
శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల సంవత్సరాల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడు’ అనే బిరుదు కూడా ఉండేది. అముక్తమాల్యద రాయల వారు రచించిన గొప్ప కావ్యం.
శ్రీకృష్ణ దేవరాయలు వద్ద ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారు. వారిని ‘అష్ట దిగ్గజాలు’ అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయ గారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల వారి ఆస్థాన కవి దిగ్గజాలు. ఆయన సభకు ‘భువన విజయం’ అని పేరు.
ఒకసారి రాయల వారి వద్దకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతను అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ, సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయల వారు తన ఆస్థాన కవి దిగ్గజాలను ఈ సమస్యను విడగొట్టాలని కోరారు.
మొదట ‘ఆంధ్ర కవితా పితామహుడు’గా పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా అతని భాష ఏదో తేల్చలేకపోయాడు.తరువాత మరో ఆరుగురు దిగ్గజాలు కూడా ఆ పండితుని మాతృభాష ఏదో గుర్తించలేక పోయారు.
చివరకు తెనాలి రామకృష్ణుడి వంతు వచ్చింది. ధారాళంగా అన్ని భాషలనూ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్లాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఇక, తమ కవి దిగ్గజాలకు ఓటమి తప్పదని రాయల వారు భావించారు. ఆ ఉద్ధండ పండితుడు కూడా తను విజయం సాధించబోతున్నట్టు ఉప్పొంగిపోతున్నాడు.
అంతలో అకస్మాత్తుగా తెనాలి రామకృష్ణుడు ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు ‘అమ్మా!’ అని గట్టిగా అరిచాడు.
అంతే.. ‘నీ మాతృభాష తెలుగు పండి తోత్తమా!’ అని తేల్చేశాడు తెనాలి రామ కృష్ణుడు. పండితుడు నిజం ఒప్పుకోక తప్ప లేదు. రాయల వారి ఆనందానికి అంతేలేదు.
‘శభాష్ వికటకవీ!’ అని రామకృష్ణుడిని మెచ్చుకుని బహుమానంగా సువర్ణహారం అందించారు. మాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కానీ, విషాదంలో కానీ మన నోటి నుంచి వెలువడేది మాతృభాషే. కన్నతల్లిలా, మాతృ భూమిలా, మాతృభాష మధురమై
Review వింత పరిష్కారం.