గాయత్రీ మంతద్రష్ట… విశ్వామిత్ర

గాయత్రీ మంత్రం గురించి అందరికీ తెలుసు. కానీ ఈ మంత్రకర్త ఎవరో తెలుసా?..
ఈ అద్భుత మంత్రాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి.. విశ్వామిత్రుడు. ఈయన పేరు ప్రఖ్యాతులు లోకానికి విఖ్యాతమే. కొత్తగా పరిచయం అవసరం లేదు. మహా తపస్సంపన్నుడైన భృగు మహర్షి కుమారుడైన రుచీకుని కుమారుడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుని పుట్టుక చాలా విలక్షణమైనది. ఈ వివరాలు మహా భారతంలో, పలు పురాణాలలో ఉన్నాయి. విశ్వామిత్రుని మాతా మహుడు గాధి అనే మహారాజు. సత్యవతి అనే సద్గుణ సంపన్నురాలైన ఆయన కుమార్తెను రుచీకునకు ఇచ్చి వివాహం చేశారు. ఒకనాడు రుచీకుడు మంత్రించిన చెరుకును తీసుకొచ్చి సత్యవతికి ఇచ్చాడు. దానిని రెండు ముక్కలు చేసి ఒకటి సత్యవతిని, రెండోది గాధి భార్యను తీసుకొమ్మని చెప్పాడు. దానిని తీసుకుంటే గాధికి క్షత్రియపుత్రుడు, సత్యవతికి తపస్సంపన్నుడైన కొడుకు పుడతాడని చెప్పాడు. అయితే సత్యవతి ఆ చెరుకు ముక్కలను పొరపాటున తారుమారు చేసింది. దీంతో గాధి పత్నికి చెరుకు ప్రభావంతో విశ్వామిత్రుడు పుట్టాడు. సత్యవతికి జగదగ్ని పుట్టాడు. ఇది దైవవిధిగా రుచీకుడు భావించాడు. తన తపశ్శక్తితో బ్రహ్మను సైతం మెప్పించిన విశ్వామిత్రుడు.. రాజర్షిగా, ఆపై బ్రహ్మర్షిగా స్థానం పొంది లోకపూజ్యుడయ్యాడు.

విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో అనేక వేద మంత్రాలను దర్శించాడు. ఇన్ని మంత్రాల ద్రష్ట ఆయనొక్కడే. రుగ్వేదంలోని పది మండలాల్లో మూడవ మండలాన్ని వైశ్వామిత్ర మండలం అంటారు. ఇందులో 62 సూక్తులు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ విశ్వామిత్రుడు చేసినవే. ఈ తృతీయ మండలంలో ఇంద్ర, అదితి, అగ్నిపూజ, ఉష, అశ్వని, రుభు మొదలైన వారి స్తోత్రాలున్నాయి. అనేక జ్ఞాన, విజ్ఞాన ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి. గోమాత వర్ణణ ప్రాశస్త్యాలు ఉన్నాయి. ఈ వైశ్వామిత్ర మండలంలో బ్రహ్మ గాయత్రీ మంత్రాన్ని ఆయన స్వయంగా దర్శించి, ఆపై లోకానికి అందిం చాడు. విశ్వామిత్రుని వల్లనే వైశ్వామిత్ర మండలం, తృతీయ భాగం 62వ సూక్తిలో పదవ మంత్రం గాయత్రీ మహా మంత్రంగా విఖ్యాతి గాంచింది.

‘ఓం భూర్‍ భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి థియోయోనః ప్రచోద యాత్‍’.. విశ్వామిత్రుడే లేకపోతే ఈ గాయత్రీ మంత్రం మనకు లభించేదే కాదు. ఇది అన్ని వేద మంత్రాలకు మూలమైన మంత్రం. అన్ని మంత్రాలకూ బీజం.

విశ్వామిత్రుడు సమ్హిత, విశ్వామిత్ర స్మ•తి అనే గ్రంథాలలో గాయత్రీదేవి యొక్క ఆరాధన, వర్ణనలను సొగసుగా చేశాడు. గాయత్రీ మహా మంత్ర జపంతో అన్ని మంత్రాల యొక్క జపసిద్ధి కలుగుతుంది. ఆయన గాయత్రీదేవి అనుగ్రహం వల్లనే సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తి లభించింది.
గాయత్రీ మాత రూపు ఏమిటి? స్వరూప మేమిటి? ఆమెను ఎలా ఆరాధించాలి?.. ఈ విషయాలన్నీ మనకు తెలియచేసిన ప్రథమ గురువు విశ్వామిత్ర మహర్షే.

ముక్తావిద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖైః
స్త్రీ క్షణైః యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం
తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాం కుశ
కశాంశుభ్రం కపాలం గుణాంశంఖం చక్ర మదార
విందయుగళం హస్తైర్వహంతీం భజే ।।

ఆ తల్లి ముత్యాలు, మణిమాణిక్యాలు, ముంగాలు, బంగారం, నీలమణి, ఉజ్వల కాంతితో సమానమైన ఐదు ముఖాలతో మెరుస్తూ ఉంటుంది. ఆవిడ మూడు నేత్రాలతో విరాజిల్లు తుంటుంది. ఆవిడ ముఖకాంతి అనుపమానం. ఆవిడ రత్నమయ కిరీటంలో చంద్రుడు ప్రకా శిస్తుంటాడు. ఆవి 24 కాంతులతో ప్రకా శిస్తుంటుంది. ఆవిడ వర ప్రదాయిని. గాయత్రీ మాత చేతులలో అంకుశం, వరదముద్ర కుశ, పాశ, శుభ్రం కపాలము, గద, శంఖం, చక్రం, రెండు కమలాలు ఉంటాయి.
ఈ పరమ పవిత్రమైన మంత్రాన్ని, ఈ మంత్రం మూల దేవత అయిన గాయత్రీదేవిని లోకానికి పరిచయం చేసి పునీతులను చేసిన వాడు విశ్వామిత్రుడు. ఆయన ఇదే కాదు ఎన్నో శాస్త్రార్థాలను విశదీకరించి లోకానికి చాటాడు. గోమాల పవిత్రత, మహిమ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కానీ, దాని గొప్పదనాన్ని వేద కాలంలోనే చెప్పిన వాడు విశ్వామిత్రుడు మాత్రమే.

Review గాయత్రీ మంతద్రష్ట… విశ్వామిత్ర.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top