అనగనగ నక్క పంది

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చు

ఒక అడవిలో నక్క, పంది జతగా ఉండేవి. అడవిలోని జంతువులన్నీ నక్కను, పందిని తమ రాజులుగా కొలిచేవి. మామూలుగా అవి రెండూ అడవిలోనే కలిసి మేత మేస్తుండేవి. అయితే, ఒకనాడు నక్క రాజు, పంది రాజు మేతను వెతుక్కుంటూ ఒక ఊరి వైపు నడక సాగించాయి. అలా వెళ్తూ వెళ్తూ ఊరి ముంగిట కనిపించిన ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించాయి. అక్కడ ఆ రెండింటికీ కావాల్సినంత ఆహారం లభించింది. ఆ రోజు తోటలో దొరికిన ఆహారం వాటికి చాలా రుచికరంగా తోచింది. అక్కడ తమకు నచ్చిన ఆహారం కుప్పలు తెప్పలుగా ఉండటంతో అటు తరువాత నక్క, పంది రోజూ తోటకు వెళ్లి కడపునిండా మేత మేయడం మొదలెట్టాయి.
నిత్యం కులాసాగా నడుచుకుంటూ తోటకు వెళ్లడం, అక్కడ కావాల్సినంత తినడం.. ఆపైన అడవికి తిరిగొచ్చి కంటినిండా నిద్రపోవడం.. ఇదే ఇద్దరికీ రోజువారీ దినచర్యగా మారింది. తోటలోకి చేరుకున్న వెంటనే నక్క, పంది రెండూ తమకు దొరికిన ఆహారం మీదకు దూకేవి. అయితే, నక్క త్వరగా మేసేసి తోట నుంచి బయటకు వచ్చి కూతలు పెట్టేది. పంది మాత్రం నిదానంగా, కడుపు నిండా తిన్నాక కానీ అక్కడి నుంచి కదిలేది కాదు. అలా ఈ తతంగమంతా రోజూ నడుస్తోంది. అవి అలా తినడంవల్ల తోట రోజు రోజుకూ ధ్వంసం అవసాగింది. దాంతో తోట యజమానికి అనుమానం వచ్చింది. తోట అలా ధ్వంసం అవడానికి కారణం ఎవరా అని ఆలోచించి, ఒకరోజు తోట దగ్గర కాపు కాచాడు. అప్పుడు నక్క పెట్టే కూతలు వినిపించాయి యజమానికి, దాంతో తోటలోకి వెళ్లి చూడగా ఓ పక్క పంది తోటలో మేస్తూ కనిపించింది. దాంతో విషయాన్ని గ్రహించాడు. అప్పుడు ఆ రెండిటిని ఎలా బంధించాలి అని బాగా ఆలోచించి రెండు వేటకుక్కలను పట్టుకొచ్చాడు. ఆ మర్నాడు నక్క కూతలు పెట్టే సమయానికి వాటిని తోటలోకి వది లాడు. ముందుగా తినేసి తోట బయటకు వెళ్లి అలవాటుగా కూసిన నక్క.. వేటకుక్కల రా••ను పసిగట్టి వేగంగా అడవిలోకి పారిపోయింది. కానీ, ఇంకా తోటలోనే తీరుబడిగా మేస్తున్న పంది మాత్రం వేటకుక్కలకు దొరికిపోయింది. వెంటనే తోట యజమాని దానిని చెట్టుకు కట్టేశాడు. ఆపై దానితో-
‘ఇన్నాళ్లూ నా తోటలోని పంటనంతా తిన్నావు. అందుకు గాను నువ్వు నాకు నష్ట పరిహారం తప్పక చెల్లించాలి’ అన్నాడు.
‘నా దగ్గర ఏముంది మీకు ఇవ్వడానికి? ఒక సంవత్సరం పాటు మీరు చెప్పిన పని చేసుకుంటూ ఉండిపోతాను. ఆ విధంగా మీ బాకీ తీరుస్తాను’ అని పంది బదులిచ్చింది.
‘ఇప్పుడు దారిలోకి వచ్చింది’ అనుకున్న యజమాని దానిని తోటలోనే పనికి పెట్టాడు. పంది యజమాని చెప్పిన పనులు చేసుకుంటూ అక్కడే ఉండిపోయింది. కాగా, పారిపోయిన నక్క పరిస్థితి వేరేగా ఉంది. అది బాగా తినమరిగింది. తన మిత్రుడైన పంది వేటకుక్కలకు దొరికిపోయిన తరువాత కూడా నక్క ఆ తోటకు వెళ్లకుండా ఉండలేకపోయింది.
‘నా అంతటిది వేటకుక్కలకు దొరుకుతుందా?’ అని మనసులోనే గర్వంగా అనుకుని తోటలోకి మేతకు వెళ్లింది. అయితే, వేటకుక్కలకు దొరికిపోయింది. దీంతో పందితో కలిసి అది కూడా ఆ తోటలో పని చేయాల్సి వచ్చింది. అయితే, అప్పటికి పందికి పని చేయడం బాగా అలవాటైంది. రోజంతా కష్టపడేది. కొత్తగా చేరిన నక్కకు పని అలవాటు కాలేదు. పని చేయడానికి మనసొప్పేది కాదు. దీంతో ఓ చెట్టు కింద పడుకుని నిద్రోతూ ఉండేది. సరిగ్గా తోట యజ మాని వస్తాడనగా నిద్రలేచి, పంది వద్దకు వెళ్లి ‘యజమాని అన్నం తెచ్చే వేళయ్యింది. పోయి కాళ్లూచేతులూ కడుక్కుని రా’ అని పందిని అటు పంపేది. అది అటు వెళ్లగానే నక్క తన ఒంటికి బురద పూసుకునేది. యజమాని వచ్చి నక్కను చూడగానే, ‘ఆహా.. నక్క బాగా పనిచేస్తోంది’ అనుకునేవాడు. పంది చాలా శుభ్రంగా కని పించేది. దీంతో అది పని చేయడం లేదని అతను భావించేవాడు. దీంతో నక్కకు బాగా ఇష్టంగా, ప్రేమగా తిండి పెట్టేవాడు.
యజమాని వెళ్లగానే, నక్క పందితో- ‘చూశావా? రైతుకు నేనంటే ఎంత ప్రేమో? నువ్వు కూడా నాలాగే చెట్టు నీడనే పడుకో. పని అసలు చేయకు. అప్పుడు కానీ యజమాని నీకు కడుపు నిండా తిండి పెట్టడు’ అంది. అయితే, ఒకనాడు నక్క ఖర్మ కొద్దీ, ఏదో పనిబడి యజమాని రోజూ కంటే ముందే వచ్చేశాడు. ఆ సమయానికి నక్క ఓ కొబ్బరి చెట్టు నీడన పడుకుని ఉంది. రైతు దాన్ని చూసి కూడా ఏమీ అనకుండా, తన పని తాను చేసుకోసాగాడు. ఇంతలో యజమాని వచ్చే సమయం అయిందని నక్క హడావుడిగా లేచింది. అది రోజూ మాదిరిగా పందిని కాళ్లూ చేతులూ కడుక్కుని రమ్మని పంపడం, నక్క ఒళ్లంతా బురద పూసుకోవడం.. అంతా యజమాని చూశాడు. దీంతో యజమాని నక్కను పట్టుకుని ఎండు మిరపకాయలతో పొగబెట్టాడు.
నీతి: నిజం నిలకడ మీద తేలుతుంది.

Review అనగనగ నక్క పంది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top