శివమే సత్యం…నిత్యం

అణువు నుంచి బ్రహ్మాండం వరకూ, సకల చరాచరులూ ముల్లోకాలూ అన్నీ పరమేశ్వర రూపమైన ఆ మహాలింగ గర్భంలోనే ఇమిడి ఉన్నాయి. అందులో లేకుండా బాహ్యంగా మరేమీ లేదు. అటువంటి సకల బ్రహ్మాండ రూపమైన ‘శివలింగ’ పూజ మహోత్క•ష్టమైనది.
‘శివ’ నామం మహిమాన్వితమైనట్టిది. ‘శి’ అక్షరం పాపాలను పోగొట్టేది.
‘వ’ అక్షరం మోక్షాన్ని ప్రసాదించేది. సకల పాపహరుడు, మోక్షదదాయకుడూ అయిన సకల ‘శివ’ శంకరుడు అయిన పరమేశ్వరుడు పరబ్రహ్మగా మహాలింగ జ్వాలారూపుడై ఈ సృష్టిని ఆవరించాడు.

ఈ ఆదిదేవుడు ఎవరు? అద్వితీయము, నిత్యము, అనంతము, పూర్ణము, అసంగము అయిన ప్రకృతి పురుషాతీతమైన పరబ్రహ్మయే శివుడని తెలిపింది శివ పురాణం. మాఘ కృష్ణ చతుర్దశి నాటి శివపూజ మొదలైన లింగోద్భవ కాల సమయాన ఆ స్వామికి అర్ధనారీశ్వర సహితంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం మొదలైన వ్రతాదులు ఆచరిస్తారు.

శివుడు సత్యజ్ఞానానంత స్వరూపమైన పరబ్రహ్మ సనాతనుడు. ఒకే ఆత్మశక్తికి బ్రహ్మ అని, పరబ్రహ్మ స్వరూపమని, బ్రహ్మ పదార్థమని విడివిడి పేర్లు పెట్టారు. అదే ఈ జగత్తును సృష్టించేది. ఆ పనులు చేసే వారికి త్రిమూర్తులని పేరు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సృష్టి, పుష్టి, నష్టి కార్యక్రమాలు చేయించేది వారే. నిరాకారమైన పరమాత్మతత్వం ఒక్కటే. లయానికి సంకేతం పరమశివుడే.

నామ, రూప, క్రియాత్మకంగా భాసించే చరాచర పదార్థాలన్నీ లయమవుతాయి. అవ్వాలి కూడా.
‘మిగిలేదేమిటి?’ అని ప్రశ్న వేసుకుంటే,’జ్ఞానం’. దీనికే ‘చిత్‍’ అని పేరు. అది ఉంటేనే దేనినైనా గమనించగలుగుతాం. ఆ ఉండటం ‘సత్‍’. పరిపూర్ణమైన సత్‍, చిత్‍ల సమాహారమే శివ స్వరూప మని మనం గ్రహించగలగాలి.

నామ రూపాలన్నింటినీ లయం చేసుకుని నిరాకారంగానే శేషించిన భావాలు కనుక అది లింగరూపం. అది రూపం కాని రూపం.
‘లీనం గమయతీతి లింగం’- పరమేశ్వరునిలో లీమమగు దానిని తెలియ పరిచేది ‘లింగ’మవుతుంది. లింగం అంటే మొదలు, చివర అంటే ఆద్యంతాలు లేనిది. అజ్ఞాననమనే అంధకారాన్ని తొలగించి, జ్ఞాన వెలుగులను వెదజల్లే అద్భుత చిహ్నమే లింగం. అది పరమ పూజనీయం.
బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు కనుక శమించి, శాంతించి ఉండేవాడు ‘శివుడు’.

‘శామ్యతీత శివ:’ అన్నారు.

‘శమయతీతి శివ:’

అంటే- అందరినీ బ్రహ్మానందంలో శమింప చేసేవాడు శివుడు.
మానవ శరీరంలో ఉండే అవయవాలు వాటి పని అవి చేస్తాయి. దేని లక్షణం దానిదే.
కళ్లు చూస్తాయి. చెవులు వింటాయి. కానీ స్వతంత్రంగా అవి తమ పని చేయలేవు. ఈ దేహంలో ఉన్నంత కాలం వరకే అవి వాటి పనులు అవి చేస్తాయి. మన భౌతిక రూపం కూడా అంతే. అది వివిధ అంగముల కల యికతో ఏర్పడుతుంది. మరణానంతరం నశించిపోతుంది. అప్పుడది కనిపించదు. దీనినే ‘రూపం’ అన్నారు.
‘స్వ’ అనగా.. ‘తన’. అంటే రూపమునకు ‘స్వ’ ముందు చేరిస్తే ‘స్వరూపము’ అయ్యింది. అంటే, తన నిజ స్వరూపం అనగా, తన అసలు రూపము. గమనించవలసిన విషయం ఏమిటంటే.. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టు మనకు ఏదైతే కనిపిస్తుందో అది స్వతంత్రమైనది కాదు. దానికి ఆ శక్తిని అందిస్తున్నది మరొకటి ఏదో ఉన్నది. ఆ మరొకటి ఏదో అనేది దేహము. నిజరూపం. పరబ్రహ్మ స్వరూపం. అదే-పరమ శివ స్వరూపం. ఇదే శివలీలా వైభవం.

ప్రకృతి కూడా శివమే. లింగం అనేది అమూర్తమైనది కాదు. అయిదు పంచభూత ములు అనగా, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశంతో పాటు సూర్యచంద్రులు, జీవుడు- మొత్తం ఎనిమిది ప్రకృతులు సప్తస్వరములై జీవతత్త్వము, అనాహతశుద్ధ నాదాత్మకం. కనుక, పరమ శివుడు సప్త ప్రకృతి శరీరుడై, నాద తనువుగా భాసిల్లుతాడని వివరించబడింది. పరమశివుని సద్యోజాత, ఈశాన, అఘోర, వామదేవ, తత్పురుష అనే పంచ వక్త్రమలు అనగా, ముఖముల నుంచి సరిగమాది సప్త స్వరములు ఆవిర్భవించాయి. అంతశ్శరీర చిదాకాశమందు ప్రాణాయామ సంయోగంతో నాదంఏర్పడుతుంది. అది అకారాది స్వరూపంగా రూపొందింది. అది సర్వ దేవతా మంత్రచ్ఛందో మూలమైన ప్రణవ నాదంగా ఉద్భవించింది. ప్రణవ నాదమే వేద పురాణాది శాస్త్రాదులకు ఆధారం. సరిగమాది సప్త స్వరములు ప్రణవ నాదము నుంచి ఏర్పడ్డాయి. నాదం అమృతమయం. నాద స్వరూపుడు పరమశివుడు.

‘యోవేదాదౌ స్వర: ప్రోక్తో వేదంతేషు ప్రతిష్టిత।’

అంటే- ఓంకారం కాల స్వరూపం. కాల స్వరూపుడు పరమశివుడు.

‘నాద తను మనిశం శంకరం నమామిదే, మనసా శిరసా..’ అన్న రూపక తాళ, జగన్మోహిని రాగకీర్తనలోనూ, శివతత్వాన్ని, శివలీలా వైభవాన్ని అత్యంత గంభీరంగా, కూలంకషంగా అందించాడు- బ్రహ్మ విద్యా సార్వభౌముడు, నాదయోగి- శ్రీ త్యాగరాజస్వామి వారు. ఈ రెండు కీర్తనలను మననం చేసుకుంటే చాలు శివతత్త్వ ఫలం మనకు సిద్ధిస్తుంది.

నమామీశమీశాన
నిర్వాణ రూపం
విభుం వ్యాపకం
బ్రహ్మ వేదస్వరూపమ్‍ ।
అజం నిర్గుణం
నిర్వికల్పం నిరీహం
చిదాకారమాకాశవాసం భజేహమ్‍ ।।
సర్వ ప్రపంచాన్నీ శాసించే ఆనంద స్వరూ పుడైన ఈశ్వరుడిని, అధీశ్వరుడూ వ్యాపించే పరబ్రహ్మ స్వరూపుడిని, వేద స్వరేపుడిని, సత్యమై, నిర్గుణమై, నిర్వికల్పమై, నిరీహమై, చిదాకాశతత్త్వమై, ఆకాశవాసమై ఉన్న మహేశ్వరుడిని ఆశ్రయిస్తున్నాను
(శ్రీ తులసీదాస విరచితమ్‍)

శివుడు భస్మానులేపనం పృథ్వికి, గంగా జటాజూటం జలానికి, ఫాలనేత్రం అగ్నికి, నాగభూషణత వాయువుకు, దిగంబరత్వం మనసుకు, వృషభ వాహనం బుద్ధికి, గజ చర్మధారణం అహంకారానికి చిహ్నములు. సత్వ, రజో, తమో గుణములు త్రిగుణములు. అవి తనకు అధీనమై ఉన్నాయని, తాను త్రిగుణాతీతుడనని చెబుతుంది ఆయన చేతిలోని త్రిశూలం. జగన్మాత శివుడి శరీరాన్ని పంచుకుని ఉంటుంది. చిద్రూపం శివతత్త్వం. సద్రూపం శక్తి తత్త్త్వం. దీనికి జ్యోతికంగా శివాలయంలో పానపట్టం మీద శివలింగం కనిపిస్తుంది. మన దేహమనే దేవాలయంలో ప్రాణంపై ఆధారపడే మనసు ఉందని లింగం సంకేతంగా చెబుతుంది. మహాబుద్ధితో, యోగాద్వైతస్థితిలో దర్శిస్తే రెండూ ఒకటిగా దర్శనమిస్తాయి. అదే అర్థ నారీశ్వర తత్త్వం. శివశక్త్యైక్య రూపం. ఈ రూపాన్ని దర్శించడానికి ముందు నందీశ్వరుడిని అర్థించాలి. నందీశ్వరుడంటే ధర్మానికి సంకేతం. జీవుడు ధర్మాన్ని ఆశ్రయిస్తే దైవతత్త్వం అంకురిస్తుంది. జీవన బ్రహ్మైక్యం జరుగుతుంది. ఆ స్థితిలో జీవుడు, నందీశ్వరుడు, శివుడు- ఈ ముగ్గురూ ఒక్కటే. ఇదే భిన్నత్వంలో

Review శివమే సత్యం…నిత్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top