
గత 20 సంవత్సరాలకు పైగా ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులు ఆలయ పూజారి, ప్రముఖ శైవాగమ పండితులు, జ్యోతిషవేత్త శ్రీ సాయిస్వర్ణ గారి ద్వారా ఎన్నోవిధాలుగా ప్రయోజనాలు పొందారు. ఐదేళ్ళ క్రితం తనవద్దకు వస్తున్న ఎన్నో జాతకాలను పరిశీలించిన తర్వాత సాయిగారు చాలామంది జాతకులలో కుజదోషం లేదా కాలసర్పదోషం ఉండటం గమనించారు. అలాంటివారి ప్రయోజనార్థం ఈ ఆవరణలో ఒక నాగదేవత ఆలయాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీకి సూచించారు. ధర్మకర్తలు చాలా లోతుగా చర్చించిన మీదట వాస్తునిపుణుల సూచనలు, సలహాల మేరకు అష్టముఖ గండభేరుండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తూర్పుదిశగా, ఆలయ పుష్కరిణికి కుడివైపుగా నాగదేవత ఆలయాన్ని నెలకొల్పుదామని నిర్ణయించుకున్నారు. దాంతో నవంబర్ 2016లో శంకుస్థాపన జరిగింది. ఆలయ ప్రతిష్ఠ 2017మేలో ద్వితీయ కుంభాభి షేకం సమయంలో జరిగింది.
కుజదోషం:
ఎవరైనా జన్మించిన సమయంలో జన్మ కుండలిలో లగ్నం నుంచి 2,12,4,7,8 ఇంట వక్రదృష్టితో వీక్షించడాన్ని కుజదోషంగా చెబు తారు. కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవ్వడం లేదా పెళ్లి కావడమే కష్టంగా ఉండటం, తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత కూడా పెళ్ళి ఆగిపోవడం, పెళ్ళి అయిన కొద్దికాలానికే భార్య లేదా భర్త ఆకస్మిక మరణం, విడాకులు, సంసార జీవితంలో సమన్వయం లోపించడం, హత్యలు, సంతానం కలగకపోవడం, సంసారంలో కలతలు రేగడం వంటి దుష్ఫలితాలు సంభవించే అవ కాశం ఉంది.
కాలసర్పదోషం:
సర్పాలను చంపడం లేదా పాములను పట్టడాన్ని, కొట్టడాన్ని ప్రోత్సహించడం పాముల పుట్టలను అనవసరంగా ధ్వంసం చేయడం, అవి మనకు ఏమీ హాని చేయకుండా వాటి మానాన అవి పోతున్నా కూడా వాటిమీద రాళ్ళు వేయడం లేదా కొట్టడం, చంపడం, జంటపాముల క్రీడకు ఆటంకం కలిగించడం వంటివి కాలసర్ప దోషానికి దారితీస్తాయి. దాంతోబాటు జన్మ సమయంలో రాహు, కేతు గ్రహాల మధ్యలో ఇతర గ్రహాలు అడ్డురావడం, పితరులకు శ్రాద్ధకర్మలు సక్రమంగా చేయకపోవడం వంటి వాటివల్ల కాలసర్పదోషం సంక్రమిస్తుంది. దురదృష్టం ఏమిటంటే, ఇవి జాతకుడు తాను స్వయంగా ఏ పాపం చేయకపోయినా, వారి వంశవృక్షంలో అటువంటి పనులు చేసినవారున్నా, వారినుంచి వీరికి సంక్రమిస్తాయి.
దీనిమూలంగా వంధ్యత్వం (స్త్రీలలో) నపుం సకత్వం (పురుషులలో), గర్భస్రావాలు, నెల తక్కువ జననాలు, శిశుమరణాలు, కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, పిల్లలకు లేదా పెద్దలకు తీవ్రమైన జబ్బు చేయడం, మానసిక అసమ తుల్యత, బుద్ధిమాంద్యం, సంసార జీవితంలో సమన్వయం లోపించడం, విడాకులు, జీవిత భాగస్వామి ఆకస్మిక మరణం, ఎయిడ్స్, టీబీ, చెవుడు, మధ్యచెవికి ఇన్ఫెక్షన్లు సోకడం, తరచూ యాక్సిడెంట్లు జరగడం, శస్త్రచికిత్సలు చేయ వలసి రావడం, వ్యాపారంలో భారీనష్టాలు చవి చూడటం, దివాలా తీయడం, అప్పులు చేయ వలసి రావడం వంటి పరిణామాలు చోటుచేసు కోవచ్చు.
పరిహారాలు
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి లేదా నాగదేవతకు అభిషేకం చేయడం, అష్టనాగదేవతా పూజ, మంచి పండితులు, శాస్త్రం తెలిసిన పూజారిచేత కుజదోష, కాలసర్పదోష పరిహార పూజ చేయించుకోవడం, నెలనెలా రాహుకేతు పూజ చేయించడం వల్ల పై దోషాలను పరిహరించ వచ్చు. ద్వితీయ జీర్ణోద్ధరణ మహాప్రతిష్ఠ అనం తరం ప్రతినెలా రాహుకేతు పూజ జరుగుతోంది. దాంతో భక్తులు జాతకదోషాలను తొలగించు కునేందుకు, ఆలయంలో పూజలు చేయించు కునేందుకు అనువుగా వుంది. తద్వారా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించగలుగు తున్నారు. ఐసీసీటీ క్యాంపస్లో నాగదేవత ప్రతిష్ఠ భక్తులకు మంచి ప్రయోజనకారిగా ఉందని మేము బలంగా విశ్వసిస్తున్నాము. కమ్యూనిటీ స్వచ్ఛంద సేవకుల ద్వారా ఆలయం అంత కంతకు శోభను, పరిపూర్ణతను, ప్రశాంతతను సంతరించుకోవడం చాలా సంతోషకర పరి ణామం.
Review నాగదేవత గుడీ.