
రామాయణ రచనా ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని ఇలా అడిగాడట..
‘ఈ లోకంలో ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగిన వాడు, సత్యం పలికే వాడు, దృఢమైన సంకల్పం కలిగిన వాడు, చారిత్రము కలిగిన వాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన వాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించిన వాడు, తేజస్సు కలిగిన వాడు, ఎదుటి వారిలో మంచిన చూసే వాడు, ఎవరి కోపం దేవతలను కూడా భయపెడుతుందో అటువంటి వ్యక్తి ఉంటే నాకు చెప్పండి?’’.
వాల్మీకి మహర్షిలో జాగృతమైన బ్రహ్మ జిజ్ఞాసే ఈ ప్రశ్న అనేది ఇందులో ఉన్న నిగూఢార్థం. వాల్మీకి మహర్షి నారదుడిని షోడశ గుణాత్మకమైన భగవత్ తత్వాన్ని గురించి ప్రశ్నించడగా నారదుడు ఈ లక్షణాలన్నీ నర రూపంలో భూమిపై నడయాడుతున్న నారాయణుడైన శ్రీరామునివేనని బదులిస్తాడు. అలా ఈ లక్షణాలు పరిపూర్ణ మానవుని లక్షణాలుగా కూడా స్వీకరించదగినవి.
చాలా చిన్న కారణాలకే కుంగిపోయి నిస్ప•హకు గురయ్యే నేటి తరం శ్రీరాముని లక్షణాలను చాలా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, శ్రీరాముని లక్షణాలన్నిటిలో అందరూ నేర్చుకోవాల్సిన తక్షణ గొప్ప లక్షణం ‘స్థిత ప్రజ్ఞత్వం’. ఇదొక్కటి ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే
Review అక్షర లక్షలు శ్రీరాముని లక్షణాలు.