అతిథిగా పనికి రాని వాడు

-Mahabharath – Udyog
Someone who does not assist or work, one who eats excessively, one nobody likes, one who is cunning, one who is a sadist, one who is disconnected with place and time and one who is improperly dressed should not be encouraged as a guest at home.

అతిథి దేవోభవ’ అన్నది ఆర్యోక్తి. అ••నా అనర్హులైనవారిని మన ఇంటిలో అతిథులుగా ఉంచుకోరాదు-అంటారు పెద్దలు. ఆ అనర్హులు ఎవరు? ఏ లక్షణాలున్నవారిని ఇంట్లో అతిథులుగా ఉంచుకోరాదో తెలిపే శ్లోకం.
శ్లో।। అకర్మశీలం చ మహాశనం చ
మాయావినం లోకవిరుద్ధ వృత్తం ।
అదేశకాలజ్ఞమనిష్టవేషమ్‍
ఏతాన్‍ గృహే న ప్రతివాసయేత ।।
ఏ పనిని చేయని సోమరిని, అతిగా తిండితినే వాణ్ణి, మోసగాడిని, లోకానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడిని, దేశకాల జ్ఞానం లేనివాడిని, ప్రజలు హర్షించని వేషధారణ కలవాణ్ణి ఇంట్లో అతిథి•గా ఉంచు కోరాదు.
వేషభాషల్లో సభ్యత, సంస్కారాలు లేనివారిని దరి చేరిస్తే మనకే ప్రమాదం. తీవ్రవాది అని, తెలియక ఇంట్లో పెట్టుకోవటం మనకీ ముప్పే. అలాగే వ్యసనపరుడైన వ్యక్తికి ఇంట్లో ఆశ్రయం ఇస్తే, క్రమంగా ఆశ్రయం ఇచ్చిన ఆ కుటుంబం, ఆ గ్రామం కూడా చెడిపోయే ప్రమాదం వుంది. పని చేయకుండా తినమరిగినవాడు ఇంట్లో వుంటే… పని చేసేవారు సహితం సోమరులుగా తయారవుతారు.
ఈ సుభాషితం ఆధారంగా ఒకరింటికి వెళ్లినప్పుడు ఏయే దుర్గు ణాలు మనలో ఉండకూడదో తెలుస్తుంది. ఒకరి ఇంట్లో ఉండే టప్పుడు ఎలా మెలగాలో ఈ శ్లోకం మార్గదర్శనం చేస్తుంది.
-బి.ఎస్‍.శర్మ

Review అతిథిగా పనికి రాని వాడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top