రామ భూమి

శ్రీరాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఆ రామచంద్రుని గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు వెలిశాయి. భక్తుల పాలిట కల్పతరువులుగా నేటికీ అవి విలసిల్లుతున్నాయి. ఆ ఆలయాల విశేషాలను తెలుసుకుంటే అంతా రామమయమేనని అనిపించక మానదు.
రామాయణంలో చెప్పిన ఘట్టాలు, జరిగిన ప్రదేశాలు, భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అక్కడ వెలసిన రామాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అహల్య శాపవిమోచనం పొందిన ఆశ్రమం, రామభద్రుడు గుహుడిని గుండెలకు హత్తుకున్న ప్రాంతం, సీతారామ లక్ష్మణులు వనవాసం చెసిన నెలవు, శూర్పనక ముక్కు, చెవులు కోసిన ప్రాంతం.. ఇలా ఆ శ్రీరాముడు నడయాడిన ఎన్నెన్నో ప్రదేశాలు నేటికీ రామకథను కళ్లకు కడుతున్నాయి.

అయోధ్య

శ్రీరాముని జన్మస్థలంగా అయోధ్య చరిత్ర కెక్కింది. బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన ప్రదేశంగానూ దీనిని అభివర్ణిస్తారు. అవతార పరిసమాప్తి సమయంలో రాముడు ఇక్కడి సరయూ నదిలో మునిగి వైకుంఠానికి చేరుకున్నా డని భక్తుల నమ్మకం.

ఫైజాబాద్‍

ఉత్తరప్రదేశ్‍లోని ఈ ప్రాంతంలోనే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడని చరిత్ర చెబుతోంది. గంగానదికి ఉపనది అయిన ఘాఘ్రా నది ఒడ్డున ఫైజాబాద్‍ ఉంది. రాముడే ఇక్కడే భూమిలో లీనమయ్యాడని స్థానికంగా చెబుతుంటారు.

శృంగభేరిపురం

ఉత్తరప్రదేశ్‍లోని అలహాబాద్‍ సమీపంలో ఈ ప్రాంతం ఉంది. కోదండరామునికి గుహుడు అపరభక్తుడే కాదు మంచి స్నేహితుడు కూడా. అరణ్యవాసానికి వెళ్తున్న సీతారామ లక్ష్మణులను గుహుడు గంగానదిని దాటించింది ఇక్కడే. రాము లోరు తన మిత్రునికి గుండెలకు హత్తుకున్న చోటు కూడా ఇదే.

సర్బన

కర్ణాటకలోకి బెల్గావ్‍కు సమీపంలో సర్బన ఉంది. రామలక్ష్మణులు ఇక్కడ అడవిలో తిరుగు తుండగా ఓ సరోవరం కనిపిస్తుంది. అదే పంపా సరోవరం. దీని పక్కనే శబరి ఉంటుండేది. రాముడికి భక్తి పారవశ్యంతో తాను ఎంగిలి చేసిన పండ్లను శబరి తినిపించింది ఈ సరస్సు ఒడ్డునే.

చిత్రకూటం

ఉత్తర, మధ్యప్రదేశ్‍ సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. ప్రకృతి శోభలో అలరారే ఈ ప్రాంతంలోనే వనవాస వేళ సీతారాములు తిరిగినట్టు చెబుతారు. వారు స్నాన, తపాలు ఆచరించిన ప్రదేశాలు, విశ్రాంతి తీసుకున్న కుటీరాలు ఇక్కడ కనిపిస్తాయి. అందమైన మందాకిని నది ఇక్కడే ఉంది.

బక్సర్‍

బిహార్‍లో ఉంది. రామలక్ష్మణులకు విశ్వా మిత్రుడు అస్త్రవిద్యలు నేర్పింది ఇక్కడే. ఇక్కడే తాటక సంహారం జరిగింది. బక్సర్‍కు 6 కి.మీ. దూరంలోని అహిరౌలి ప్రాంతంలోనే అహల్య శాపమోచనం పొందిందని అంటారు.

పంచవటి

శూర్పనక ముక్కు, చెవులు కోసిన స్థలంగా పంచవటిని చెప్పుకుంటారు.

ధనుష్కోటి

రామేశ్వరం వద్ద ఉంది. రావణుని సోదరుడు విభీషణుడు రాముడి శరణు కోరిన స్థలమిదే. ఇంకా భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థ, రామగిరి, దండకారణ్యం వంటి ఎన్నో ప్రదేశాలు రామాయణ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.

సీతామర్హి (బిహార్‍)

సీతాదేవి భూమిలో దొరికిన చోటు.

జనక్‍పూర్‍ (నేపాల్‍)

సీతమ్మ పుట్టినిల్లు. సీతా సమాహిత స్థల్‍: సీతాదేవి భూమాతలో ఐక్యమైనదిక్కడే.

రాముడు – వాగ్భూషణుడు

ఇతర ఆభరణాలన్నీ నశించిపోయేవే. ఈ లోకంలో శాశ్వతమైన భూషణం వాగ్భూషణమే. శ్రీరాముడిని వచస్విగా, ‘వాగ్మి’ (చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదు భాషి. మితభాషి. మధురభాషి. పూర్వ భాషి. స్మితపూర్వ భాషి అని వాల్మీకి ప్రశం సించాడు. తానే ముందుగా పలకరించడం, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆవేశానికి లోను కాకుండా మాట్లాడగలగడం రాముని ప్రధాన లక్షణాలు. రాముడు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరిచే వాడు. కొద్ది నిమిషాలు ఎదుటి మనిషితో మాట్లాడగానే అతని వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని అంచనా వేయగలిగే సామర్థ్యం రాముని సొత్తు. కిష్కింధకాండలో హను మంతుడు తొలిసారిగా యతి వేషంలో కలిసి రామునితో పరిచయ వాక్యాలుగా నాలుగు మాటలు మాట్లాడతాడు. అప్పుడే అతని సామర్థ్యాన్ని గురించి రాముడు కచ్చితమైన అంచనా వేస్తాడు. తన ఎదుట ఉన్న వ్యక్తి (హనుమంతుడు) వేదవేత్త అని, వ్యాకరణ నిపుణుడనీ, మాట్లాడేటపుడు అతని శరీర భంగిమలు (బాడీ లాంగ్వేజ్‍), మాట్లాడే విధానం అతనిని ఒక అసాధారణ ప్రతిభా సంపన్నుడిగా తెలియ చేస్తున్నాయని, ఇటువంటి వ్యక్తి సహాయ కుడి (మంత్రి)గా ఉంటే ఆ రాజుకు అసాధ్యమైన దేదీ ఉండదని రాముడు లక్ష్మణుడితో చెబు తాడు. దీనిని బట్టే రాముని సూక్ష్మబుద్ధి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు

Review రామ భూమి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top