జిత్తుల మారి నక్క

శ్యామ్‍ అనే పేరు గల జిత్తులమారి నక్క ఒక అడవిలో నివసిస్తూ ఉండేది. దానికి స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ నక్క అందర్నీ మోసం చేస్తూ ఉంటుంది. కుక్క, తోడేలు మొదలైన జంతువులు కూడా యీ నక్కతో కలియవు. స్నేహం చేయవు. దాని నుండి తప్పించుకుని తిరుగుతాయి. రాత్రి వేళ యితర జంతువుల్ని తన కూతతో భయపెడుతుంది. నిశ్శబ్దంగా ఉండే రాత్రిళ్లు దాని కూత వల్ల వేటికీ నిద్ర లేకుండా పోయింది.
చిన్న జంతువులు వాటి బొరియలలో దాక్కునేవి. పైగా ఆ నక్క గొప్పలు చెప్పు కుంటూ ఉంటుంది. ‘‘నాకంటే గట్టిగా ఎవరూ అరవలేరు. నా అరుపు వింటే అన్ని జంతువులు భయపడతాయి’’ అనేది. ఆ విధంగా నక్క చాలా దారు ణంగా తయారయింది. అలా అరవ వద్దని చెప్పే ధైర్యం ఏ జంతువు లేదు.
ఒకరోజున దాని జిత్తులు యింకొక రకంగా మారాయి. దానికి డైనోసార్‍ యొక్క ముఖం దొరికింది. అది తగిలించుకుని ‘‘చూశారా! ఈ రోజు నుండి నేను డైనోసార్‍ని దానకున్న బలం ధైర్యం నాకూ ఉన్నాయి. విశ్వాన్నంతటినీ భయపెట్టగలను. నేను యిప్పటి నుండి యీ ముఖాన్ని తగిలించు కుంటాను’’ అని ప్రకటించింది.
చిన్న జంతువులు భయంతో వణికి పోయాయి. ఆ డైనోసార్‍ చేసే నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాయి. నక్క ఆ అడవికి రాజులా పరిపాలిస్తూంది. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒక రోజు ఆ నక్క అడవిలో ఒక మారు మూలకి వెళ్లింది. అది ఒంటరిగా ఉంది. ఆ ముసుగుతో ఉండడం వల్ల అరవలేకపోయింది. అంతలో ఒక పెద్ద శిలలాంటి జంతువు దానికి ఎదురుగా వచ్చింది. నక్క తన కళ్లని తానే నమ్మలేకపోయింది. అది నిజమైన డైనోసార్‍. దాని బలం ముందు దీని బలం ఎంత? అటువంటి పెద్ద జంతువుల్ని గురించి నక్క విన్నది. ఆ జంతువులు కొన్ని శతాబ్దాల క్రితం ఉండేవి.
సహాయం కోసం నక్క అరవడానికి ప్రయత్నించింది. కాని ఒక్క జంతువు కూడా దానికి సహాయం రాలేదు. డైనోసార్‍ నక్కని తన పాదాలతో తొక్కి చంపింది. తరువాత తన ఆహారం కోసం వెతుకుతూ వెళ్లిపోయింది.
ఇతర జంతువుల యెడల అతి క్రూరంగా ప్రవర్తించిన నక్క అంత క్రూరంగానే చని పోయింది.

మా తెలుగు తల్లి
మా తెలుగు తల్లి కి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుమురిపాల ముత్యాలు దొరలుతాయి.
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లి ! జై తెలుగు తల్లి

Review జిత్తుల మారి నక్క.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top