అందంగా ఉంటే అందరూ చూస్తారని.

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.

హైదరాబాద్‍ దక్కనీ ఉర్దూ భాషా సాహిత్యాల్లో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. భాషా సాహిత్యంలోనూ, వాడుకలోనూ సమయానుకూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబగులు అద్దాయి. దక్కనీ జన జీవితంలో ఉన్న ఉర్దూ సామెతల సమాహారమే.. ఉర్దూ భాషా సౌందర్యానికి ప్రతీక. జీవన విలువలను, వ్యక్తిత్వ పాఠాలను నేర్పే ఆ సామెతలివిగో.

జిత్నా మూ ఉత్నీ బాత్‍
చోటా మూ ఔర్‍ బడీ బాత్‍

మన స్థాయికి తగినట్టు మాట్లాడాలి. చిన్న నోట పెద్ద మాటలు మాట్లాడకూడదని పై సామెతల్లోని భావం. మన స్థాయికి తగినట్టు మన మాటలు లేకపోతే మన వెనుక ‘కోతల రాయుడు’, ‘డప్పుల సుబ్బారాయుడు’ అంటూ జనం గేలి చేస్తారు. పైగా చెడ్డపేరు కూడా వస్తుంది. మనలో చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడు తుంటారు. ఫలానాది కచ్చితంగా జరిగి తీరు తుంది, అది అలాగే జరిగి తీరుతుంది, నేను ఇప్పుడే ఫలానా గొప్ప వ్యక్తితో మాట్లాడాను అంటూ చాలా గొప్పలు మాట్లాడుతుంటారు. అంతా తమకే తెలుసన్నట్టు, తాము చెప్పినట్టే జరుగుతుందన్నట్టు చెబుతారు. అటువంటి వారిని ఉద్దేశించి పై సామెతలను ఉపయోగిస్తుంటారు.

హాత్‍ కీ కంగన్‍ కో అయినా క్యోం?

ముంజేతి కంకణానికి అద్దం అవసరమా? అనే భావంలో పై సామెతను వాడుతారు. గాంధీజీ మన దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టారు. కానీ ఆయన ఎప్పుడూ తానే స్వాతం త్య్రాన్ని తెచ్చానని చెప్పుకోలేదు. ఎందుకంటే ఆ అవసరం ఆయనకు లేదు. కానీ, ఆయన కృషి వల్లనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే విషయం అందరికీ తెలుసు. గొప్పవాళ్లు తాము చేసిన ఘనత గురించి ప్రత్యేకించి చెప్పుకోరు. ఆ అవసరం కూడా వారికి లేదు. కానీ, ఏ ఘనతా లేని వారు మాత్రం డాంబికాలు పలుకుతారు. చేసింది చిన్న పనైనా దాని గురించి గొప్పగా చాటుకోవాలని తాపత్రయ పడతారు. అటువంటి వారిని ఉద్దేశించి పై సామె తను వాడుతుంటారు.

దాల్‍ మే కాలా
ఎక్కడో ఏదో లోపం ఉందన్న అనుమానం వ్యక్తం చేయడానికి వాడే సామెత ఇది. నిజ నిర్ధా రణకు ఈ అనుమానం మొదటి మెట్టు. ఉదా హరణకు మీరు ఏదైనా ఒక రహస్యం గురించి వెల్లడించారనుకోండి. అయితే, దానిపై అనేక అను మానాలున్నాయంటూ పలువురు స్పందించవచ్చు. అటువంటి అనుమానం వ్యక్తం చేయడానికి ఈ సామెతను ఉదహరిస్తుంటారు.
ఇల్లు ఇరకాటం.. అలి మర్కటం
పూర్వం ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతను బాగా సంపాదించే వాడు. కానీ ఎప్పుడూ ఏమీ లేనట్టుగా కనిపించే వాడు. ఒక చిన్నపాటి ఇంటిలో నివాసం ఉండేవాడు. కాస్త సదుపాయంగా ఉండే ఇంటిలో ఉండొచ్చు కదా అంటే.. ఇల్లు పెద్దగా ఉంటే బంధువులు వచ్చి తిష్ట వేస్తారు.. ఇరుకుగా ఉంటే ఎవరూ రారు అనేవాడు. ఒకరోజున అతను పెళ్లి చేసుకుని తన ఇంటికి భార్యతో కలిసి వచ్చాడు. ఈ పీనాసి వాడు ఎలాంటి పిల్లను చేసుకున్నాడో చూద్దామని అందరూ చూడ్డానికి ఎగబడ్డారు. చూస్తే.. ఆ పిల్ల అంద వికారంగా ఉంది. కాస్త అందమైన పిల్లను చేసుకోవచ్చు కదయ్యా అంటే.. అందంగా ఉంటే అందరూ చూస్తారు. ఇలా ఉంటే ఏ టెన్షనూ ఉండదంటూ పళ్లు ఇకిలించాడట. ఊరి జనాలకు నవ్వాలో, ఏడ వాలో అర్థం కాలేదు. అప్పటి నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది

Review అందంగా ఉంటే అందరూ చూస్తారని..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top