‘తోడేలు’ అని అర్చిన బాలుడు

ఒక బాలుడు గొర్రెల్ని కాస్తూ
ఉండేవాడు. అతడు గొర్రెల్ని అడవికి తీసుకుని వెళ్లి, వాటిని మేపి, తిరిగి యింటికి తీసుకుని వస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు అడవిలో గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. అతనికి విసుగు పుట్టింది. ఆ అడవిలో యింకా గ్రామస్తులు ఉన్నారు. వారిలో కొంతమంది కట్టెలు కొడుతున్నారు. ఇంకా కొంత మంది పండ్లు, కాయలు కోస్తున్నారు. ఆ బాలుడు వాళ్లని ఆటపట్టించాలనుకున్నాడు.
వెంటనే ఆ బాలుడు, ‘‘తోడేలు, తోడేలు, రక్షించండి, రక్షించండి!’’ అని గట్టిగా అరిచాడు. అడవిలో ఉన్న గ్రామస్తులు, ఇళ్ల వద్ద నున్న గ్రామస్తులు అతని కేకలు విన్నారు. వెంటనే వారు తమ పనుల్ని మానుకుని అతనికి సహాయం చేయడానికి పరుగెత్తారు. వారు ఆ బాలుని వద్దకు వచ్చి తోడేలు ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ బాలుడు బిగ్గరగా నవ్వాడు. ‘‘హ, హ! నేను మిమ్మల్ని ఆటపట్టించడానికి అలా కేకలు వేశాను’’ అన్నాడు.
కొన్ని రోజులు గడిచాయి. ఆ బాలుడు మళ్లీ యింకొక సారి అలాగే కేకలు వేశాడు. ‘‘తోడేలు, తోడేలు, రక్షించండి, రక్షించండి!’’ అని గట్టిగా కేకలు వేశాడు. అప్పుడు కూడా గ్రామస్తులు అతనిని రక్షించడానికి పరుగు పరుగున వచ్చారు. కాని అప్పుడు కూడా ఆ బాలుడు ఆటపట్టించడానికే అలా కేకలు వేశాడని గ్రహించి, తిరిగి వెళ్లిపోయారు. వారికి ఆ బాలుని మీద కోపం వచ్చింది. అటువంటి చిలిపి పనులు ఎప్పుడూ చేయవద్దని మందలించారు.
మరికొన్ని రోజుల గడిచాయి. అడవిలోకి నిజంగా ఒక తోడేలు ప్రవేశించింది. అది ఒక గొర్రె తరువాత యింకొక గొర్రెని తినివేస్తుంది. ఆ బాలుడు గట్టిగా ‘‘తోడేలు, తోడేలు, రక్షించండి, రక్షించండి!’’ అని అరిచాడు. గ్రామస్తులు ఆ కేకలు విన్నారు. వారు తమను ఆట పట్టించడానికే అలా అరుస్తున్నాడని నవ్వుకున్నారు. ఆ బాలుడు దగ్గరగా ఉన్న ఒక గ్రామస్తుని వద్దకు పరుగెత్తుకుని వెళ్లి, ‘‘ఒక తోడేలు వచ్చి గొర్రెల్ని తినివేస్తూంది. నేను యిది వరకు అబద్ధం చెప్పాను. ఈసారి తోడేలు నిజంగా వచ్చింది. రక్షించండి’’ అని వేడుకున్నాడు. చివరికి గ్రామస్తులు నిజమో, కాదో తెలుసుకోవాలని అక్కడికి వెళ్లారు. తోడేలు గ్రామస్తుల్ని చూసి పారిపోయింది. అక్కడ చాలా గొర్రెలు చనిపోయి పడి ఉన్నాయి.
కాబట్టి ఎప్పుడూ అబద్దాలు చెప్పే వానిని నిజంగా అతడు నిజం చెప్పినా నమ్మం. అందువల్ల ఎప్పుడూ అబద్దాలు ఆడకూడదు.

Review ‘తోడేలు’ అని అర్చిన బాలుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top