వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతాం? ఈ ఆచారం ఎలా ఏర్పడింది?
వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచా రమూ ఇతర పండుగలకు భిన్నంగానే ఉంటుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకు ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు అంటే చాలా కారణాలే కనిపిస్తాయి.
ఈ విశ్వంలో భూమి అణువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. అవన్నీ ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని వినాయక చవితి రోజున కడతారు.
గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ప్రకృతిలోని సృష్టి, స్థితి, లయ అనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజ ఈ మూడు స్థితులనూ ప్రతీకలుగా భావించవచ్చు. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమనూ, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశాన్ని (లయం) సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకు ఒక పరిపూర్ణతను ఇస్తాము.
గణపతి అంటే గణాలకు అధిపతి. తొలి పూజలు అందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజిం చడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతీకగా భావించ వచ్చు.
పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలి పోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి అనే సందేహం కలగవచ్చు. అందుకే వెలగపండును కడతారు. దాంతో పాటుగా మొక్కజొన్న పొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మ వంటి పండ్లనూ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్న మాట.
ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ, వినాయకుడంటే సాక్షాత్తూ ఓంకార స్వరూ పుడు కదా! పైగా గణాధిపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది?
గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకోవడానికి వీలు కల్పించేది వినాయక పూజ. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి వంటి వస్తువులే ఇందులో ప్రధాన పూజా ద్రవ్యాలు. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు.. పండుగ అంగరంగ వైభవంగా సాగిపోయి నట్టే. పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకు అద్భుతమైన శోభను ఇస్తుంది.
భాద్రపదంలో వచ్చే శనివారం వ్రతం విశేషాలేమిటి?
భాద్రపద మాసంలో వచ్చే శనివారం నాడు వ్రతమాచరించే వారికి సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో వేంకటేశ్వరస్వామిని తలచి వ్రతమాచరించాలి. శనివారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానం చేసి తిరు నామాన్ని నుదుట దిద్దుకుని పూజ చేసే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఆ రోజు పూజగది, పూజా సామగ్రిని శుభ్రపర్చుకుని చక్కెర పొంగలి, వడపప్పు, పాయసాన్ని నైవేద్యంగా వేంకటేశ్వ రునికి సమర్పించాలి. ఇంకా భాద్రపదంలో వచ్చే మూడో శనివారం నాడు పై విధంగా పూజ చేసి దాన ధర్మాలు చేసేవారికి అన్ని శుభాలు చేకూరుతాయి. మూడో శనివారం పేదలకు తమ వంతు సాయం చేయాలి. అలాగే భాద్రపద శనివారాల్లో పితృ దేవతలను సంతృప్తి పరచా లంటే పేదలకు దానం చేయడం, ప్రసిద్ధ ఆల యాలను సందర్శించి తర్పణాలు ఇవ్వడం ఉత్తమం అని పండితుల మాట.
ఇంకా శనిగ్రహ దోషాలను దూరం చేసు కోవాలంటే భాద్రపదంలో వచ్చే మూడో శనివారం నాడు పేదలకు అన్నదానం చేసి విష్ణుమూర్తిని నిష్ఠతో కొలవాలని జ్యోతిష్య నిపుణులు చెబు తున్నారు.
Review చవితి నాడు పాలవెల్లి ఎందుకు?.