అక్కడ మట్టి కూడా మహిమ చూపుతుంది.

మంత్రాలయం.. అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్రస్వామి ప్రత్యక్షంగా అవతరించి, వేంచేసిన దివ్య స్థలం మంత్రాలయం. ఈ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీ తీరాన ఉంది. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి, ప్రతీతి. అవేమిటంటే..

పాదోదకం.. పావనం
రోజూ రాఘవేంద్ర స్వామి మూల బృందావ నానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు. బృందావనాన్ని హరి మందిరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ ఏడు వందల సాల గ్రామాలను ప్రతిష్ఠించారు. ఎందరో మహానుభావులూ ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఒకసారి రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు, సాల గ్రామాలకు అభి షేకాలు చేసినట్టు అవుతుంది. అలాంటి జలం అత్యంత పవిత్రమైనది. చాలా వ్యాధులను ఈ మంత్ర జలం నివారిస్తుందని చెబుతారు. ఈ పాదోదకాన్ని తాగడానికి మాత్రమే కాకుండా భక్తులపై ప్రోక్షణం కూడా చేస్తారు. దీనివల్ల పిశాచ బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
మంత్రాక్షితలు
రాఘవేంద్రస్వామి దర్శనం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షితల కోసం బారులు తీరుతారు. ఈ అక్షింతల్లో పసుపు, సున్నం కలుపు తారు. అందుకే ఇవి ఎర్రగా ఉంటాయి. రాఘ వేంద్ర స్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులకు అక్షింతలను ఇచ్చే సంప్రదాయం రాఘ వేంద్ర స్వామి కాలం నుంచి కొనసాగుతోంది. ఆనాడు ఆ యతీంద్రులు వాడిన పాత్రల్లోనే నేటికీ వాటిని తయారు చేసి భక్తులకు ఇస్తుండటం విశేషం. మఠంలో అంత పవిత్రతను కాపాడు కుంటూ వస్తున్నారు.
మృత్తిక మహిమ
రాఘవేంద్రస్వామి బృందావనంపై ఉంచే మృత్తిక చాలా విశిష్టమైనదని నమ్మకం. దీని విష యంలో ఒక కథ ఉంది. గురు రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్నప్పుడు, ఓ బ్రాహ్మణ భక్తుడు స్వామి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నా కుమారుడి ఉపనయనానికి ధనం కావాలి’ అని అడిగాడు. ఆ సమయంలో స్వామి తుంగభద్ర నడి ఒడ్డున స్నానం కోసం ఉన్నారు. రోజూ మృత్తికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చారు. దానిని ఆ భక్తుడు తీసుకుని వెళ్తూ దారి తప్పి మరో గ్రామానికి చేరుకున్నాడు. అక్కడు గురు రాఘ వేంద్రుడు ఇచ్చిన మృత్తిక సాయంతో ఓ ధన వంతుడి సంతానాన్ని హరిస్తున్న పిశాచిని ఆ భక్తుడు హరిస్తాడు. అప్పుడా ధనవంతుడు సంతో షంతో ఆ పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. అంతటి మహిమ ఉన్న ఆ మృత్తికను నేటికీ మంత్రా లయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం ఏర్పాటు చేశారు. ఏటా ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరే గింపుతో తెచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు. ఇతర ప్రాంతాల్లో రాఘవేంద్ర స్వామి ఆలయాల స్థాపనకు ఈ మృత్తికను వినియోగి స్తారు. అలాగే ఈ మృత్తికను భక్తులు తీసుకెళ్లి ఇళ్లలో ఉంచుకుంటారు.
మంచాలమ్మ దర్శనం
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా మఠం ముందు ఉండే గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో బృందావనం ప్రవేశం చేయక ముందు అమ్మవారిని దర్శించి ‘నేను ఇక్కడే కొలువై ఉంటాను. ముందుగా నీకు నైవేద్యం, దర్శనం అయిన తరువాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారు’ అని చెప్పినట్టు మఠం పండితులు చెబుతారు.
ఇతర విశేషాలు
మంత్రాలయం నిత్యం వివిధ ఉత్సవాలతో కోలాహలంగా ఉంటుంది. ప్రస్తుత రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతిగా సుబుదేంద్ర తీర్థులు వ్యవహరిస్తున్నారు. ఏటా వివిధ సందర్భాలలో జరిగే ఉత్సవాలకు ఈయనే శ్రీకారం చుడు తుంటారు. ఇక, మఠంలో శాఖోత్సవం, ధాన్య పూజలు, పూర్వారాధన, రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పంచామృతాభి షేకం, ఉత్తరారాధన రోజున స్వామి వారి ఉత్సవ మూర్తిని మహా రథంపై ఉంచి పుర వీధుల్లో ఊరే గించడం, సుజ్ఞానేంద్ర ఆరాధన వంటివి ఆయా ప్రత్యేక రోజులు, తిథుల సందర్భంలో జరుగు తుంటాయి.

Review అక్కడ మట్టి కూడా మహిమ చూపుతుంది..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top