దేవి అలంకరణలు

ఆలయాల్లో నవరాత్రులు చేసే వారు రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ తొమ్మిది అవతారాల్లో సాధకులకు క్రమంగా జరిగే అభివృద్ధి తొమ్మిది దశల్లో ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ తొమ్మిది దశలు దాటిన సాధకులు దశమి నాటికి విజయసిద్ధికి చేరువ అవుతారు. సిద్ధులవుతారు. గనుకనే ఈ పర్వం ‘విజయదశమి’ అయ్యింది.

మొదటి రోజు: ఈనాటి అలంకారం బాలా త్రిపురసుందరి. అందమైన, అమాయకమైన బాలికా రూపమిది. సాధన తొలి దశలో దేవిని ఈ రూపంలో దర్శించాలి అని దేవీ భాగవతం చెబుతోంది.

రెండో రోజు: మహాలక్ష్మి ఈనాటి అవతారం. ఈ రోజు స్వాతి నక్షత్రంలో ఐరావతం అనే తెల్లని ఏనుగు పుట్టింది. పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీ రూపంలోని అమ్మవారిని రెండు ఏనుగులు అభిషేకిస్తున్నట్టు అమ్మవారు ఘటాలతో ధనాన్ని గుమ్మరిస్తున్నట్టు అలంకరిస్తారు.

మూడో రోజు: అలంకారం గాయత్రి. తనను ఆరాధించే సాధకులను రక్షించే లక్షణం ఉన్న దేవత గాయత్రి. అత్యంత శక్తి, మహిమ గల తల్లి ఈమె. ఈ మాతను పూజిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయని అంటారు. గాయత్రి ఉపాసన అత్యంత శ్రేష్ఠమైనది. సకల మంత్రాలు గాయత్రి మంత్రాక్షరాలతోనే ముడి పడి ఉన్నాయి.

నాలుగో రోజు: అన్నపూర్ణ అలంకారం. ఈమె కాశీవిశ్వేశ్వరుని మహాదేవి అయిన విశాలాక్షీ దేవి. శంకరునితో సహా అందరికీ అన్నం పెట్టే తల్లి. అందుకే ఈ తల్లిని కొలిచిన ఇంట అన్నహార్యాలకు లోటుండదని ప్రతీతి.

అయిదో రోజు: ఈ రోజు అలంకరణ లలితాదేవి. త్రిపురసుందరిగా ప్రతీతి. జ్ఞాన దేవతగా తనను కొలిచే ఉపాసకులకు కార్యసిద్ధి కలిగించే శక్తి లలితాదేవి. ఆమె లలిత మాధుర్యమైన చూపులు సర్వులకూ చల్ల దనాన్నిస్తాయి.

ఆరో రోజు: ఈ రోజు దేవీ అలంకారం శాకంబరి మాత. క్షామం నెలకొని ప్రజలు, పశుపక్ష్యాదులు ఆహారం లేక అల్లాడిపోతున్న సమయంలో భూమిని సుభిక్షం చేసిన మాత ఈమె. అందుకు కృతజ్ఞతగానే ఆమెను ఈనాడు ఆకుకూరలు, శాకాలే వస్త్రాభరణాలుగా భక్తులు అలంకరించి పూజిస్తారు.

సప్తమి నాడు (ఏడో రోజు): మూలా నక్షత్రంలో సరస్వతిగా అమ్మవారిని ఈనాడు అలంకరించి కొలు స్తారు. ఒక చేతిలో వీణ, మరో చేతిలో చిలుక, వేరొక చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో అక్షరమాల ఉంటాయి. శరన్నవ రాత్రుల్లో మూల పూజ సరస్వతికే. ఈ తల్లిని కొలిచిన వారికి విద్యాబుద్ధులకు లోటు ఉండదు.

ఎనిమిదో రోజు (అష్టమి): ఇది అష్టమి తిథి. దుర్గాష్టమి అంటారు. దుర్గ యుద్ధమూర్తి. శత్రు భయం నుంచి కాపాడేది. రోగ, శోక, తాప గుణాలను నశింపచేసే రూపం. మానవ జీవితాల్లోని దుర్గమమైన లక్షణాలను రూపుమాపే దేవీ రూపం ఇది.

మహర్నవమి (తొమ్మిదో రోజు): దేవిని మహిషా సుర మర్దినిగా అలంకరిస్తారు. మహిషుడనే రాక్ష సుడిని సంహరించిన దేవి రూపమిది. మహిషమంటే దున్నపోతు. మనుషుల్లోని ఆ లక్షణాలను నాశనం చేసేది దుర్గ.

పదో రోజు: విజయదశమి నాడు సకల దేవతలు ఇచ్చిన సర్వాయుధాలతో ఉన్న అమ్మవారి

Review దేవి అలంకరణలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top