శ్రీకృష్ణ జన్మ తత్వం

కృష్ణాష్టమి అంటే- కృష్ణ, అష్టమి. ఇది కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన అష్టమి. శ్రావణ కృష్ణ పక్ష అష్టమి నాటి రాత్రికి శాక్తేయ సిద్ధాంతంలో ‘మోహ రాత్రి’ అని పేరు. కృష్ణ జన్మకు పూర్వమే ఈ రాత్రి ఉపాసకులకు ప్రధానమైనది. ప్రత్యేక మహిమ కలిగిన రాత్రి ఇది. కృష్ణుడు పుట్టిన సమయానికే నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహా శక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే.

దైవీగుణ సంపద గలవారి మోహాది మాయాజాలాన్ని నశింప చేసే మోక్ష కార కుడు, జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. ఆ అవ తారం అగాధమైనది. అనంతమైనది. పర మాత్మ తత్వాన్ని, ఉపనిషత్‍ రహస్యాలను •న లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు ఆయన. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, హాస్య, శాంతాధి భావాలను ప్రకటించిన గోవిందుడి గాథ- వివిధ కోణాల్లో దివ్యత్వాన్ని ఆవిష్క రించింది. ఆయన జన్మ రహస్యం, తత్వ విశేషాలు..
బాల్యంలోనే దావాగ్నిని మింగి గోకు లాన్ని కాపాడిన స్వామి ఆయన. బ్రహ్మదేవుడి అహాన్ని అణచివేస్తూ, ఏకకాలంలో అనేక కూపాలనుండి గోప బాలుర రూపాలను ధరించి అబ్బుర పరిచాడు.

తనను మట్టుబెట్టడానికి మాయా రూపా లతో వచ్చిన రాక్షసుల్ని చడీచప్పుడు లేకుండా రూపుమాపిన బాల వీరమూర్తి కృష్ణుడు.
శుద్ధ జలాలను విషమయం చేసిన కాళీయ సర్పాన్ని నియంత్రించి.. ప్రకృతిని కలుష రహితంగా ఉంచాలని సకల మానవాళికీ బోధించాడు కృష్ణుడు.
బహు జన్మల యోగ సాధనతో పరబ్రహ్మ ప్రాప్తి కోసం గోపికా రూపాలు ధరించిన శుద్ధ జీవులకు ఆయన బ్రహ్మానంద రసానుభవాన్ని ప్రసాదించాడు.
కృష్ణుడు రాజనీతి చతురుడు. వంచనతో ద్రౌపదిని నిండుసభలో పరాభవించిన కౌరవుల్ని హెచ్చరించాడు. అనివార్యమైన సంగ్రామంలో వారికి తగిన పాఠం చెప్పిన ధర్మ రక్షకుడు కృష్ణుడు.

కృష్ణుడు ఆర్తితో తనను శరణువేడిన పాంచా లిని ఆదుకున్నాడు. ధర్మానికి కట్టుబడి తనను ఆశ్రయించిన పాండవుల్ని దరి చేర్చుకున్నాడు.
నరకాసురుడి బారిన పడిన పదహారు వేల మంది రాచ కన్యలకు, వారి కోరిక మేరకు భద్రత
చేకూర్చిన క్షేమంకరుడాయన.

తన వైపు గల సైన్యం కంటే తానే చాలని ఎంచుకున్న అర్జునుడి రథా నికి సారథిగా విజయాన్ని ప్రసా దించాడు.
కృష్ణుడు విశ్వజనీన తత్వ శాస్త్ర మైన గీతామృతాన్ని వర్షించిన జ్ఞానా నందమూర్తి. తన, పర అనే భేదం లేకుండా, వారి వారి కర్మలకు అను గుణంగా ఫలాల్ని ప్రసాదించాడు. చెక్కు చెదరని చిరునవ్వుతో నిలిచిన ఆయన యోగీశ్వరేశ్వరుడు.

వేదాల నుంచి విస్తరించిన కర్మ, యోగ, ఉపాసన, తత్వ మార్గాల్ని కృష్ణుడు చక్కగా సమన్వయించాడు. సర్వ శాస్త్రసారంగా అర్జునుడికి గీతా శాస్త్రాన్ని బోధించడమే కాక, తన అవతార పరిసమాప్తి వేళ ఉద్ధవుడికి తత్వబోధ చేసిన జగద్గురువు ఆయన.
అవతార కాలంలోనే కాక, ఆ తరువాత కూడా తనను స్మరించి, ఆరాధించిన, కీర్తించిన యోగుల్ని తరింప చేసిన భగవానుడు కృష్ణుడు. శుక యోగి, ఆదిశంకరులు, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, జయదేవుడు, పోతన, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, మధుసూదన సరస్వతి, మీరాబాయి, తుకారాం, సక్కుబాయి, సూరదాసు.. ఇలా ఎందరెందరో కృష్ణ యోగులున్నారు. వారందరూ సాత్విక, మధుర, దివ్య భక్తి మార్గంలో జ్యోతి స్వరూపులై లోకాన వెలుగులు నింపారు.
(ఆగస్టు 23/24: శ్రావణ బహుళ సప్తమి/అష్టమి: శ్రీకృష్ణ జన్మాష్టమి)

Review శ్రీకృష్ణ జన్మ తత్వం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top