ఇతిహాస నగరి..అయోధ్య పురి

అదిగదిగో.. నా రాముడు పుట్టిన నేల.. అదే రామ్‍ ఛబూత్రా.. బుల్లి రాముడు అక్కడే ‘రామ్‍లల్లా విరాజ్‍మాన్‍’గా వెలుగొందాడు. అదిగో సీతమ్మ తన కుటుంబం కోసం వంటలు చేసిన ‘రసోయీ’.. రాములోరి కుటుంబం తమ ఇంటి అవసరాల కోసం వినియోగించిన ‘సీతా కూప్‍’ అదే.. రాముడు సీతతో కలిసి జీవనం సాగించిన.. రాముడు ధర్మబద్ధంగా ఏలిన నేల అది. అదే రామజన్మభూమి. శతాబ్దాలుగా నలుగుతూ.. దశాబ్దాలుగా వివాదాలకు కారణమవుతూ.. తను పుట్టిన ప్రదేశం కోసం రాముడే పోరాడి.. గెలిచిన సందర్భమిది.. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో రామ్‍లల్లా తరపున కూడా పిటిషన్‍ దాఖలైంది. దానిని పరిశీలించిన భారత సర్వోన్నత న్యాయస్థానం నవంబరు 9న చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలం రాముడికే చెందుతుందని ప్రకటించింది. దేశ రాజకీయాలను మలుపు తిప్పి.. జాతి సమస్యగా మారిన అయోధ్య వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఇక, అక్కడ ఇప్పుడేం జరగబోతోంది? ఆలయం నిర్మాణానికి జరుగుతున్న సన్నాహాలేమిటి?అది ఎప్పటికి పూర్తి కానుంది? భారతీయ జన జీవనంలో

సరయు నదీ తీరాన వెలసిన అయోధ్య నగరానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అంతకుమించిన ఆధ్యాత్మిక విశేషాలు ఉత్తరప్రదేశ్‍ రాష్ట్రం ఫైజాబాద్‍ డివిజన్‍లో గల ఈ నగరంతో ముడిపడి ఉన్నాయి. త్రేతా యుగంలో ద•శరథ మహారాజు పరిపాలించిన కోసల రాజ్యానికి అయోధ్య నగరం రాజధానిగా విలసిల్లింది. తమ ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు ఇక్కడే జన్మించాడని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వివాహం చేసుకుని సీతాదేవితో రాముడు రాజధానికి చేరుకోవడం, దంపతుల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత అయోధ్యకు తిరిగి రావడం, రాముడి పట్టాభిషేకం, గర్భిణిగా ఉండ గానే సీత అనూహ్యంగా రాజ ప్రసాదాన్ని వీడటం, అశ్వమేథ యాగం, సీతారాముల పరిణయం అనంతరం కుశుడి పరిపాలన కొనసాగడం.. ఇలా రామాయణంలోని పలు ప్రధాన ఘట్టాలకు అయోధ్య నగరం సాక్షీభూతంగా నిలిచిందని హిందువులు నమ్ముతారు.
రాముడి జననం..
క్రీస్తు పూర్వమే రాసిన వాల్మీకి రామాయణంలో నాలుగు శ్లోకాలు రాముడి జననాన్ని ప్రస్తావిస్తున్నాయి.
రామాయణం పదో శ్లోకంలో- ‘కౌసల్య కుమారుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడికి దైవత్వ లక్షణాలు ఉన్నాయి. అతడేమీ సామాన్యుడు కాదు. విశ్వ పవు రావడంతో అయోధ్య పునీతమైంది’ అని ఉంది.
రామాయణం ఐదో శ్లోకం- ‘జన్మభూమి’ అనే పదంతో ప్రారంభమవు తుంది. ఇది మొత్తం నగరానికే తప్ప, ఏదో ఒక ప్రత్యేక ప్రాంతాన్ని సూచించదు.
ఇతర శ్లోకాల్లోనూ రాముడి జననంపై ప్రస్తావన ఉంది.
నాలుగో శ్లోకంలో అయోధ్యను ‘అవధ్‍పురి’ అని వర్ణించడం కనిపిస్తుంది.
ఏడో శ్లోకంలో ‘ఇహాన్‍’ (ఇక్కడ) అంటే అయోధ్యలో అన్న ప్రస్తావన ఉంది.
దశరథుడి రాజ ప్రాసాదంలో కౌసల్య రాముడికి జన్మనిచ్చిందని రామా యణంలో ఉన్న, స్థలం వర్ణన లేదు.
అయోధ్యలోనే పుట్టాడు కానీ.. ఎక్కడ?
రాముడు అయోధ్యలో జన్మించినట్టు దాదాపు అందరూ అంగీకరించినా, ఆ నగరంలో ఎక్కడ పుట్టాడన్నది తేల్చడం సమస్యగా మారింది. దీనిపై తీర్పు వెలువరించే ముందు సుప్రీంకోర్టు, ‘వాల్మీకి రామాయణం’, ‘స్కంద పురాణం’, ‘తులసీదాస్‍ రామచరిత మానస్‍’లను పరిగణనలోకి తీసుకుంది. ఇవి ఆధారాలు కావంటూ పూర్తిగా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించింది. హిందూ మతానికి ఇటువంటి గ్రంథాలే మూలాలని అభిప్రాయపడింది. అందులోని కొన్ని శ్లోకాలను కూడా తన తీర్పు సందర్భంగా ఉటంకించింది.
ఆ ప్రాంతానికి ఈశాన్యంలోనే రాముడు జన్మించాడు..
8వ శతాబ్దంలో రచించిన స్కంద పురాణంలో రాముడు జన్మించిన స్థలానికి సంబంధించిన వర్ణన ఉంది. ఆయన జన్మించిన ప్రదేశంలో చేసిన కొన్ని పూజల సందర్భంగా చేసిన వర్ణన అది. ‘ఆ ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్నదే రాముడు జన్మించిన స్థలం. ఆ స్థలం మోక్షాన్ని ప్రసాదించేది. విఘ్నేశ్వరుడికి తూర్పున, వశిష్ఠుడికి ఉత్తరాన, లౌమాసకు పశ్చిమాన ఆ స్థలం ఉంది. జన్మ స్థలంలో పవిత్ర పూజలు చేయడం ద్వారా ఆ వ్యక్తి తల్లి దండ్రులు, గురువుల పట్ల భక్తిభావంతో ఉంటాడు’ అనే ప్రస్తావన ఉంది.
తులసీదాస్‍ రచించిన రామచరిత మానస్‍లోని ‘చౌపాయి’ల్లో రాముడి జననంపై వర్ణన ఉంది. విష్ణుమూర్తి అవధ్‍పురిలోని దశరథుడు, కౌసల్య ఇంట్లో మానవ రూపం దాల్చుతారన్న ప్రస్తావన ఉంది. మసీదు నిర్మించిన 1528కి ముందే రచించిన గ్రంథాల్లో ఉన్న ఆయా ప్రస్తావనల కారణంగా రామ జన్మభూమి (అయోధ్య)గా పేర్కొన్న ప్రాంతమే రాముడు పుట్టిన స్థలం అనే విశ్వాసం హిందువుల్లో బలపడింది.
కనౌజ్‍గా మారిన అయోధ్య
రాజులు, రాజ్యాలు మారుతున్న క్రమంలో అయోధ్య ప్రాంతంలో కనౌజ్‍ రాజ్యం అవతరించింది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో అది అవధ్‍గా మారింది. తరువాత ఢిల్లీ సుల్తానుల ఏలుబడిలోకి వెళ్లి, దాని పతనం తరువాత జాన్‍పూర్‍లో భాగమైంది. 16వ శతాబ్దంలో మొఘలుల వశమైంది. మూడో పానిపట్టు యుద్ధం తరువాత ఈస్టిండియా కంపెనీకి 1764లో అవధ్‍ సామంత రాజ్యంగా మారిపోయింది. చివరికి బ్రిటిష్‍ వారు 1856లో తమ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. అన్ని రకాల హక్కులు కోల్పోయిన నాటి రాజులు 1857లో తొలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఓడి పోయారు. ఈ పరిణామంతో అవధ్‍ ప్రాంతం 1877లో ఆగ్రా ప్రెసిడెన్సీలో కలిసి నార్త్ – వెస్ట్రన్‍ ప్రావిన్సులో భాగమైంది. తరువాత అదే ఆగ్రా – అవధ్‍గా యునైటెడ్‍ ప్రావిన్సెన్‍ మారింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‍ రాష్ట్రంలోని ఫైజాబాద్‍ జిల్లాలో కలిసింది.
జైనులు.. బౌద్ధులు.. ముస్లింలు
అయోధ్యలో జైన మత స్థాపకుడు రిషభనాథుడు, బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు.. ఇద్దరూ కొంత కాలం జీవించారని ఆయా మతాల అనుయాయుల విశ్వాసం. కాలక్రమంలో అయోధ్య పేరు సాకేత్‍గా మారింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు ఇక్కడ స్థూపం సైతం నిర్మించాడు. భారత్‍పై క్రీస్తు శకం 975 – 1187 మధ్య కాలంలో గజనీ, 1148 – 1125 మధ్య కాలంలో ఘోరీ చేసిన దండయాత్రలతో దేశంతో పాటు అయోధ్యలోని పలు ఆలయాలు ప్రభావితం అయ్యాయి. ఢిల్లీ సుల్తానుల కాలంలో చివరి లోడీ రాఉను ఓడించిన బాబర్‍ మొఘల్‍ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్‍ ఆదేశంతో ఆయన సైనికాధికారి మీర్‍ఖాన్‍ 1528లో అయోధ్యలో రాముడి ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించినట్టు హిందువుల వాదన. గుడి శిథిలాలపై మసీదు నిర్మించినట్టు మరో వాదనా ఉంది. ఈ కారణంగా అయోధ్య ముస్లింలకూ కావాల్సిన నగరంగా మారింది.
ఇక మందిరం నిర్మాణమే తరువాయి..
అయోధ్యపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువడటంతో ఇక అందరి దృష్టీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపైనే పడింది. మందిరం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అనే విషయాలపై భారతావని మొత్తం చర్చించుకుంటోంది. విశ్వహిందూ పరిషత్‍ (వీహెచ్‍పీ) రూపొందించిన నమూనా ప్రకారమైతే పనులు పూర్తి కావడానికి దాదాపు అయిదు సంవత్సరాలు పడుతుంది. కనీసం 250 మంది శిల్పులు నిరంతరాయంగా పని చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికే అయోధ్యలో మందిరం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 1990 నుంచే ఇక్కడ అయోధ్యపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువడటంతో ఇక అందరి దృష్టీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపైనే పడింది. మందిరం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అనే విషయాలపై భారతావని మొత్తం చర్చించుకుంటోంది. విశ్వహిందూ పరిషత్‍ (వీహెచ్‍పీ) రూపొందించిన నమూనా ప్రకారమైతే పనులు పూర్తి కావడానికి దాదాపు అయిదు సంవత్సరాలు పడుతుంది. కనీసం 250 మంది శిల్పులు నిరంతరాయంగా పని చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికే అయోధ్యలో మందిరం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 1990 నుంచే ఇక్కడ ‘కరసేవక పురం’ పేరుతో వీహెచ్‍పీ వర్క్షాపును ప్రారంభించింది. మందిరానికి 212 స్తంభాలు అవసరమని అంచనా. వాటిలో ఇప్పటి వరకు 106 స్తంభాలు సిద్ధంగా ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా చెక్కిన ఈ స్తంభాలు కింది అంతస్తు వరకు సరిపోతాయి. రాముడి మందిరాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాలనేది వీహెచ్‍పీ ప్రణాళిక. రెండో అంతస్తుకు అవసరమైన స్తంభాలు, ఇతర శిల్పాలను ఇంకా చెక్కాల్సి ఉంది.
మధ్యలో ఆగిన పనులు..
ఈ ఏడాది జూలైలో ప్రధాన శిల్పి రజనీకాంత్‍ సోంపురా మరణించారు. అప్పటి నుంచి కరసేవక పురంలో మందిరం శిల్పాల పనులు ఆగిపోయాయి. ప్రస్తుతానికి ఇక్కడ వర్క్షాపులో పనులు జరగడం లేదు. పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే 250 మంది శిల్పులు అవసరం అవుతారని అంచనా. మందిరం కోసం చెక్కుతున్న శిల్పాల కోసం రాజస్థాన్‍ నుంచి శిలలను తరలిస్తున్నారు. శిల్పాలను తెల్ల సిమెంటుతో అతికిస్తారు. గర్భగుడికి గోడలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం పాలరాయితో ‘చౌకత్‍’లను చెక్కాల్సి ఉంది. అన్నింటిలోనూ ఆలయ శిఖర నిర్మాణం కీలకం కానుంది.
రూపాయి పావలా విరాళాలతో..
1984లో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి వీహెచ్‍పీ శంకుస్థాపన చేసింది. ప్రజల నుంచి రూపాయి పావలా చొప్పున విరాళాలు సేకరించారు. అలా రూ.8 కోట్ల రూపాయలు సమకూరాయి. 150 మంది శిల్పులు, వందలాది మంది కార్మికులు రోజుకు ఎనిమిది గంటల పాటు శ్రమిస్తే.. ఇప్పటికి కొన్ని పనులు పూర్తయ్యాయి. మొదట్లో విరాళాలు బాగా రావడంతో పాటు మొదటి పది సంవత్సరాలలో పనులు కూడా చాలా చురుగ్గా సాగాయి. 1989 నుంచి మొన్నటి సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు కూడా అక్కడి శిల్పులు ఒక్కరోజూ విశ్రమించలేదు. ఫలితంగా ఇప్పటికే అక్కడ 1.25 లక్షల ఘనపుటడుగుల రాళ్లను చెక్కారు. ఆ తరువాత మందగించాయి. శిల్పులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి పోయారు. తిరిగి పనులు పున ప్రారంభించడంపై రామ జన్మభూమి న్యాస్‍ సభ్యులు త్వరలోనే సమావేశం కానున్నట్టు సమాచారం.
ఒక్క గ్రాము ఇనుము కూడా వాడకుండా..
ఇప్పటికే సిద్ధంగా ఉన్న శిల్పాలతో రాముడి మందిరంలో ఒక అంతస్తు కట్టేయవచ్చని వీహెచ్‍పీ చెబుతోంది. ఒక్క గ్రాము ఇనుమూ వాడకుండా రాముడికి ఆలయం కట్టాలని వీహెచ్‍పీ భావిస్తోంది. అందుకే భారీగా రాళ్లను, శిలలను వినియోగిస్తున్నారు. ఇప్పటికే అక్కడకు వస్తున్న భక్తులు ఆ శిల్పాలను స్ప•శిస్తూ పరవశించి పోతున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ మురిసి పోతున్నారు. అక్కడున్న వీహెచ్‍పీ కార్యాలయంలో ఇప్పటికీ ప్రజలు, భక్తుల నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమం కొనసాగుతోంది. దేశ, విదేశాల నుంచి పెద్ద మొత్తంలో రామాలయ నిర్మాణానికి నిధులు అందు తున్నాయి.
సోంపురా ఆకృతిలోనే రామాలయం..
ప్రముఖ శిల్పి చంద్రకాంత్‍ సోంపురా రూపొందించిన ఆకృతి ఆధారంగానే రామ మందిరం నిర్మించాలని వీహెచ్‍పీ భావిస్తోంది. అప్పటి వీహెచ్‍పీ నాయకుడు అశోక్‍ సింఘాల్‍ సూచన మేరకు సోంపురా 1989లో ఒక ఆకృతిని రూపొందించారు. రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా ఆ నమూనాయే ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అందువల్ల దీని ఆధారంగానే నిర్మాణం జరుగుతుందని అనుకుంటున్నారు.
ట్రస్టు ఏర్పాటుపై కేంద్రం సన్నాహాలు
సుప్రీంకోర్టు సూచించిన ‘అయోధ్య రామాలయ ట్రస్టు’ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అధికారుల బృందం అధ్యయనం ప్రారంభించింది. ట్రస్టు ఏర్పాటుపై ఎలా ముందుకు వెళ్లాలి? ఆలయం నిర్మాణం విషయంలో సాంకేతికంగా అనుసరించాల్సిన పద్ధతులేంటి? అనే అంశాలపై న్యాయ శాఖ, అటార్నీ జనరల్‍ అభిప్రాయా లను ఈ బృందం కోరనుంది. ఈ ట్రస్టు సమన్వయ బాధ్యతలను కేంద్ర హోంశాఖ లేదా సాంస్క•తిక శాఖకు అప్పగించాలా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, రాముడి జన్మభూమి సంగతి ఇలా ఉండగా, సీతాదేవి ఉత్తరాఖండ్‍లోని పౌడి జిల్లాలో సమాధి అయినట్టుగా భావిస్తారు. అక్కడ ఆమె పేరిట భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు ఉత్తరాఖండ్‍ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‍ రావత్‍ ప్రకటించారు. మొత్తానికి ఐదు సంవత్సరాల్లో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి కానుందని అంచనా.
బీజేపీ ఎదుగుదలలో రామజన్మభూమి ఉద్యమానిది కీలకపాత్ర. 1980 తరువాత ఈ అంశం భారత రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. అది సృష్టించిన భావోద్వేగాలను హిందువుల్లోకి ఎక్కించడం ద్వారా బీజేపీ రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగింది. ఇప్పుడు అనుకూల తీర్పు రావడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి సైతం రామ మందిరం నిర్మాణ అంశమే బీజేపీ ప్రధాన అస్త్రం కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆ పార్టీ ఇప్పుడు ఆనందడోలికల్లో మునిగి తేలుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధానాస్త్రం కానుందనేది అప్పుడే రూఢీ అయిపోయింది. ఇక ఎటొచ్చీ అయోధ్య వివాదంలో దారుణంగా నష్టపోయింది కాంగ్రెస్‍ పార్టీనే. తొలి నుంచీ ఈ అంశంలో సంకట స్థితిని ఎదుర్కొంటున్న ఆ పార్టీ.. ప్రస్తుత తీర్పుతోనూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయోధ్య వివాదం రగులుకోవడానికి, బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్‍ నాటి నుంచి అనుసరించిన ‘చూసీచూడని’ విధానాలే కారణమనే అభిప్రాయం ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. మొత్తంగా బీజేపీకి వచ్చే ఎన్నికల్లోనూ ఇదే విజయాస్త్రం కానుందని రాజకీయ పండితుల అంచనా.
రసేవక పురం’ పేరుతో వీహెచ్‍పీ వర్క్షాపును ప్రారంభించింది. మందిరానికి 212 స్తంభాలు అవసరమని అంచనా. వాటిలో ఇప్పటి వరకు 106 స్తంభాలు సిద్ధంగా ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా చెక్కిన ఈ స్తంభాలు కింది అంతస్తు వరకు సరిపోతాయి. రాముడి మందిరాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాలనేది వీహెచ్‍పీ ప్రణాళిక. రెండో అంతస్తుకు అవసరమైన స్తంభాలు, ఇతర శిల్పాలను ఇంకా చెక్కాల్సి ఉంది.
మధ్యలో ఆగిన పనులు..
ఈ ఏడాది జూలైలో ప్రధాన శిల్పి రజనీకాంత్‍ సోంపురా మరణించారు. అప్పటి నుంచి కరసేవక పురంలో మందిరం శిల్పాల పనులు ఆగిపోయాయి. ప్రస్తుతానికి ఇక్కడ వర్క్షాపులో పనులు జరగడం లేదు. పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే 250 మంది శిల్పులు అవసరం అవుతారని అంచనా. మందిరం కోసం చెక్కుతున్న శిల్పాల కోసం రాజస్థాన్‍ నుంచి శిలలను తరలిస్తున్నారు. శిల్పాలను తెల్ల సిమెంటుతో అతికిస్తారు. గర్భగుడికి గోడలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం పాలరాయితో ‘చౌకత్‍’లను చెక్కాల్సి ఉంది. అన్నింటిలోనూ ఆలయ శిఖర నిర్మాణం కీలకం కానుంది.
రూపాయి పావలా విరాళాలతో..
1984లో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి వీహెచ్‍పీ శంకుస్థాపన చేసింది. ప్రజల నుంచి రూపాయి పావలా చొప్పున విరాళాలు సేకరించారు. అలా రూ.8 కోట్ల రూపాయలు సమకూరాయి. 150 మంది శిల్పులు, వందలాది మంది కార్మికులు రోజుకు ఎనిమిది గంటల పాటు శ్రమిస్తే.. ఇప్పటికి కొన్ని పనులు పూర్తయ్యాయి. మొదట్లో విరాళాలు బాగా రావడంతో పాటు మొదటి పది సంవత్సరాలలో పనులు కూడా చాలా చురుగ్గా సాగాయి. 1989 నుంచి మొన్నటి సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు కూడా అక్కడి శిల్పులు ఒక్కరోజూ విశ్రమించలేదు. ఫలితంగా ఇప్పటికే అక్కడ 1.25 లక్షల ఘనపుటడుగుల రాళ్లను చెక్కారు. ఆ తరువాత మందగించాయి. శిల్పులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి పోయారు. తిరిగి పనులు పున ప్రారంభించడంపై రామ జన్మభూమి న్యాస్‍ సభ్యులు త్వరలోనే సమావేశం కానున్నట్టు సమాచారం.
ఒక్క గ్రాము ఇనుము కూడా వాడకుండా..
ఇప్పటికే సిద్ధంగా ఉన్న శిల్పాలతో రాముడి మందిరంలో ఒక అంతస్తు కట్టేయవచ్చని వీహెచ్‍పీ చెబుతోంది. ఒక్క గ్రాము ఇనుమూ వాడకుండా రాముడికి ఆలయం కట్టాలని వీహెచ్‍పీ భావిస్తోంది. అందుకే భారీగా రాళ్లను, శిలలను వినియోగిస్తున్నారు. ఇప్పటికే అక్కడకు వస్తున్న భక్తులు ఆ శిల్పాలను స్ప•శిస్తూ పరవశించి పోతున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ మురిసి పోతున్నారు. అక్కడున్న వీహెచ్‍పీ కార్యాలయంలో ఇప్పటికీ ప్రజలు, భక్తుల నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమం కొనసాగుతోంది. దేశ, విదేశాల నుంచి పెద్ద మొత్తంలో రామాలయ నిర్మాణానికి నిధులు అందు తున్నాయి.
సోంపురా ఆకృతిలోనే రామాలయం..
ప్రముఖ శిల్పి చంద్రకాంత్‍ సోంపురా రూపొందించిన ఆకృతి ఆధారంగానే రామ మందిరం నిర్మించాలని వీహెచ్‍పీ భావిస్తోంది. అప్పటి వీహెచ్‍పీ నాయకుడు అశోక్‍ సింఘాల్‍ సూచన మేరకు సోంపురా 1989లో ఒక ఆకృతిని రూపొందించారు. రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా ఆ నమూనాయే ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అందువల్ల దీని ఆధారంగానే నిర్మాణం జరుగుతుందని అనుకుంటున్నారు.
ట్రస్టు ఏర్పాటుపై కేంద్రం సన్నాహాలు
సుప్రీంకోర్టు సూచించిన ‘అయోధ్య రామాలయ ట్రస్టు’ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అధికారుల బృందం అధ్యయనం ప్రారంభించింది. ట్రస్టు ఏర్పాటుపై ఎలా ముందుకు వెళ్లాలి? ఆలయం నిర్మాణం విషయంలో సాంకేతికంగా అనుసరించాల్సిన పద్ధతులేంటి? అనే అంశాలపై న్యాయ శాఖ, అటార్నీ జనరల్‍ అభిప్రాయా లను ఈ బృందం కోరనుంది. ఈ ట్రస్టు సమన్వయ బాధ్యతలను కేంద్ర హోంశాఖ లేదా సాంస్క•తిక శాఖకు అప్పగించాలా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, రాముడి జన్మభూమి సంగతి ఇలా ఉండగా, సీతాదేవి ఉత్తరాఖండ్‍లోని పౌడి జిల్లాలో సమాధి అయినట్టుగా భావిస్తారు. అక్కడ ఆమె పేరిట భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు ఉత్తరాఖండ్‍ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‍ రావత్‍ ప్రకటించారు. మొత్తానికి ఐదు సంవత్సరాల్లో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి కానుందని అంచనా.
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలు.. దానిపై రూపొందించిన నివేదికే సుప్రీంకోర్టు తీర్పులో కీలకంగా మారింది. అయోధ్యలో పురావస్తు శాఖ ఎప్పుడెప్పుడు తవ్వకాలు జరిపింది? ఏం కనుగొందంటే..
1976-77, 2003లో రెండుసార్లు అయోధ్య వివాదాస్పద స్థలంలో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. రెండోసారి తవ్వకాల నివేదికనే సుప్రీంకోర్టు తన తీర్పుకు ఆధారం చేసుకుంది.
క్రీస్తు పూర్వం 12వ శతాబ్దానికి చెందిన పురాతన రాళ్లు, శిల్పాలు, నిర్మాణ వస్తువుల ఆనవాళ్లు ఇక్కడ లభించాయి.
వివాదాస్పద స్థలంలోని ఉత్తర, దక్షిణ మార్గాల్లో.. మసీదు గోడల కింద, దాని నిర్మాణం కంటే ముందే అస్తిత్వంలో ఉన్న ఓ పెద్ద కట్టడానికి చెందిన పునాదులు ఉన్నాయి.
ఒక గోడ మీద మరో గోడ నిర్మించినట్టు తేలింది. అంటే, తొలి కట్టడాన్ని కూల్చుని మసీదు నిర్మించినట్టు స్పష్టమవుతోంది.
కట్టడం మధ్యలో 15.15 మీటర్ల పరిమాణంలో ఒక ఎత్తయిన గద్దె కనిపించింది.
తవ్వకాల్లో లభించిన ఆయా వస్తువుల కాలాన్ని నిర్ధారించడానికి కార్బన్‍డేటింగ్‍ నిర్వహించారు. అందులో- అత్యంత లోతైన పొరలో తొలి నగరీకరణ ప్రారంభమైన క్రీ.పూ.1000 నుంచి 300 కాలం నాటి ఇనుప నాగరికతకు చెందిన మహిళా దేవతల ప్రతిమలు, పూజలు, కాల్చిన మట్టి, సీసం ఉన్నాయి.
తరువాతి పై పొరలో క్రీ.పూ.200కు చెందిన శుంగుల కాలానికి చెందిన మహిళలు, జంతువులకు చెందిన టెర్రకోట ప్రతిమలు, నలుపు, బూడిద రంగు వంటపాత్రలు, కాల్చిన ఇటుకలు, రాళ్ల వరుసలు కనిపించాయి.
మరో పొరలో క్రీ.శ. 100-300 కాలానికి చెందిన కుషాణుల కాలానికి చెందిన మనుషులు, జంతువుల టెర్రకోట విగ్రహాలు, కుండలు, పూసలు, గాజులు, భారీ కట్టడాల ఆనవాళ్లు కనిపించాయి.
ఇంకో పొరలో క్రీ.శ. 320-600 కాలానికి చెందిన గుప్తుల కాలంలోని క్లిష్టమైన టెర్రకోట వస్తువులు, చంద్రగుప్తుడి ముద్రలతో ఉన్న రాగి నాణేలు లభించాయి.
దీని తరువాతి పొరలో క్రీ.శ.11-12 శతాబ్దానికి చెందిన భారీ కట్టడం బయటపడింది

Review ఇతిహాస నగరి..అయోధ్య పురి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top