మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
కొండ మీది..
కొండ మీది గుండు జారి
కొక్కిరాయి కాలు విరిగె
దానికేమందు?
వేపాకు పసుపూ, వెల్లుల్లి పాయ
నూనెమ్మ బొట్టు – నూటొక్కసారి నూరి
పూటకొక్కసారి పూయవోయ్
నారింజ కాయ
నారింజ కాయ నిన్ను చూడగానే నా నోరూరు
తొక్కవిప్పి తినగ అబ్బబ్బ పులుపు తిననె తినను,
తీసి నేలకేసి కొడ్తాను.
వంకరటింకర
వంకరటింకర సొ సొంఠి
వాని తమ్ముడు అ – అల్లమ్
నల్లగుడ్ల మి•మిరియాలు
నాలుగు కాళ్ల మేక.
బుజ్జి మేక
పిల్లలు: బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెలితివి?
బుజ్జి మేక: రాజుగారి తోటలోన మేతకెల్తిని.
పిల్లలు: రాజుగారి తోటలోన ఏమి చూస్తివి?
బుజ్జి మేక: రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని.
పిల్లలు: పూల చెట్లు చూసి నీవు ఊరుకుంటివా?
బుజ్జి మేక: ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని.
పిల్లలు: మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను?
బుజ్జి మేక: తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని.
రావోయి చందమామ
రావోయి చందమామ రావోయి జాబిల్లి
రావోయి, రావోయి చిన్నిపాపడా
తేవోయి చిన్నిచినుకు తేవోయి మబ్బు తునక
తేవోయి తేవోయి చిన్నిపాపడా
తేవోయి నీలాలు తేవోయి వెన్నెలలు
తేవోయి, తేవోయి చిన్నిపాపడా
బొజ్జలోని కాకిపిల్ల వజ్జనున్న చుక్కపిల్ల
తేవోయి తేవోయి చిన్నిపాపడా
కొలనిలో అల్లలనెక్కి చెలగి యుయ్యాలలూగి
కులుకవోయి వెన్నెలాలు చిలికి పాపడా
అద్దమిదిగొ రావోయి ముద్దుమో మద్దమందు
దిద్దుకో రారమ్ము ముద్దుపాపడా
ఎల్లప్పుడు కొండనెక్కి జల్లగా నాడుచుండు
ఇల్లులేదొ? తల్లిలేదొ? చిన్నిపాపడా
బిరబిరబిర కొండనెక్కి పరువిడుదుచు గబగబగబ
వెరపులేదొ? వెరగు లేదొ? చిన్నిపాపడా
ఎందరెందరో చిన్ని చందమామనిచట పిలువగా
ఎందుకురా ఓయనవో చిన్నిపాపడా
నిన్ను అమ్మముద్దిడదని కన్నులలో ఏడ్పు వచ్చె
అన్ని బొమ్మలిత్తురార చిన్నిపాపడా
(చింతా దీక్షితులు, దేవులపల్లి క•ష్ణశాస్త్రి)
Review తేవోయి నీలాలు తేవోయి వెన్నెలలు.