి నారదుడు సావిత్రికి కూడా చెప్పాడని అంటారు. ఈ వ్రత నియమాలు ఇవీ..
వివాహమైన తొలి ఏడాది పుట్టింట్లోనూ, ఆ తరువాత నాలుగేళ్లు మెట్టినింట ఈ వ్రతాన్ని ఆచరించాలి (మొత్తంగా ఐదు సంవత్సరాలు ఈ నోము నోచాలి).
తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్ఠం. తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వాలి.
వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి.
వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, వారికి వాయనాలివ్వాలి.
ఒకే మంగళగౌరీ విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉప యోగించాలి. వారానికి ఒకటి ఉపయోగించకూడదు.
ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన పిమ్మట వినాయక చవిత పండుగ మర్నాడు వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పక వాడాలి.
పూజకు కావాల్సిన వస్తువులు:
పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె గుడ్డ, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరాలకు దారం, టెంకాయ, పసుపుతాడు, దీపపు సెమ్మెలు- 2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్లెం, గోధుమపిండితో కానీ, పూర్ణంతో కానీ చేసిన ఐదు ప్రమిదెలు, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, కొబ్బరిచిప్ప, శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

Review మంగళగౌరీ వ్రత నియమాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top