వట్టి చేతులతో పోకూడదు

కొన్నిచోట్లకు ఉత్తిచేతులతో వెళ్లకూడదని శాస్త్రం- ఏదో ఒకటి తీసుకొని వెళ్లటం అవసరం. మనకున్న భక్తినీ, ప్రేమను, కృతజ్ఞతనూ చాటుకొనే సాధనాలు ఇవి. ఆ సందర్భాలు ఏమిటో వివరించే శ్లోకం ఇది.
శ్లో।। అగ్నిహ•త్రం గృహం క్షేత్రం
గర్భిణీవృద్ధబాలకాన్‍ ।
రిక్తహస్తేన నోపేయాత్‍
రాజానం దైవతం గురుమ్‍ ।।
యజ్ఞయాగాలు జరిగే స్థలాలకు వెళ్ళినప్పుడు, పర్యటన వ•గించుకుని తన ఇంటికి వెళ్ళినప్పుడు, వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడూ, యాత్రాస్థలాలైన క్షేత్రాలకు వెళ్లేటప్పుడు, గర్భిణీస్త్రీలను, వృద్ధులను, పిల్లలను చూడ్డానికి వెళ్లినప్పుడు, అలాగే రాజ దర్శనం, దైవదర్శనం, గురుదర్శనం కోసం వెళ్లే టప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు.
యజ్ఞ యాగాలు, పూజలు చూడ్డానికి ఎందరో వస్తారు. వారందరికీ ఆహారాది వ్యవస్థలు చెయ్యాలి. అందరూ తలోచేయీ వేసినప్పుడే లోకహిత కార్యాలు విజయ వంతమవుతాయి. అందుకని అక్కడికి వట్టి చేతులతో కాక ఫల, పుష్ప, దక్షిణాదులతో వెళ్లాలని శాస్త్రం. వృద్ధులను, బాలలన• రోగగ్రస్థులను చూడ్డానికి వెళ్లినప్పుడు ఏదైనా తీసుకొని వెళ్లటం వారికి మానసిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే గుడి, గురువులు, స్వామీజీల దగ్గరకి కూడా అనేకమంది ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు వస్తుంటారు. మనమిచ్చిన ఫలాలు మనముందే అందరికీ పంచి ఇచ్చే దృశ్యం మనకు సుపరిచితమే.
ఊరెళ్లి వచ్చిన వారిని, ‘నాకేం తెచ్చావ్‍’ అని కుటుంబసభ్యులు అడిగే సందర్భాలు చూస్తూంటాం. వారికి నిరుత్సాహం కల్గించ కూడదు. వారి అభిరుచికీ, అవసరానికి తగిన వస్తు వుని తీసుకొని వెళ్లటం మనకీ, వారికీ ఆనందకర మైన విషయమే. ఈ విధంగా అన్ని వేళలా యోగ్యానుసారం అందరికీ ఏదో ఒకటి ఇస్తూ సాగే జీవితం ధన్యం.

Review వట్టి చేతులతో పోకూడదు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top