కార్తీకమాస విశేషాలు

ఔషధ గుణాలున్నాయి. ఉసిరికాయతో చేసిన పదార్థాలను తింటే శరీరానికి అనేక విధాల మేలు కలుగుతుంది. ఉసిరిక శీతగుణం కలది. తీపి, పులుపు, కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే వేడిని పోగొడుతుంది. కండ్ల మంటలు, పాదాల మంటలు తగ్గుతాయి. అరుచిని పోగొడుతుంది. దాహం తగ్గుతుంది. ఉసిరికాయను ఏదో ఒక రూపంలో రోజూ ఆహారంలో తీసుకోవచ్చు.

కార్తీక సోమవారం: కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ నెలలో సోమవారం వ్రతం చేసే వారు పరమశివుని అనుగ్రహానికి పాత్రులై, శివ సాయుజ్యాన్ని పొందుతారు. సోమవారం తెల్లవారుజామునే స్నానం చేసి దీపం పెడతారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి కార్తీక సోమవారం నాడు పొద్దుటి నుంచి అభిషేకాలు చేసి, సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలు వచ్చాక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత తింటారు.

కార్తీకంలో నదీ స్నానం: కార్తీక మాసంలో వాతావరణ మార్పు వల్ల సంభవించే చిన్న చిన్న రుగ్మతులను నాశనం చేసే గుణం మనకు గల ఏడు ప్రధాన నదుల్లోని నీటిలో ఉంది. అందుకే ఈ నదుల్లో కృత్తిక నక్షత్రం వెళ్లిపోకుండా సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేస్తే మంచి ఆయు రారోగ్యాలు కలుగుతాయి. ఈ నెలలో తెల్లవారుజామున మెడ వరకు నీటిలో మునిగి కొంత సమయం ఉండి స్నానం చేస్తే ఉదర సంబంధ వ్యాధులు నయం అవుతాయని శాస్త్రం చెబుతోంది.

తులసి, ఉసిరిక.. పరమ పవిత్రం: కార్తీక మాసంలో పూజనీయమైనవి ఉసిరి, తులసి. ఈ రెండూ పరమ పవిత్రమైనవి. తులసి చెట్టు గాలి వలే ఉసిరిక చెట్టు నీడ, గాలి చాలా ఆరోగ్యకరమైనవి. కార్తీక మాసంలో వన భోజనాలు, వన సంతర్పణలు ఉసిరి చెట్టు నీడనే జరపడం ఈ చెట్టుకున్న ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. అదీగాక, ఈ రెండు చెట్ల ప్రాముఖ్యత తెలిపేలా ఉసిరి, తులసి ఒకేచోట పుట్టినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. ధాత్రి అనేది ఉసిరిక గల మరో పేరు. క్షీరాబ్ధి ద్వాదశి నాడు కాయలతో కూడిన దీని కొమ్మను తులసితో కలిపి పూజించడం ఆచారం.

పూర్ణముల నోము: కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటారు. ఈ కారణంగానే ఈ మాసానికి కార్తీకమనే పేరొచ్చింది. ఈ రోజు పుణ్య నదుల్లో స్నానం చేసి జపాలు, పూజలు చేస్తారు. 33 పూర్ణముల నోము అంటూ కార్తీక పౌర్ణమి నాడు స్త్రీలు నోములు చేస్తారు. ఈ రోజు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు. అన్న సంతర్పణలు చేస్తారు. పౌర్ణమి నాడు సాయంత్రం పూర్ణ చంద్రుడు వచ్చాక ఎవరైతే పూజలు చేస్తారో వారింట్లో శ్రీ మహా విష్ణువు లక్ష్మీసమేతుడై కొలువు ఉంటాడని ప్రతీతి. ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో కళకళలాడుతుంది.

ద్వాదశి.. దీప ఫలం: కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును భక్తితో పూజిస్తారు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. ఆ పరమాత్మకు పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. ఉసిరితో తినే పదార్థాలను తయారు చేస్తారు.

Review కార్తీకమాస విశేషాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top