నసీరుద్దీన్ తుఫాన్

నసీరుద్దీన్‍… ఈ పేరు విన్నారా? మన తెనాలి రామకృష్ణుడి మాదిరిగానే నసీరుద్దీన్‍ కూడా మంచి చమత్కారి. హాస్యకారుడు. భారతీయ బాల సాహిత్యంలో నసీరుద్దీన్‍ కథలది చెరగని ముద్ర. పిల్లలు నసీరుద్దీన్‍ కథలు చదవడానికి, వినడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఆ చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా పంచతంత్రం కధలు, కాశీమజిలీ కథలు, మర్యాదరామన్న కథలు.. పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పడానికి ‘తెలుగు పత్రిక’ సిద్ధంగా ఉంది. ప్రతి మాసం ఒక్కో నీతి కథ.. పిల్లలూ సిద్ధమేనా.
ఒకసారి నసీరుద్దీన్‍, అతని కొడుకు పడవలో ఇతర ప్రయాణికులతో పాటు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు.
ఇంతలో హఠాత్తుగా తుఫాన్‍ వచ్చింది. ఎవరికి వారు రక్షించమని అల్లాను ప్రార్థిస్తున్నారు. బయటపడిన తరువాత ఏమేమి సమర్పించదలచుకున్నారో ఏకరువు పెట్టడం మొదలు పెట్టారు.
నసీరుద్దీన్‍ కూడా అల్లాను ఈ గండం నుండి తప్పిస్తే తెరచాప కొయ్యలంత కొవ్వొత్తులు వెలిగిస్తానని మొక్కుకున్నాడు.
అది విని అతని కొడుకు ‘‘నాన్నా! నాన్నా! మనం బతికి బయటపడ్డామనుకో అప్పుడు తెరచాప కొయ్యలంత కొవ్వొత్తులు ఎక్కడి నుంచి తెస్తాం’’ అన్నాడు.
దానికి నసీరుద్దీన్‍ ‘‘ష్‍… ఊరుకో! ఈ ఆపద నుంచి గట్టెక్కాక వాటి సంగతి చూసుకోవచ్చు’’ అన్నాడు.

Review నసీరుద్దీన్ తుఫాన్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top