అమెరికా లో తెలుగు వెలుగు

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఊహించనంత వేగంగా పెరుగుతోందని సెంటర్‍ ఫర్‍ ఇమ్మి గ్రేషన్‍ స్టడీస్‍(సీఎమ్‍ఎస్‍) గణాంకాలు తెలియ జేస్తున్నాయి. ఈ సంస్థ 2018లో నిర్వ హించిన ఒక అధ్యయనం ప్రకారం 2010-2017 సంవత్సరాల మధ్య అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగిందని ఈ సర్వే వివరాలు వెల్లడిస్తు న్నాయి.

తెలంగాణ, ఆంధప్రజల మాత•భాష అయిన తెలుగుభాష అమెరికాలో విస్త•తంగా విస్తరిస్తున్న విదేశీ భాషల్లో అగ్రస్థానంలో ఉందని ఇక్కడ దాదాపు 400,000 మందికి పైగా తెలుగు భాషను మాట్లాడు తున్నారని సీఎమ్‍ఎస్‍ ఫలితాలు వివరిస్తున్నాయి. ఇంకా ప్రముఖ భారతీయ భాషలైన హిందీ, గుజరాతీ భాషలు మాట్లాడే వారి సంఖ్య కూడా గణ నీయంగా పెరుగుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో బెంగాలీ, తమిళం మాట్లాడేవారి సంఖ్య పైన చెప్పిన వాటితో పోలిస్తే తక్కువైనప్పటికీ వేగంగా విస్తరిస్తున్న భాషల్లో అవి కూడా ఉన్నాయి. ఈ రెండు భాషలు మాట్లాడేవారి సంఖ్య 350,000, 280,000గా ఉంది.
అమెరికాలో విస్తరిస్తున్న తెలుగుభాష

అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న విదేశీ భాషల వ•ద్ధి శాతం
(2010-2017 మధ్య)
తెలుగు 86 శాతం
అరబిక్‍ 42 శాతం
హిందీ 42శాతం
ఉర్దూ 30 శాతం
చైనీస్‍ 23 శాతం
గుజరాతీ 22శాతం
హైతియన్‍ క్రియోల్‍ 19శాతం

2000 సంవత్సరానికి ముందు అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 87,543 మాత్రమే. 2014 వరకూ దాదాపు ఇదే స్థితి. ఆ తరువాత పరిస్థితులు మెరుగయ్యాయి. అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య క్రమంగా పెరిగి ఆ సంఖ్య 222,977కు చేరుకుంది. జనాభా లెక్కల సంస్థ గణాంకాలను అనుసరించి తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 415,414 గా ఉందని, ఇది అనూహ్య మైన వ•ద్ధి అని సీఎమ్‍ఎస్‍ తెలియజేసింది.
హిందీ మాట్లాడేవారూ ఎక్కువే

అయితే తెలుగు మాట్లాడే వారు అమెరికాలో ఎక్కువగా ఉన్నప్పటికీ అమెరికాలో విస్తారంగా మాట్లాడుతున్న భాష హిందీ. చైనీస్‍, అరబిక్‍ తర్వాత అత్యధికులు తమ ఇళ్లలో ఎక్కువగా మాట్లాడుతున్న మూడో భాష హిందీ. 2010 నుంచి 2017 మధ్య ఈ సంఖ్య పెరిగినట్లుగా గణాంకాల ద్వారా తెలుస్తోంది.
2010 నుంచి 2017 మధ్య పెరిగిన విదేశీభాషలు మాట్లాడే వారి సంఖ్య

చైనీస్‍ 653,000
అరబిక్‍ 363,000
హిందీ 254,000
తెలుగు 192,000
టాగలాగ్‍ 173,000
హైతియన్‍ క్రియోల్‍ 140,000
బెంగాలీ 128,000
ఉర్దూ 118,000
వియత్నామీస్‍ 117,000

భారత్‍లో ఇంగ్లీష్‍ – అమెరికాలో తెలుగు

మొత్తానికి అమెరికా జనాభా మొత్తంలో తమ ఇళ్లలో విదేశీ భాషలు మాట్లాడేవారి శాతం 21.8 శాతంగా ఉందని సీఐఎస్‍ తెలిపింది. దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో సగానికి పైగా వలస దారులు విదేశీ భాషలు మాట్లాడుతున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా అమెరికాలో ఇంగ్లీషు మాట్లాడేవారి సంఖ్య కంటే భారత్‍లో ఇంగ్లీషు మాట్లాడే వారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ కావటం విచిత్రం.

అమెరికాలో వెలుగులు చిమ్ముతున్న తెలుగుతేజం

అమెరికాలో భారతీయులు అందునా తెలుగువారి పేరు ప్రఖ్యాతులు ఆ దేశం నలుమూలలా విస్తరించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే దక్షిణ భారత దేశం నుంచి ఇక్కడికి వచ్చిన తెలుగువారు టెక్‍ మరియు ఇంజనీరింగ్‍ రంగాలలో ప్రధాన పాత్ర వహిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరా బాదు నుంచి వేలాది మంది ఇంజనీర్లు అమెరికాకు వలసవచ్చారు. 2008-2012 మధ్యలో 90,000 మంది విద్యార్థులు అమెరికాకు వలస వచ్చారని వారిలో అత్యధికులు సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‍, గణిత రంగాల్లో ఉన్నత విద్యను అభ్య సించేందుకు వచ్చినవారే నని బ్రూకింగ్‍ ఇన్‍స్టిచ్యూన్‍• నివేదిక తెలియజేస్తోంది.

అమెరికాలో తెలుగు వారి విజయకేతనం

దక్షిణ భారతం నుంచి ఇక్కడకు ఉపాధి, ఉద్యోగాల కోసం వలస వచ్చిన వారిలో విజయ పథంలో దూసుకుపోతూ ఆయా రంగాల్లో అగ్ర స్థానాల్లో కొనసాగుతున్న వారు ఎందరో. ఉదాహరణకు ప్రపంచ సాఫ్ట్వేర్‍ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీయీవో సత్య నాదెళ్ల తెలుగువాడే. అడోబ్‍ సిస్టమ్స్ సీఈవో శంతనునారాయణ్ది మన భాగ్యనగరమే. వీరి స్పూర్తితో తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది యువత తమ అమెరికా కల నెరవేర్చుకునేందుకై ఇక్కడికి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
సాఫ్ట్వేర్‍లోనే కాదు ఇతర రంగాల్లోనూ మేటే

తొమ్మిది నుంచి ఐదు దాకా పనిచేసే, వేలాది రూపాయలు సంపాందించగలిగే సాఫ్ట్వేర్‍ రంగం లోనే కాక ఇతర రంగాలలోనూ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇక్కడి నుంచి అమెరికా వలస వస్తున్న వారూ ఉన్నారు. తమ ప్రజ్ఞా పాటవాలతో, శక్తి సామర్థ్యాలతో ఆయా రంగాల్లో మేటిగా నిలుస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన రెండో తరం తెలుగువారు ఈ వరుసలో ముందున్నారు. మిస్‍ అమెరికా 2013 కిరీటాన్ని గెలుచుకున్న నీనా దావులూరి ఈ కోవలోకే వస్తారు. ఆంధప్రదేశ్‍లోని విజయవాడకు చెందిన నీనా ఈ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి అమెరికన్‍-ఇండియన్‍గా పేరు ప్రఖ్యాతులు పొందారు. నీనా తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు. వారు 1980 ప్రాంతాల్లో అమెరికా వలస వచ్చి ఇక్కడ.

Review అమెరికా లో తెలుగు వెలుగు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top