మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకూ కొన్ని మంత్రా లున్నాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మబలుకుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్ర మైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీరామానుజులు వెల్లడించారు.
మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగు తాయని అధర్వణవేదం చెబుతుంది. ‘మన్’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం అని వేదవిజ్ఞానం వివరిస్తోంది. వి్త•••త అర్థంలో, మంత్రం అనేది మానసిక సాధనం. మంత్రాలన్నీ వేదాల్లోని భాగాలు. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారమే మంత్రపుష్పం!
యజుర్వేదానికి చెందిన తైత్తరీయ అరణ్య కంలో మంత్రపుష్పం వివరాలున్నాయి. సర్వ సామాన్యంగా యజ్ఞయాగాల సమయంలో మంత్ర పుష్పాన్ని చదువుతారు. జీవ•లానికి జలం ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైందో మంత్రం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలక మని మంత్రంలో ఉంది. జలం భగవంతుడితో సమానం. అది జీవరాశులన్నింటికీ పునీతం చేస్తుందంటోంది మంత్రపుష్పం!
నీరు ఇహానికి, పరానికి సంబంధించింది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు, భూమిపై జలా లన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది మంత్ర పుష్ప సారాంశం.
పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్తప్రాణి కోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపించజేశాడట. మోక్షమార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నా రాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్ర పుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశ రహితుడని మంత్రపుష్పంలోని మూడోశ్లోకం చెబు తుంది. చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభ విస్తాయి. ఆ సూర్యుణ్ణి సృష్టించింది శ్రీమన్నా రాయణుడే! అందుకే ‘దైవం’ పరంజ్యోతి’ అంటారు. ఆయనే పరబ్రహ్మ ధ్యానం, అది చేసే వాడు రెండు నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.
సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటానుకోట్లు ఉన్నాయని, వాటన్నింటి నమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని మంత్రపుష్పం తెలియజేస్తుంది. మనిషి తానే శక్తి మంతుడినని భావిస్తాడు. అతడి కంటే భూమి గొప్పది. సూర్యకుటుంబం మరెంతో పెద్దది. అలాంటి కుటుంబాలే కోట్లలో ఉన్నా యంటే…బ్రహ్మాండంలో మనిషి స్థానమెంత? పరమాత్మ ముందు మన స్థాయి ఏపాటిదో మంత్రపుష్పం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసు కొంటే, మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ శ్రీమన్నారాయణుడు భవబంధాల నుండి విముక్తి కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
మంత్రపుష్పం ప్రకారం జఠరాగ్ని మధ్య సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగసి ఉంటుంది. దాని నీలి జ్వాల మధ్య ఉరుములోని వెలుగురేఖలా అణువుతో సమానంగా మెరుపు ఉంటుంది. అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని, ప్రాణవాయువుల కలయికే జలమని విజ్ఞాన శాస్త్రమూ వెల్లడిస్తోంది. మానవాళికి సంతోషాన్ని కలగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. ఆయన సముద్ర మథనం సందర్భంలో ఉద్భవించాడు. అందుకే జలం చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తున్నాయి.
పడవకు నీటికి ఉన్నట్లే, దైవానికి – మనిషికి మద్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు, అన్ని జ్ఞానాలకు దేవదేవుడే అధిపతి. ఆకాశం నుండి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా, భక్తులు ఏ దైవానికి సమస్కరించినా, అది కేశవుడికే చెందుతుందని మంత్రం చెబుతోంది. పర బ్రహ్మమే గొప్పవాడని, జగదానంత కారకుడైన ఆ దైవాన్ని స్మరిస్తే అన్ని బంథాల నుంచీ విముక్తి లభిస్తుందని వివరిస్తుంది మంత్రపుష్పం!
Review మంత్ర పుష్పం.