మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస
హైదరాబాద్‍కి దక్కనీ ఉర్దూ భాషా సాహిత్యాల్లో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. భాషా సాహిత్యంలోనూ, వాడుక లోనూ సమయానుకూలంగా, సంద ర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబగులు అద్దాయి. దక్కనీ జన జీవితంలో ఉన్న ఉర్దూ సామెతల సమాహారమే.. ఉర్దూ భాషా సౌందర్యానికి ప్రతీక. జీవన విలువ లను, వ్యక్తిత్వ పాఠాలను నేర్పే ఆ సామెతలివిగో..
జైసీ రాజా వైసీ ప్రజా
యథా రాజా తథా ప్రజ అని మన తెలుగులో ఒక సామెత ఉంది. ఉర్దూలో జైసీ రాజా వైసీ ప్రజా అటువంటిదే. పాలకుడైన రాజు ఎలా ఉంటే ఆ రాజ్యంలోని ప్రజలు అలాగే ఉంటారని భావం. అంటే రాజు మంచి పాలకుడైతే ప్రజలూ బాగుంటారు, చెడ్డ పాలకుడైతే వారూ అలాగే ఇబ్బందులు పడతారనే అర్థంలో ఈ సామెతను హైదరాబాద్‍తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా వాడుతుంటారు. అలాగే, ఇంట్లో పెద్దలు ఎలా ఉంటే ఆ ఇంట్లో పిల్లలు అలాగే తయారవుతారని, కాబట్టి పెద్దలు క్రమశిక్షణతో, మంచి నడవడితో ప్రవర్తించాలనే పాఠాన్ని ఈ సామెత మనకు నేర్పుతుంది.
చార్ దిన్ కీ చాంద్నీ ఉస్కేబాద్ అంధేరా
జీవితం మూడునాళ్ల ముచ్చట. అది ముగిసిందంటే ఆ తరువాత అంతా చీకటే అనే అర్థంలో ఈ సామెతను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వెన్నెల వెలుగులు నాలుగు రోజులే.. ఆ తరువాత చీకటే, జీవితం మూడునాళ్ల ముచ్చట లేదా జీవితం వెలుగునీడల సయ్యాట అనే ప్రయోగాలతో ఈ సామెతను వాడతారు. జీవితంలో విషాదకరమైన సందర్భాలు ఎదురైనపుడు, కష్టాలు కలిగినపుడు ఈ సామెత ప్రయోగం వాడుకలోకి వస్తుంటుంది.
లోహా లోహెకో కాట్తా హై
వజ్రం వజ్రాన్నే కోస్తుంది అని అర్థం. కొంచెం అటూఇటూగా దీనిని పోలే సామెత ఒకటి తెలుగులో ఉంది. అదే- వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అని. ఏదైనా సంక్లిష్ట మైన సమస్య ఎదురైనపుడు ఆ సమస్యను ఆ సమస్యకు చెందిన అంశాలతోనే పరిష్కరించు కోవాలనే అర్థం వచ్చేలా ఈ సామెతను వాడుతుంటారు.
జాన్ హై తో జహాన్ హై
బతికి ఉంటే బలుసాకు అయినా తిని బతకొచ్చు అని తెలుగులో మంచి సామెత ఉంది. అటువంటి అర్థాన్నిచ్చేదే ఉర్దూలోని ఈ సామెత. మన తెలుగులోది ముతక సామెత. ఇది కొంచెం జీవితానికి అద్దం పట్టేది, బతుకు విలువను చాటేది, సూచించేది ఈ సామెత. మనం బతికి ఉన్నంత వరకే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం కూడా ఉంటుంది. ఆ తర్వాత అంతా శూన్యం అనే ఒక గొప్ప తాత్విక భావనకు ఈ సామెత అద్దం పడుతుంది. గొప్ప అస్తిత్వ వాదం ఇందులో ఇమిడి ఉంది. మొత్తానికి బతుకునకు పట్టం గట్టే సామెత ఇది. అంతే కదా! మనం ఉన్నంత వరకే ఈ బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, సంపదలు, బాధలు.. మనిషి పోయాక ఇవన్నీ వెంట రావు. జీవితం ఉన్నంత వరకే నీ వెంట ఉన్నవన్నీ ఉంటాయి. భూమిపై మన ఉనికి కనుమరుగైన మరుక్షణం అంతా శూన్యమే. అదే భావాన్ని ఎంతో తాత్వికంగా ఈ సామెత ఒక్క వాక్యంలో చెబుతుంది.
ఊట్ కే మూమే జీరే కా దానా
ఒంటె నోట్లో ఒక జీలకర్ర గింజ పెడితే అది ఏ మూలకు సరిపోతుంది? బర్రెలను తినే రాక్షసుడికి గొర్రెలు ఏ మూలకు సరిపోతాయి? అదే విషయాన్ని ఈ సామెత చెబుతుంది. ఏనుగులు తినేవాడికి పీనుగులు పిండాకూడు అనే తెలుగు సామెతకు ఇది సరిజోడు అనుకోవచ్చు.
జీవం ఉన్నవరకే ఈ జీవితం

Review జీవం ఉన్నవరకే ఈ జీవితం.