చీమ – మిడత

ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్లి తన పుట్టలో దాచి పెట్టుకోవడంలో నిమగ్నమై ఉండేది.
మిడత మాత్రం హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది. పంటల మీద వాలి, తిన్నంత తిని, పాడుచేసినంత పాడు చేసి ఆనందిస్తుండేది.
ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళ్తున్న చీమను చూసి మిడత పకపకా నవ్వింది.
చీమకు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో మిడతను ఇలా ప్రశ్నించింది –
‘ఓసీ పొగరుబోతు మిడతా! ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు?’.
మిడత మరింత వెకిలిగా నవ్వుతూ ఇలా బదులిచ్చింది-
‘నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది. నువ్వెంత? నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడూ ధాన్యం లాక్కెళ్లి పుట్టలో పెట్టు కుంటూ రోజంతా శ్రమపడతావు? నాలాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా?’.
మిడత మిడిసిపాటుకు మనసులోనే చింతిస్తూ చీమ ఏం సమాధానం చెప్ప కుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కోతలు పూర్తయి పంటలన్నీ రైతుల ఇళ్లకు వెళ్తున్న సమయం అది. అంతలో భారీ వర్షాలు వచ్చాయి. పొలాలన్నీ బురదతో నిండిపోయి చిందరగా మారాయి. పరిసరాల్లోని చెట్లు కూడా కూలిపోయాయి. మిడతకు ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి దొరకలేదు.
అప్పుడు మిడత చీమ వద్దకు వచ్చి- ‘మిత్రమా! వర్షంలో తడిసిపోతున్నాను. ఆకలికి చచ్చిపోతున్నాను. కన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు. నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు’ అని ప్రాధేయ పడింది. చీమ పకపకా నవ్వి- ‘వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్ర త్తగా ఆహారం దాచుకున్నాను ఇప్పుడు వెచ్చగా, హాయిగా తింటూ ఇంట్లో తలదాచు కుంటున్నాను’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.
నీతి: ముందుచూపు అవసరం.

Review చీమ – మిడత.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top