ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపాల నుంచి విముక్తి చెంద డానికి ఏదైనా మార్గాన్ని, తరుణోపాయాన్ని తెలపండి’ అని కోరిందట. గోమాతకు చేసిన పూజల వలన కలిగే ఫలితాల గురించి అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఈ విధంగా చెప్పాడట.
‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. గోవు పాదాల యందు పితృదేవతలు, కాళ్ల యందు సమస్త పర్వతములు, భ్రూ మధ్యమున గంధర్వులు, దంతముల యందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ల యందు సూర్యచంద్రులు, చెవుల యందు శంఖు చక్రములు, కంఠమునందు విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవ గ్రహములు, వెన్ను యందు వరుణ దేవుడు, అగ్ని దేవుడు, తోక యందు చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమముల యందు ముక్కోటి దేవతలు నివ సిస్తారు.
అందువల్ల గోమాతను పూజించి పాపాలను పోగొట్టుకుని, ఆయురారోగ్యములను, అష్టైశ్వర్యా లను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్య ఫలం కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యం కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణం చేస్తే భూ మండలమంతా ప్రదక్షిణం చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తూ శివుడు పార్వతికి గోమాత పూజా ఫలాలను గురించి తెలిపాడు.
ధన సంపాదన ఎలా ఉండాలి?
మనం ధనానికి దాసులం అయితే, దైవానికి క్రమంగా దూరం అయిపోతున్నట్టు.
బొట్టు బొట్టుగా ఆగకుండా పడే నీటితో కుండ నిండుతుంది. అందులోని నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే జ్ఞానం, ధనం, పుణ్యం పోగు చేయడానికి కూడా అలాంటి మార్గమే అనుస రించాలి.
ధనవంతునిగా అయ్యేందుకు కాకుండా, ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి.
ధనం నుంచి గుణం రాదు. కానీ, సద్గుణాలు అలవర్చుకుంటే ధనంతో పాటు తనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. మనం సంపాదించిన డబ్బును మనం శాసించగలిగితే మనం నిజమైన శ్రీమంతులం. కానీ, మన ధనం మనల్ని శాసిస్తుంటే, మనం ధనానికి దాసులం. అప్పుడు మనకు తెలియకుండానే దైవానికి దూరం అవుతున్నట్టు లెక్క.
కష్టాలు, విఘ్నాలు మనసును బలహీనపరుస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి?
మనం ఎప్పుడూ విజయాన్నే కోరుకోవడం వల్ల బాధకు లోనవుతున్నాం. కష్టాలు, విఘ్నాలు కొందరికే పరిమితం కాదు. అవి అందరినీ ఏదో సమయంలో పలకరిస్తూనే ఉంటాయి. బాధైనా, కోపమైనా మితంగానే ఉంటాయి.
ఎవరికైనా రోజూ కష్టాలే ఉండవు. కాకపోతే వాటినే ఎక్కువగా గుర్తుంచుకుని బాధపడు తుండటం వల్ల ముందుకు వెళ్లలేకపోతుంటాం. మనకు లభించిన సంతోషాలను మనం గుర్తుంచు కోవడం లేదు. లేదా అత్యాశ వల్ల పట్టించుకోవడం లేదు. మన విధానం ఎలా ఉండాలో తెలియ చెప్పడమే అవతార పురుషుల ఆంతర్యం. శ్రీరాముడు, హనుమంతుడు కూడా సీతాదేవి విష యంలో అంతులేని బాధను అనుభవించారు. ఆమె కనిపించలేదని హనుమంతుడు చనిపోవాలని కూడా అనుకున్నాడు.
కష్టాలు, విఘ్నాలను తట్టుకోవడంలోనే మన మనో నిగ్రహం తెలుస్తుంది. శ్రీరాముడు సీతాదేవి కోసం దు:ఖించాడే తప్ప అలాగే చింతిస్తూ కూర్చుండి పోలేదు. అంత బాధలోనూ తన కర్తవ్యాన్ని విస్మరించనంత ధీరత్వంతో ఉన్నాడు. విజయం కోసం ఆయన వెంపర్లాడలేదు. కేవలం ధర్మంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. అదే మనకు సద్బోధ.
అందుకే మనం వదలాల్సింది.. కర్తవ్యాలను కాదు. మన కర్మలను వదులుతూ జీవన గమ నాన్ని కొనసాగించాలి.
Review గోమాతను పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?.