పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకి, కాలక్షేపానికి మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
పిల్లల్లారా.. పాపల్లారా
పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరు ల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా
।।పిల్లల్లారా।।
మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు, ఉన్నాడు పొంచుకున్నాడు
మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు, ఉన్నాడు అతడున్నాడు
భారత మాతకు ముద్దుల పాపలు మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతులేని ప్రేమలే
।।పిల్లల్లారా।।
భారతదేశం ఒక్కటే ఇల్లు భరతమాతకు మీరే కళ్లు
మీరే కళ్లు మీరే కళ్లు
జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం కాపాడండి
బడిలో బయటా అంతా కలిసి భారతీయులై మెలగండి
కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండి
వీడని బంధం వేయండి ।।పిల్లల్లారా।।
(దారశథి గారి రచన)
జెండా ఊంఛా రహే హమారా
విజయీ విశ్వ తిరంగా ప్యారా
జెండా ఊంఛా రహే హమారా ।।జెండా।।
సదా శక్తి బర్సానే వాలా
ప్రేమ సుధా సర్సానే వాలా
ఎరోంకో హర్షానే వాలా
మాతృభూమికా తన్‍ మన్‍ సారా
।।జెండా।।
స్వతంత్రతాకీ భీషణ రణ్‍ మే
లగ్‍కర్‍ బఢె జోష్‍ క్షణ్‍ క్షణ్‍మే
కావే శత్రు దేఖ్‍కర్‍ మన్‍మే
మిట్‍ జావే భయ సంకట్‍ సారా ।।జెండా।।
ఇన్‍ ఝండేకే నీచే నిర్భయ
లే స్వరాజ్య యహ అవిచల నిశ్చయ్‍
బోలో, భారత్‍ మాతా కీ జయ్‍
స్వతంత్రతా హి ధ్యేయ హమారా ।।జెండా।।
ఇస్‍కీ షాన్‍ నీజానేపావే
చాహె జాన్‍ భలేహి జాయె
విశ్వ విజయ కర్‍ కే దిఖ్‍ లావే
తబ్‍ హువే ప్రణ పూర్ణ హమారా ।।జెండా।।
భావం: ప్రీతికరమైన మన త్రివర్ణ పతాకం విజయంతో విశ్వంలో ఎగురు గాక! ఎప్పుడూ శక్తిని విరజిమ్మేది ప్రేమామృతం చిలికేది వీరులకు స్ఫూర్తినిచ్చేది మాతృభూమి. తనువుకు మనసుకు ప్రతీకగా ఉండేది. భీకరమైన స్వాతంత్య్ర పోరాటంలో క్షణక్షణం శత్రువులను ఎదిరించే స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ పతాకాన్ని చూసినంతనే మనసుల్లో భయభ్రాంతులు ఎగిరిపోతాయి. ఈ పతాకపు నీడలో భయం లేని వారమై, స్థిరచిత్తులమై స్వరాజ్యం సాధించేందుకు నిర్ణయించుకుని స్వాతంత్య్రమే మా లక్ష్యమని, భరతమాతకు జయమని నినాదమిస్తున్నారు. ప్రాణాలు పోయినా ఈ పతాక గౌరవాన్ని రక్షించు కోవాలి. విజయం సాధించి చూపిస్తాము. అప్పుడే మన ప్రతిజ్ఞ నెరవేరుతుంది.

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top